అక్కడా కేసీర్ యే ముందున్నాడు

తెలంగాణ న్యాయవాదులు, జడ్జీలు, న్యాయాధికారులు చేస్తున్న ఉద్యమాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ ఒక అడుగు ముందుండగా, విపక్షాలు కాసింత వెనుకబడిపోయాయి. ఉమ్మడి హైకోర్టును విభజించాలని న్యాయవాదులు గత కొన్నాళ్లూగా ఆందోళనలు చేస్తున్నారు. హైకోర్టు విభజించకుండానే, జడ్జీలను, న్యాయాధికారుల కేటాయింపుల వల్ల స్వరాష్ట్ర సాధన అనంతరం కూడా తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందని దశలవారీగా వారు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో […]

టీ కాంగ్రెస్ లో కోవర్టులు వున్నారా ?

అస‌లు తెలంగాణ‌ కాంగ్రెస్ పార్టీలో కోవ‌ర్టులు ఉన్నారా, ఈకోవ‌ర్టుల‌తో పార్టీకి న‌ష్టం జ‌రుగుతుందంటారా, ప్రస్తుత ప‌రిణామాలు చూస్తుంటే ఔన‌న్పిస్తోంది. కాంగ్రెస్ పెద్ద‌లు మాత్రం కోవ‌ర్ట‌ల‌తో పార్టీకీ తీవ్ర న‌ష్టం జ‌రుగుతంద‌ని, దీనిపై అధిష్టానం చోర‌వ తీసుకోవాల‌ని, లేకుంటే తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఖాతా క్లోజ్ ఆవుతుంద‌ని టీకాంగ్రెస్ లో కొంత‌మంది పెద్ద‌ల అధిష్టానం ముందు వాద‌న‌లు విన్పిస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి130ఏళ్ల రాజ‌కీయ‌ చ‌రిత్ర ఉందని, ఏంతోమంది నాయ‌కులను త‌యారు చేసింద‌ని, కాంగ్రెస్ పార్టీ స‌ముద్రం లాంటిద‌ని […]

టీడీపిలో అంతర్గతపోరు!

ఆపరేషన్ ఆకర్ష్‌తో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అలజడికి గురిచేసిన అధికార టిడిపిలోనూ ఈ వలసల వల్ల అంతర్గత పోరు తీవ్రమవుతోందన్న వాదనలు ఆ పార్టీలోనే వినవిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ఏకైక లక్ష్యంగా సాగిన ఈ వలసలు తమ పార్టీకి కూడా మున్ముందు పెద్ద సవాల్‌గా మారే ప్రమాదాలు కనిపిస్తున్నాయని టిడిపి నేతలు కొందరు వ్యాఖ్యనిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసవచ్చిన ఎమ్మెల్యేలకు టిడిపిలో ఒకప్పుడు తనకు ప్రత్యర్థిగా ఉన్న […]

కొత్తపల్లి గీత సరికొత్త రికార్డ్!

‘నన్ను గెలిపిస్తే నిరంతరం ప్రజా సేవకు అంకితమవుతాను. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాను’. ఇది 2014 ఎన్నికల సమయంలో అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి వైసిపి తరుపున పోటీ చేసిన కొత్తపల్లి గీత అన్న మాటలు. ఆమె మాట నమ్మిన గిరిజనులు భారీ ఆధిక్యతతో గెలిపించారు. కాని గీత మాత్రం ఓట్లేసి గెలిపించిన గిరిజనులను మోసం చేసింది. నాటి నుంచి నియోజకవర్గానికి వచ్చిన పాపాన పోలేదు. అరకు ఎంపీగా ఎన్నికైన […]

భారత్ ఓడి గెలిచింది-చైనా గెలిచి ఓడింది

గెలిచినట్టు భావిస్తున్న చైనా నిజంగా ఓడిపోయింది. వైఫల్యం పొందినట్టు ప్రచారానికి గురి అవుతున్న మన దేశం విజయం సాధించింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన అణు సరఫరాల కూటమి-ఎన్‌ఎస్‌జి-సర్వ ప్రతినిధి సమావేశంలో చైనా ఒంటరి అయిపోవడం చైనాకు సంభవించిన దౌత్య పరాజయం. చైనా తప్ప కూటమిలోని మిగిలిన దేశాలు దేశానికి బాసటగా నిలబడడం సాధించిన వ్యూహాత్మక విజయం. ఇన్ని దేశాలు మనకు మద్దతు పలికినప్పటికీ ఎన్‌ఎస్‌జిలో మనకు సభ్యత్వం దక్కకుండా చైనా అడ్డుకుంది. ఇలా అడ్డుకోగలగడానికి […]

చలో అమరావతి-అన్నీ కన్నీటి గాధలే

ఊద్యోగుల తరలింపు ప్రక్రియ భావోద్వేగాల మధ్య ప్రారంభం అయింది. ఎన్నో ఎళ్లుగా హైదరాబాద్ లో స్థిరపడిన ఊద్యొగులు అమరావతికి వెళ్లాల్సి రావడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ జీవన శైలిలో భాగమైన ఏపి ఉద్యోగులు, అకస్మాత్తుగా తమ కుటుంబ సభ్యులు, బందువులను వదిలి అమరావతికి వెళ్లాల్సి రావడంతో తమ సొంత రాష్ట్రానికి వెళుతున్నామన్న సంతోషం కన్నా ఇన్నేళ్లుగా కలిసి ఊన్న మహనగరాన్ని వదిలి వెళ్తున్నామన్న వేదన వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తరలింపు డెడ్ […]

బలవంతపు సర్వేలు…. రైతుల్లో కలకలం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు సర్వేలు రైతుల్లో కలకలం రేపుతోంది. రైతులు అనుమతి లేకపోయినా వారి భూముల్లో అధికారులు సర్వేలు చేస్తున్నారు. రికార్డులు సరిచేస్తామని నమ్మబలికి రెవెన్యూ అధికారులు సంతకాలు చేయించుకున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు.భైరెడ్డిపాలెంకు చెందిన బోయి గురమ్మకు సర్వే నెంబర్‌ 58లోని 1లో 4 ఎకరాలు భూముంది. ఎయిర్‌పోర్టుకు తన జిరాయితీ భూమిని ఇవ్వనని ఖరాఖండిగా చెప్పింది. అయితే అధికారులు వ్యూహాత్మకంగా గురమ్మ భూ రికార్డులు సరి చేస్తామని చెప్పి సంతకాలు […]

డబ్బులివ్వలేం రాష్ట్రానికి తేల్చి చెప్పిన కేంద్రం

రెవెన్యూ లోటును భర్తీ చేయలేమంటే కుదరదని, విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిందేనని కేంద్రానికి స్పష్టం చేసింది. ఒక్క రైతు రుణమాఫీ తప్ప ఏ ఒక్క పథకాన్ని తాము కొత్తగా తీసుకురాలేదని పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.16,078.76 కోట్ల రెవెన్యూ లోటు తలెత్తింది. కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సాయంగా విడుదల చేసిన రూ.2,303 కోట్లను పరిగణలోకి తీసుకున్న తర్వాత 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 నాటికి రూ.13,775.76 […]

మల్లన్నకు పెరుగుతున్న మద్దతు

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రెండేళ్ల తర్వాత ఓ ప్రజాఉద్యమం ఊపిరి పోసుకుంది. ఈ రెండేళ్లలో విపక్షాలు వివిధ అంశాలపై ఎన్ని ఆందోళనలు నిర్వహించినా లభించని మద్దతు, మల్లన్నసాగర్ భూసేకరణపై రైతులు చేస్తున్న ఉద్యమానికి లభించడం విశేషం. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా ఏటిగడ్డకిష్టాపూర్, పల్లెపహాడ్, వేములగట్, తొగుట గ్రామాలను ముంచేలా నిర్మించనున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం గజం భూమి కూడా ఇచ్చేది లేదన్న నాలుగు గ్రామాల రైతులకు అనుకూలంగా విపక్షాలు, జాక్ చైర్మన్ […]