మోడీ జగన్ భేటీ గురించి ప్రశ్నించడానికి మీరెవరు?

ప్రధాని మోడీ మరియు వైస్ జగన్ భేటీ తో నవ్యంద్రలో ఒక్కసారిగా రాజకీయాలు వేడిక్కినాయి .మోడీ  భేటీలో ప్రత్యేక హోదా ,రైతుల గిట్టుబాటు ధర,భూసేకరణ ,చంద్రబాబు అవినీతి మరియు రాష్ట్రంలో ఉన్న సమస్యలు పైన మాట్లాడానని  వైస్ జగన్ చెప్పుతుంటే, టీడీపీ మంత్రులు మరియు నాయకులు లేదు వైస్ జగన్ పైన ఉన్న కేసులు ,మని లాండరింగ్ ఛార్జ్ షీట్లు కేసు లో కూడా జగన్ ని A1 ముద్దయి గా ED చేర్చితే తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని భయంతో నాడు నా మద్దతు కావాలంటే ఎవ్వరైనా నా దగ్గిరికి రావాలి, నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళాను అని చెప్పిన జగన్ ,నేడు మోడీ అడగకపోయినా నేను బీజేపీ కి మద్దతు ఇస్తాను అని చెప్పటం ,కేసులు నుండి తపించుకోవటానికే అని టీడీపీ విమర్శిస్తోంది. అయినా సీబీఐ 11 కేసులలో A1  ముద్దయిగా ఉన్న జగని కి అపాయింట్‌మెంట్‌ ఎలా ఇస్తారు అని బీజేపీ నాయకులని  టీడీపీ విమర్శిస్తున్నారు .

మోడీ ,జగన్ భేటీ పై టీడీపీ నాయకుల విమర్శలకు బీజేపీ నేత ఎమ్మెల్సీ అయినా సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు.జగన్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్‌కు సంబంధించి అధికారులను ప్రశ్నించే అధికారం టీడీపీ మంత్రులకు, నాయకులకు ఎక్కడదని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు  టీడీపీపై విరుచుకుపడ్డారు.ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రధాని మోదీని కలవడంపై టీడీపీకి చెందిన మంత్రులు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శించడం ఎంతవరకూ సమంజసమని సోము వీర్రాజు టీడీపీకి కౌంటర్ ఇచ్చారు

అలా చూసుకొంటే దేశంలో అనేక మంది రాజకీయ నాయకులపై సీబీఐ కేసులు ఉన్నాయి అని వాళ్లందరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం బీజేపీ లక్ష్యం కాదన్నారు. బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో సీబీఐ కేసు ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీపై పోటీ చేసి విజయం సాధించారన్నారు. అలా అయితే వైసీపీకి రాష్ట్ర కేబినెట్ హోదా కలిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్ పదవిని ఎందుకు మీరు ఇచ్చారని ప్రశ్నించారు. విధానాలు వేరు, రాజకీయాలు వేరని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ రాష్ట్రపతిని కూడా కలిశారని, మరి ఆ విషయాన్ని ఎందుకు టీడీపీ తప్పుబట్టడం లేదని విమర్శించారు . దీనికి టీడీపీ వైపునుండి రియాక్షన్ ఎలా ఉంటాదో !