ప‌వ‌న్ – మ‌హేష్ సినిమాల‌కు బ‌య్య‌ర్ల క‌రువు

టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, ప్రిన్స్ మ‌హేష్‌బాబు సినిమాలు వ‌స్తున్నాయంటే థియేట‌ర్లు ప్రేక్ష‌కుల‌తో ఎలా పోటెత్తుతాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరి సినిమాలు రిలీజ్‌కు వారం రోజుల ముందు నుంచే ఉండే హంగామా మామూలుగా ఉండ‌దు. వీరికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ ఇండియాలోను, ఓవ‌ర్సీస్‌లోను ల‌క్షల్లోనే ఫ్యాన్స్ ఉంటారు.

అయితే అలాంటి క్రేజ్ ఉన్న ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాలు కొనేందుకు ఇప్పుడు బ‌య్య‌ర్లు లేకుండా పోయారు. విన‌డానికి ఇది కాస్త షాకింగ్‌గా ఉన్నా నిజ‌మే. ఓవ‌ర్సీస్‌లో వీరి సినిమాలు మంచినీళ్లు తాగినంత సులువుగానే 1 మిలియ‌న్ డాల‌ర్లు దాటేసి 2 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేస్తుంటాయి. అయితే ఇప్పుడు అక్క‌డ వీరి సినిమాలు కొనేందుకు బ‌య్య‌ర్లు వెనుకంజ వేస్తున్నార‌ట‌.

మ‌హేష్ పేరు చెపితే ఓవ‌ర్సీస్ జ‌నాల‌కు పూన‌కం వ‌చ్చేస్తుంది. అక్క‌డ మ‌హేష్ డిజాస్ట‌ర్ సినిమాల‌కు సైతం సులువుగానే 1 మిలియ‌న్ డాల‌ర్లు వ‌స్తుంటాయి. అయితే అక్క‌డ అదే మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం ఘోర‌మైన డిజాస్ట‌ర్ అయ్యింది. ఇక ఇప్పుడు వీరు న‌టించిన సినిమాల ఓవ‌ర్సీస్ రైట్స్‌కు భారీ రేట్లు చెపుతుండ‌డంతో అక్క‌డ బ‌య్య‌ర్లు వెన‌కంజ వేస్తున్నారు.

పవన్ – త్రివిక్రమ్ సినిమా రేటు 16-18 కోట్లు చెబుతోంటే, మ‌హేష్ – మురుగ‌దాస్ సినిమాకు మూడు భాష‌ల్లోను క‌లిపి ఏకంగా రూ. 26 కోట్లు అడుగుతున్నార‌ట‌. మ‌రో షాక్ ఏంటంటే అమెరికాలో ప్ర‌స్తుతం థియేట‌ర్ల రెంట్ దారుణంగా పెంచేశారు. ప్ర‌స్తుతం అక్క‌డ ఉన్న ప‌రిస్థితుల్లో బ‌య్య‌ర్ల చేతికి కేవ‌లం గ్రాస్‌లో 45 శాతం మాత్ర‌మే ద‌క్కుతుంది.

ఆ వ‌చ్చిన 45 శాతంలో మ‌ళ్లీ ప‌న్నులు, ఇత‌ర‌త్రా ఖ‌ర్చులు పోగా బ‌య్య‌ర్ చేతికి మ‌హా అయితే 100కు 35 -40 శాతం మాత్ర‌మే ద‌క్కుతుంది. ఈ ప‌రిస్థితుల్లో అంత భారీ రేట్లు పెట్టి సినిమాలు కొనేందుకు ఎవ్వ‌రూ ముందుకు రాని పరిస్థితి.