ఈటల వింత వాదన

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.. అక్కడ ఈటల రాజేందర్‌.. టీఆర్ఎస్‌ అభ్యర్థిపై గెలిచారు. అంతే.. ఈ చర్చ ఇపుడు ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు, మూడు రోజులు ఈ విషయాల గురించి మాట్లాడతారు. అంతే.. అయితే గురువారం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాత్రం వింత విషయాన్ని తెరపైకి తెచ్చారు. హుజూరాబాద్‌లో బీజేపీ గెలవడం.. అందులోనూ తాను […]

చెప్పినట్టుగా చెప్పారు.. విన్నట్టుగా విన్నారు..

కొట్టినట్టుగా కొడితే.. ఏడిచినట్టుగా ఏడ్చారనే సామెత ఒకటి తెలుగునాట ఉంది. చిత్తశుద్ధి లేకుండా చేసే పనులకు ఈ సామెత అతికినట్టుగా సరిపోతుంది. తాజాగా ఏపీలో అమరావతి రాజధాని కోసం సాగుతున్న పోరాటానికి భారతీయ జనతా పార్టీ క్రియాశీలంగా అండగా నిలుస్తుందా లేదా అనే సంగతి.. ఈ సామెతకు సరిపోయేలా ఉంది. అమరావతి రాజధాని పోరాటానికి పార్టీ నాయకులంతా మద్దతు ఇచ్చి తీరాల్సిందే అని అమిత్ షా తిరుపతి సమావేశంలో హూంకరించినట్టుగాను, అందరూ అందుకు సమ్మతించినట్టుగానూ వార్తలు వచ్చాయి. […]

ఈటలకు ఉన్న విలువ చంద్రబాబుకు లేదేం?

కుప్పంలో ఓడిపోయిన తర్వాత.. తెలుగుదేశం శ్రేణుల ఆత్మవంచన డైలాగులు మిన్నంటుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం మునిసిపాలిటీని ఎలా చేజిక్కించుకున్నది అనే విషయంలో ఎన్నెన్ని నిందలు వేయాలో అన్నీ వేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ గనుక.. వారు అన్ని రకాల దుర్వినియోగాలకు పాల్పడ్డారని, పోలీసు బలగాలను తమకు అనుకూలంగా వాడుకున్నారని, విచ్చలవిడిగా డబ్బు పంచారని, దొంగఓట్లు వేయించిరని, రౌడీలను మోహరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఉండవచ్చు గాక.. కానీ.. కుప్పం […]

వైసీపీ ఎమ్మెల్యేలపై జనం మంటెత్తి ఉన్నారా?

మునిసిపాలిటీ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేయడానికి- వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, ఆ సీట్లో కొనసాగడానికి సంబంధం లేదనే సంగతి ప్రజలకు చాలా బాగా తెలుసు. అందుకే సాధారణంగా ఇలాంటి స్థానిక ఎన్నికలను పార్టీల కంటె కూడా, స్థానికంగా నాయకుల సొంత బలం, వారి పరిచయాలు ప్రభావితం చేస్తుంటాయి. కానీ ఈ ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇదంతా కూడా జగన్మోహన రెడ్డి సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలకు దక్కిన ప్రజల […]

గుర్తుందా గురూ..మరి ఇప్పుడు .. మండలితో ప్రయోజనం ఉంటుందా?

’రాజకీయ కోణంలో తాత్కాలికంగా బిల్లుల్ని అడ్డుకునేందుకే మండలి ఉంది.. దీనివల్ల కాలయాపన, ప్రజాప్రయోజనాలకు విఘాతం, ఆలస్యం కలగడం తప్ప ఎటువంటి మంచీ జరగని అవకాశం కనిపించడం లేదు..దీనికోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం కూడా దండగ.. అందుకే శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేస్తున్నాం’ అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఇంకా చెవుల్లో మార్మోగుతూ ఉంది. సీన్ కట్ చేస్తే.. ఒకటిన్నర సంవత్సరం గడిచిపోయింది.. శాసనమండలిలో 14 […]

ప్లాన్ – బీ అమలు చేసిన అధినేత

చదరంగమైనా.. రాజకీయమైనా ఎత్తులు..పై ఎత్తులు ఉంటాయి.. ప్రత్యర్థి వేసే ఎత్తును ఊహించి మనం స్టెప్ వేయాలి.. లేకపోతే అంతే.. ఒక్కసారిగా చెక్ పడిపోతుంది.. ఆ తరువాత ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. ఇటువంటి విషయాల్లో రాజకీయ ఉద్ధండుడు కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రత్యర్థి వేసే ఎత్తుకు మరో రెండు, మూడు స్టెప్స్ ముందే ఊహించి ప్లాన్ రూపొందిస్తారు. అవే ప్లాన్ -ఏ, ప్లాన్- బీ.. ముందుగా అనుకున్న ప్రకారం ప్లాన్ – ఏ ను అమలు […]

ఢిల్లీకే కవిత.. ఇదే కన్ఫర్మ్

ఎమ్మెల్సీ పదవీకాలం అయిపోతోంది.. మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేశాయి..అయితే.. మండలిలోకి మళ్లీ ఏం వెళతాం అనే అభిప్రాయంలో ఉన్నారు సీఎం కూతురు కల్వకుంట్ల కవిత. మరేం చేద్దాం.. ఏదో ఒక చట్టసభలో ఆమెకు స్థానం కావాలి.. రాజ్యసభకు పంపిద్దాం.. అరె.. అక్కడ ఖాళీల్లేవుగా.. వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ముక్క పడాల్సిందే.. ఇపుడు అచ్చం తెలంగాణ రాజకీయంలో ఇదే జరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీఆర్ఎస్.. ఆ పార్టీకి చీఫ్, ప్రభుత్వానికి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ […]

పాపం బాబు.. పోరాడుటయా? పారిపోవుటయా?

కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలలో పరాజయం తప్పదని చంద్రబాబునాయుడుకు చాలా కాలం ముందే తెలుసు. స్థానిక పరిస్థితులను ఆయన సరిగానే పసిగట్టారు. ఓటమి తప్పదని గ్రహించగలిగారేమో గానీ.. ఫలితం ఇలా ఉంటుందని, ఇంత ఘోరమైన అవమానకరమైన ఓటమి ఎదురవుతుందని ఆయన అనుకుని ఉండకపోవచ్చు. 25 వార్డుల్లో కేవలం ఆరు మాత్రమే గెలుచుకుని పార్టీ కుదేలైపోయింది. పరువు గంగపాలు అయింది. కిం కర్తవ్యం? ఏం చేయాలి? చంద్రబాబునాయుడు ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇది. బహుశా ఈ సమయానికి ఏం చేయగలడో […]

’బండి‘కి బ్రేకులు వేయలేకపోతున్న ’కారు‘

భారతీయ జనతా పార్టీ.. ఎప్పుడూ ఉత్తర భారతదేశంలోనే దీని హవా.. దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే.. ఇది గతం.. ఇప్పుడు సౌత్ లో తెలంగాణలో దూసుకుపోతోంది. ఎప్పుడూ మూడో స్థానంలో ఉండే బీజేపీ ఇపుడు అధికార పార్టీకి ఏకుమేకై కూర్చుంది. గతంలో అధికార పార్టీ తరువాత కాంగ్రెస్ మాటలు వినిపించేవి. ఇపుడు బీజేపీకి ఆ అవకాశం దక్కింది. అందుకు నిదర్శనమే సీఎం కేసీఆర్ మీడియా సమావేశం. రాష్ట్రంలో ఉన్నది కేవలం తమ పార్టీనేనని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ […]