సీబీఐ కి అగ్రిగోల్డ్-బినామీల్లో వణుకు!

అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు జరగబోతుంది. దర్యాప్తు సి.ఐ.డి. చేతిలోంచి సి.బి.ఐ.కి చేరనుంది. అయితే సిబిఐ దర్యాప్తుతో బాధితులకు న్యాయం జరుగుతుందా..? లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నట్లు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయా.? క్రిమినల్ కేసులను మాత్రమే సిబిఐకి ఇచ్చి భాదితులకు డబ్బులు చెల్లించేందుకు హైకోర్టు ముందుంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇంతకీ సిబిఐ దర్యాప్తుతో ఎవరి పీఠాలు కదలనున్నాయి. ఈ స్కాంలో ఎంతమంది వీఐపీలు భయటపడనున్నారు.అగ్రిగోల్డ్ సంస్థ..20 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని కోర్టును తప్పుదోవపట్టించిన […]

నీటి యుద్దాలు — కేంద్రం దొంగాట

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్దాలు కొనసాగుతున్నాయి. ఇరు తెలుగురాష్ట్రాల మధ్య నీటి సమస్య ను పరిష్కరించలేక కేంద్రం చేతులెత్తేసింది.ఇరు రాష్ట్రాల మధ్యనున్న నీటి సమస్య లను మీరే తేల్చుకోవాలని సూచించింది. కృష్ణా నీటి వాటాలు కొన్నాళ్ల పాటు యధాస్థితి లోనే కొనసాగుతాయని చెప్పింది. ఈ సమస్యకు పరిష్కారం లభించక పోవడం తో మరో నెల రోజుల పాటు గతసంవత్సరం లాగే నీటి వాటాలు ఉంటాయని తెలిపింది. ఈ లోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు […]

జలజగడం-రాజకీయ ప్రయోజనాలే అజెండా!

ఎడ్డెం అంటే  తెడ్డెం.. అన్న చందాన తయారయ్యింది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదం. నీటి ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన నీటి కేటాయింపులపై కేంద్రం వద్ద పంచాయితీ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మంత్రులు హరీష్‌రావు, దేవినేని ఉమామహేశ్వరరావు ఒక్క చోట కూర్చుని చర్చించుకున్నారు. షరామామూలుగానే చర్చలు ఓ కొలిక్కి రాలేదు.  పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం, ఇద్దర్నీ ఓ చోట కూర్చోబెట్టిందిగానీ, ఏకాభిప్రాయాన్నయితే తీసుకురాలేకపోతోంది. ‘ముందు మీరు మాట్లాడుకోండి.. మీకు సయోధ్య కుదరకపోతే ఆ  తర్వాత ఆలోచిస్తాం..’ […]

ముద్రగడ దీక్ష–పోస్టుమార్టం రిపోర్ట్

కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన దీక్షతో అనుకున్నది సాధించారు. తుని విధ్వంసం కేసులో అరెస్టైన పదమూడు మంది విడుదలయ్యేదాకా తాను దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.వారికి బెయిల్ వచ్చి, విడుదలైన తర్వాతనే.. ఆయన బుధవారం నాడు దీక్షను విరమించారు. అనుకున్నది సాధించి, ప్రభుత్వం పైన పైచేయి సాధించినప్పటికీ… ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారనే వాదనలు వినిపిస్తున్నాయి.అరెస్టైన వారి విడుదల కోసం ముద్రగడ పదమూడు రోజుల పాటు దీక్ష చేశారు.దీనిపై […]

కాంగ్రెస్ ఖేల్ ఖతం-ఇది కెసియార్‌ జమానా!!

తెలంగాణలో కాంగ్రెసు పార్టీని ఖతం చెయ్యాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసియార్‌ వడివడిగా అడుగులు వేస్తున్నారు. డి.శ్రీనివాస్‌ని టిఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చి, ఆయనకు రాజ్యసభ పదవిని కట్టబెట్టడం వెనుక వ్యూహం ఇదే. అంతకు ముందే కేశవరావుని కూడా కెసియార్‌, టిఆర్‌ఎస్‌లోకి తీసుకురాగలిగారు. కేశవరావు, డిఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఎంతో కీలక నేతలుగా ఉండేవారు. కాంగ్రెసు పార్టీకి చెందిన ముఖ్య నేత వెంకటస్వామిని కూడా తీసుకురావాలనుకున్నారుగానీ, కుదరలేదు. ఆయన కుమారులిప్పుడు టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళిపోయారు. అతి త్వరలో ఇంకో కాంగ్రెసు ముఖ్య నేత […]

నారాయణా చాలించు నీ అమరావతి లీలలు.

అంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపుపై ఆరు నెలలుగా అదిగో.. ఇదిగో.. అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. రాజధాని శంకుస్థాపన పూర్తయిన వెంటనే గత డిసెంబరు 31 నుంచి ప్లాట్ల కేటాయింపు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. అప్పట్నించి ఇప్పటవరకూ వాయిదాల పరంపర కొనసాగుతోంది. తరువాత జనవరి 31 నుంచి అని ఒకసారి, మార్చి 31 నుంచి అని మరోసారి, మే 31 నుంచి అంటూ ఇంకోసారి ప్రకటించారు. చివరిగా ఈనెల 10 […]

కెసిఆర్ ఆకర్ష్ మజ్లీస్ ను తాకేనా!!

టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కారెక్కేస్తోంటే, కాంగ్రెస్‌ పార్టీ సంబరపడింది. కాంగ్రెస్‌ ఖాళీ అవుతోంటే టీడీపీ సంబరపడ్తోంది. ఇదంతా చూసి, బీజేపీ తమకేంటి సంబంధం అన్నట్లు వ్యవహరిస్తోంది. మజ్లిస్‌ పార్టీ అయితే అసలు తాము తెలంగాణలోనే వున్నామా.? తెలంగాణ రాజకీయాలతో మమేకమయి వున్నామా? లేదా.? అన్నట్లే వుంటోంది. నిన్న టీడీపీ..ఆ తర్వాత వైెస్సార్సీపీ.. ఇప్పుడు కాంగ్రెస్‌.. రేపు ఇంకో పార్టీ. ఆ ఇంకో పార్టీ బీజేపీ కావొచ్చు, మజ్లిస్‌ పార్టీ కావొచ్చు. ఒక్కసారి ఆపరేషన్‌ ఆకర్ష స్టార్ట్‌ అయ్యిందంటే, […]

కాపు నేతల్లో కుమ్ములాటలు!!

ముద్రగడ దీక్షను అడ్డుపెట్టుకుని ప్రాబల్యం కోల్పోయిన కాపు ప్రముఖులు తమ ఇమేజ్ పెంచుకోవాలన్న ఎత్తుగడతో ఉన్నారా? మరికొందరు ముద్రగడ భుజంపై తుపాకి పెట్టి బాబుకు గురిపెట్టారా? వారి కలయిక వల్ల కులానికి నష్టమే తప్ప లాభం లేదా? అధికారంలో ఉన్నప్పుడు కనిపించని వీళ్లంతా ఇప్పుడు గళం విప్పడాన్ని సొంత సామాజికవర్గమే నమ్మడం లేదా? కాపు సంఘాలు, నాయకుల మాటల బట్టి ఇలాంటి సందేహాలే తెరపైకొస్తున్నాయి. రంగాను పోగొట్టుకున్నాం. ముద్రగడను కోల్పోయేందుకు సిద్ధంగా లేమన్న నినాదంతో ఒకే వేదికపైకొచ్చిన […]

కాపులను బీసీల్లో చేర్చడం సాధ్యమేనా…

కాపులను బిసిల్లోకి చేర్చటం డిమాండ్ చేసినంత సులభమా? పోనీ కాపులను బిసిల్లో చేరుస్తామని హామీ లిచ్చినంత మాత్రాన సాధ్యమవుతుందా? ఇపుడు ఈ ప్రశ్నలే రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పై రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం అంత ఈజీ కాదు. ఎందుకంటే అగ్రవర్ణాలుగా చెలామణి అవుతున్న కాపులను బిసిల్లోకి చేర్చాలంటే చాలా పెద్ద ప్రహసనమే జరపాల్సి ఉంటుంది. నిర్ణయం రాష్ట్ర స్ధాయిలో తీసుకున్నా ఆమోదం కొరకు పార్లమెంట్ దాకా వెళ్ళాల్సి వుంటుంది. ఆర్టికల్ 9కి సవరణలు చేయనిదే […]