బీజేపీ నుంచి పురందేశ్వరి అవుట్..జీవీఎల్ స్కెచ్?

ఏపీ బీజేపీలో కొందరు నేతల తిరుగుబాటుతో కల్లోలం నడుస్తోంది. ఊహించని విధంగా నేతల మధ్య మాటల యుద్ధంతో ఏపీ బీజేపీలో చిచ్చు చెలరేగింది. సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి బీజేపీలో వర్గ పోరు మొదలైందనే చెప్పాలి. అయితే ఇంతకాలం సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. సోము వీర్రాజు, జి‌వి‌ఎల్ నరసింహారావు లాంటి వారు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అలాగే వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పే నేతలని నిదానంగా […]

అనపర్తిలో బాబు దూకుడు..భారీగా ప్రజా మద్ధతు!

ఇటీవల కాలంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సభలకు భారీగా జనం వస్తున్న విషయం తెలిసిందే. ఆయన రోడ్ షోలకు పెద్ద ఎత్తున టి‌డి‌పి శ్రేణులు, ప్రజలు వస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన బాబుకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది..మొదట జగ్గంపేట, పెద్దాపురంల్లో భారీగా జనం కనిపించారు. కానీ మూడో రోజు షెడ్యూల్ లో భాగంగా అనపర్తికి వెళ్ళాలి. ఇక అనపర్తి సభకు పర్మిషన్ కూడా ఇచ్చారు. […]

గుంటూరులో కమ్మ నేతల్లో గెలిచేది ఎవరు?

రాయలసీమ ప్రాంతంలో రెడ్డి వర్గం ప్రభావం ఎలా ఎక్కువ ఉంటుందో…ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల్లో కమ్మ వర్గం హవా కాస్త ఎక్కువ ఉంటుంది. ఈ రెండు జిల్లాల్లో రెండు పార్టీల్లోనూ కమ్మ నేతలు ఉన్నారు. అయితే గుంటూరు జిల్లాల్లో అటు టి‌డి‌పి, ఇటు వైసీపీలో కమ్మ నేతలు ఉన్నారు. ఇక ఈ సారి రెండు పార్టీల్లో ఉన్న కమ్మ నేతలు ఎవరు గెలిచి బయటపడతారనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి పోటీ చేసిన కమ్మ నేత […]

కృష్ణాలో మాజీ మంత్రులు మళ్ళీ గట్టెక్కలేరా?

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలని జగన్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు. అయితే మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ పనిచేస్తున్న..అందుకు తగిన విధంగా కొందరు ఎమ్మెల్యేలు పనిచేయడం లేదు. పైగా వారిపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. అలాంటి వారితో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడం అనేది వైసీపీ పెద్ద పరీక్ష అని చెప్పవచ్చు. పైగా టీడీపీ-జనసేన పొత్తు ఉంటే వైసీపీ డేంజర్ జోన్ లోకి వెళ్ళినట్లే. ఇక […]

లోకేష్ పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ డౌన్..నిజమెంత?

లోకేష్ పాదయాత్రతో టీడీపీకి మైలేజ్ రావడం లేదా? ఇంకా టి‌డి‌పి గ్రాఫ్ డౌన్ అయిందా? అంటే వైసీపీ నేతల మాటల్లో మాత్రం టి‌డి‌పి గ్రాఫ్ డౌన్ అయిందనే చెప్పవచ్చు. పాదయాత్రపై మొదట నుంచి వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు పాదయాత్రలో జనం లేరని, లోకేష్‌ని ప్రజలు పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సైతం..లోకేష్ పై విమర్శలు చేశారు. నారా లోకేష్ పాదయాత్రతో […]

పెద్దాపురం సీటుపై క్లారిటీ..రాజప్పకు రూట్ క్లియర్!

గత కొన్ని రోజులుగా పెద్దాపురం సీటుపై కన్ఫ్యూజన్ ఉన్న విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు అక్కడ టి‌డి‌పి నుంచి గెలిచిన నిమ్మకాయల చినరాజప్పని ..ఈ సారి వేరే సీటుకు పంపించి.పెద్దాపురం సీటుని కమ్మ నేతకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ సారి రాజప్పని రాజానగరం సీటుకు పంపిస్తారని, పెద్దాపురం సీటుని కమ్మ వర్గానికి చెందిన బొడ్డు ఫ్యామిలీకి ఇస్తారని టాక్ నడిచింది. కానీ ఆ ప్రచారానికి టి‌డి‌పి అధినేత చంద్రబాబు తాజాగా చెక్ పెట్టారు. తాజాగా పెద్దాపురం […]

కన్నా బాటలో కీలక నేతలు..టీడీపీలోకి జంపింగ్?

అసలు టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని చెప్పి బి‌జే‌పి నేతలు అంటున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్తితులోనూ టి‌డి‌పితో కలవమని అంటున్నారు. ఇటు టి‌డి‌పి శ్రేణులు సైతం బి‌జే‌పితో పొత్తు వద్దు అంటే వద్దు అంటున్నారు. కాకపోతే మధ్యలో జనసేన ఉంది. ప్రస్తుతం బి‌జే‌పితో జనసేన పొత్తులో ఉంది. టి‌డి‌పితో కలవాలని జనసేన చూస్తుంది. అలాంటప్పుడు బి‌జే‌పిని వదిలేసి టి‌డి‌పితో కలిసి రావడమే. అయితే ఖచ్చితంగా టి‌డి‌పితో బి‌జే‌పి పొత్తు ఉండదని తేలడంతో…బి‌జే‌పిలో ఉంటే డిపాజిట్లు […]

తిరుపతి సీటుపై జనసేన పట్టు..టీడీపీ తగ్గట్లేదు.!

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు కలిసి బరిలో ఉంటాయని తెలుస్తోంది. అయితే పొత్తు ఉంటే జనసేనకు టి‌డి‌పి కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటినుంచే జనసేనకు ఇచ్చే సీట్లపై చర్చ నడుస్తోంది. ఇదే క్రమంలో తిరుపతి అసెంబ్లీ సీటు పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే 2009లో ఇక్కడ ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి చిరంజీవి గెలిచారు. ఇక 2014లో టి‌డి‌పి గెలవగా, […]

చిత్తూరుపై నో క్లారిటీ..కుప్పంపై ఆశలు!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టి‌డి‌పికి కొన్ని సీట్ల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. కొన్ని చోట్ల ఇంచార్జ్‌లని ఇంకా డిసైడ్ చేయలేదు. అలా ఇంచార్జ్ లేని స్థానాల్లో చిత్తూరు అసెంబ్లీ కూడా ఒకటి. గత ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి ఏ‌ఎస్ మనోహర్ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన పార్టీని వీడారు అప్పటినుంచి చిత్తూరు స్థానం ఖాళీగానే ఉంది. అక్కడ అభ్యర్ధి ఎవరు అనేది క్లారిటీ లేదు. కాకపోతే ఆ సీటు కోసం కొందరు నేతలు […]