అఖిల‌ప్రియ‌కు చంద్ర‌బాబు షాక్‌

September 10, 2017 at 3:35 pm
buma Akhila Priya, Chandra babu, TDP

ఏపీ పాలిటిక్స్ మాంచి ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. అటు విప‌క్ష వైసీపీకి వ‌రుస‌గా షాకుల మీద షాకులు త‌గులుతుంటే ఇటు అధికారంలో ఉన్న టీడీపీలో కూడా వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఎవ‌రికి ఎప్పుడు ఏ షాక్ త‌గులుతుందో ? చెప్ప‌లేం అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారింది. కొద్ది నెల‌ల క్రితం మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో కొంద‌రు మంత్రుల‌కు షాక్ ఇచ్చిన చంద్ర‌బాబు ఇప్పుడు మ‌రోసారి ప్ర‌క్షాళ‌న‌కు దిగ‌నున్నార‌న్న వార్త‌లు ఏపీ టీడీపీ వ‌ర్గాల్లో జోరుగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఈ యేడాది ఆరంభంలో జ‌రిగిన మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో కొంద‌రు మంత్రుల‌ను నిర్దాక్షిణ్యంగా ప‌క్క‌న పెట్టేసి చాలా మంది కొత్త ముఖాల‌కు చోటు క‌ల్పించిన చంద్ర‌బాబు ఇప్పుడు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని డిసైడ్ అయిన నేప‌థ్యంలో ఈ కేబినెట్‌తో ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం కంటే బాగా వాయిస్ ఉండ‌డంతో పాటు స‌మ‌ర్థులైన వారిని కేబినెట్‌లోకి తీసుకుని వారికి కీల‌క శాఖ‌లు అప్ప‌గించ‌డం ద్వారా పాల‌న‌ను, ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి అప్పుడు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌న్న ప్లాన్‌తో బాబు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం మంత్రులుగా ఉన్న వారిలో కొంద‌రికి ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మంత్రులలో తెలియని ఒక ఆందోళన మొదలైంది. ఎవరి పదవులు ఊడిపోతాయో అని టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఎవ‌రి ఆశ‌లు, ఎవ‌రి ఆందోళ‌న‌లు ఎలా ఉన్నా మంత్రి అఖిల‌ప్రియ‌ను బాబు త‌ప్పించి ఆ ప్లేస్‌లో తాజాగా నంద్యాల‌లో గెలిచిన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇస్తార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై చంద్ర‌బాబు ఇప్ప‌టికే కొంత‌మందితో చ‌ర్చించిన‌ట్టు టాక్‌.

ఓవ‌రాల్‌గా 4-6 గురు మంత్రుల‌ను తప్పించి ఆ ప్లేస్‌లో కొత్త‌వారికి చోటు క‌ల్పిస్తార‌న్న ప్ర‌చారం అమ‌రావ‌తి సర్సిల్స్‌లో వినిపిస్తోంది. భూమా ఫ్యామిలీ ఫ్యూచ‌ర్‌లో క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో మ‌రింత‌గా ఇన్వాల్ చేయాల‌న్న ఉద్దేశంతో ఉన్న చంద్ర‌బాబు అఖిల‌ప్రియ మంత్రిగా ఉంటే తాను అనుకున్న రాజ‌కీయ ప్రయోజ‌నం నెర‌వేర‌ద‌న్న ఉద్దేశంతో ఉన్న ఆయ‌న అఖిల‌ను త‌ప్పించి ఆ ప్లేస్‌లో యువ‌కుడు అయిన బ్ర‌హ్మానంద‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ట‌.

ఇక బీజేపీ నేత కామినేని స్థానంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుకు మంత్రి పదవి ఇవ్వాలని కేంద్ర పెద్దలు సిఫార్సు చేసే అవకాశాలు ఉన్నాయ‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏదెలా ఉన్నా కొద్ది నెల‌ల క్రిత‌మే మంత్రిగా ఎంపికైన అఖిల‌ప్రియ త‌న శాఖ‌లో మ‌రీ హిట్ అవ్వ‌లేదు..అలాగ‌ని అట్ట‌ర్ ప్లాప్ కూడా అవ్వ‌లేదు. మ‌రి ఇంత త‌క్కువ టైంలోనే ఆమెను త‌ప్పించేస్తారా ? అన్న సందేహాలు ఉన్నా..ఆ ప్లేస్‌లో అదే ఫ్యామిలీకి చెందిన వారికి బెర్త్ ఇవ్వ‌డంతో పెద్ద ఇబ్బంది ఉండ‌ద‌ని కూడా మ‌రికొంద‌రు అంటున్నారు. ఏదేమైనా అఖిల‌ప్రియ‌ను త‌ప్పించే అంశానికి సంబంధించిన న్యూసే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌.

 

అఖిల‌ప్రియ‌కు చంద్ర‌బాబు షాక్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts