దసరాకు స్పైడర్ సినిమాతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బొక్క బోర్లా పడ్డ మహేష్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో భరత్ అను నేను సినిమాలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో శ్రీమంతుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు భరత్ అను నేను సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మహేష్ బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి రెండు డిజాస్టర్లతో ఉండడంతో ఈ సినిమా అతడి కెరీర్‌కు హిట్ అవ్వడం ఇంపార్టెంట్.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. సినిమాలో మహేష్ సీఎంగా కనిపించనున్నాడు. ప్రొఫెసర్‌గా ఉన్న మహేష్ అనివార్య కారణాల వల్ల పాలిటిక్స్‌లోకి వస్తాడు. తర్వాత జరిగిన పరిణామాలతో మనోడు సీఎం అవుతాడు. మహేష్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు అధికార, ప్రతిపక్షాలన్ని ఒక్కటవుతాయి. వీరిని మనోడు ఎలా ఎదుర్కొంటాడు ? ప్రజల కోసం అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల కుయుక్తులకు ఎలా తిప్పికొట్టాడు ? అన్నదే ఈ సినిమా స్టోరీ.
ఇక మనోడు సీఎం అయ్యే క్రమంలో హీరోయిన్ కైరా అద్వానీతో ప్రేమ వ్యవహారం, ఎమ్మెల్యేలతో ఎత్తులు, పై ఎత్తులు అన్ని స్టోరీలో ఉండనున్నాయని ఇండస్ట్రీ టాక్. సీఎంగా మహేష్ నడిచి వస్తుంటే పక్కనే బాడీ గార్డ్స్ రావడం చూస్తుంటే సీఎంగా మహేష్ ఎలా ఉంటాడో తెలిసిపోతోంది. మహేష్ కుర్ర సీఎంగా స్టైలీష్ లుక్‌లో ఆకట్టుకున్నాడు.