ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..18 ఏళ్లు నిండిన వారికి టీకా ఎప్పుడంటే?

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే దేశంలో రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి. మ‌రోవైపు క‌రోనాను అరిక‌ట్టేందుకు దేశ‌వ్యాప్తంగా టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది. పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ కూడా మే 1 నుంచి వ్యాక్సిన్ వేయ‌బోతున్న‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. వ్యాక్సిన్ల కొనుగోలు అధికారాన్ని ఇప్పటికే రాష్ట్రాలకు ఇచ్చేసింది. ఈ నెల 28 నుంచి రిజిస్ట్రేషన్లనూ మొదలుపెట్టబోతోంది. ఇలాంటి త‌రుణంలో ఏపీ […]

`ఆంధ్రజ్యోతి` సంస్థల ఎండీ ఆర్కే ఇంట్లో తీవ్ర విషాదం!

‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ(ఆర్కే) ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఆర్కే సతీమణి, ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ కన్నుమూశారు. గ‌త‌ కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క‌న‌క‌దుర్గ కొద్ది సేప‌టి క్రిత‌మే తుది శ్వాస విడిచారు. ఈమె వ‌య‌సు 63 సంవ‌త్స‌రాలు. వేమూరి కనకదుర్గ మృతి ప‌ట్ల‌ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతానం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, సాయంత్రం జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో కనకదుర్గ అంత్యక్రియలు జ‌ర‌గ‌నున్నాయ‌ని […]

టీడీపీలో మ‌రో విషాదం..క‌రోనాతో విశాఖ కార్పొరేటర్ మృతి!

ప్రాణాంత‌క వైర‌స్ అయిన క‌రోనా త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. మ‌ళ్లీ వికృత రూపం దాల్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఎన్నో లక్ష‌ల మందిని బ‌లి తీసుకున్న ఈ క‌రోనా.. ప్ర‌స్తుతం మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఇలా అంద‌రిపై క‌రోనా పంజా విసురుతోంది. తాజాగా విశాఖలో కరోనా బారినపడి మరో కార్పొరేటర్ కన్నుమూశారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున 31వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన వానపల్లి రవికుమార్ గ‌త […]

మన్‌కీ బాత్‌లో మోదీ సంచలన వ్యాఖ్యలు..!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పలు సూచనలు చేస్తూ వస్తున్నారు. దేశ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రాల మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన సూచనలు ఇస్తున్నారు. అయితే కొన్ని అసత్య ప్రచారాలు నమ్మి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు తప్పుడు ప్రచారాలును నమ్మవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆదివారం రేడియో కార్యక్రమం మన్ […]

అక్కడ లాక్‌డౌన్ పొడిగింపు…?

కరోనాను కట్టడి చేసేందుకు వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ గత వారం ప్రకటించారు. గొలుసుకట్టు వ్యాప్తిని నిరోధించేందుకు ఇది అవసరమన్నారు. ఆడిటోరియం‌లు, రెస్టారెంట్లు, మాల్స్, వ్యాయామశాలలు మూసి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సినిమా థియేటర్ల సీటింగ్ సామర్థ్యంలో కేవలం 30 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తామని కూడా ఆయన తెలిపారు. కాగా.. శుక్రవారం నాడు ఢిల్లీ పాజిటివిటీ రేటు అనూహ్యంగా 24 శాతానికి చేరుకుంది. ఇది ఢిల్లీ ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి […]

13 మంది జ‌ల‌స‌మాధి.. ఎక్క‌డంటే..

వేర్వేరు చోట్ల జ‌రిగిన సంఘ‌ట‌న‌ల్లో ఏకంగా 13 మంది జ‌ల‌స‌మాధి అయ్యారు. ఒక చోట ఈత స‌ర‌దా ముగ్గురు యువ‌కుల ప్రాణాల‌ను బ‌లిగొన‌గ‌, మ‌రోచోట ఊహించ‌ని ప్ర‌మాదంలో 10మంది న‌దిలో కొట్టుకుపోయారు. వివ‌రాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లికి చెందిన ఒకరు, వేములవాడకు చెందిన త‌న న‌లుగురు మిత్రుల‌తో క‌లిసి స్థానిక రంగనాయకస్వామి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అయితే ఆ సమీపంలోని మానేరు వాగులో ఈత కొట్టడానికి ఐదుగురు వాగులోకి దిగారు. అందులో […]

దేశ‌వ్యాప్తంగా క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. వైర‌స్ సుడిగాలిలా చుట్టేస్తున్న‌ది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ భయంకరంగా పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, కొత్తగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా 52,726 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజువారీ కేసులు వెయ్యి దాట‌గా, కొత్తగా.. 1,005 కరోనా […]

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ కీల‌క నిర్ణ‌యం యుద్ధ విమానాల్లో..

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రాణవాయువు (ఆక్సిజన్) కొరతతో దేశవ్యాప్తంగా వైద్య‌శాల‌ల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్ల బాధలు చెప్పలేనివి కావు. మునుపెన్నడూ చూడని విధంగా దేశంలో రోజుకు 1500 కు మించి మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో కొద్దిరోజులుగా ఈ తరహా మరణాలు పెరుగుతున్న తరుణంలో ఆక్సిజన్‌కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి టన్నుల కొద్దీ వాయువును ఆస్పత్రులకు తరలిస్తున్నా అదీ సరిపోవడం లేదు. యుద్ధ‌ప్రాతిప‌దిక ఆక్సిజ‌న్ త‌ర‌లింపున‌కు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. అందులో […]

బ్రేకింగ్: క‌రోనా బారిన ప‌డ్డ మంత్రి కేటీఆర్‌!

కంటి క‌నిపించ‌కుండా ముప్ప తిప్ప‌లు పెడుతున్న క‌రోనా సెకెండ్ వేవ్‌లో ఎంత వేగంగా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సామాన్యులు, సెల‌బ్రెటీలు, రాజకీయ నాయ‌కులు, క్రీడా కారులు అనే తేడా లేకుండా ఈ మ‌హ‌మ్మారి అంద‌రిపై పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో తాజాగా కేటీఆర్ క‌రోనా టెస్ట్ చేయించుకోగా.. అందులో ఆయ‌న‌కు పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా […]