`కారు`లో కోల్డ్‌వార్‌కు మ‌రో సాక్ష్య‌మిదిగో..

తెలంగాణ రాజ‌కీయాల్లో ఏదో జ‌రుగుతోంది! ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో కోల్డ్‌వార్ లేదని.. అంతా పైకి చెబుతున్నా.. లోలోన మాత్రం `అంత‌కుమంచి` అన్న రేంజ్‌లో లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. క్రెడిట్ గేమ్‌లో ఎప్పుడూ కేసీఆర్ మేన‌ల్లుడు, మంత్రి హ‌రీశ్‌రావు వెన‌క‌బ‌డిపోతున్నారా లేక కావాల‌ని ఆయ‌న‌కు క్రెడిట్ ద‌క్కకుండా చేస్తున్నారా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేసీఆర్ వెన్నంటే న‌డిచి.. కీల‌క స‌మ‌యాల్లో పార్టీని గ‌ట్టెక్కించి.. ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరుతెచ్చుకున్న హ‌రీశ్‌కు ఇప్పుడు క్రెడిట్ ద‌క్కుండా చేస్తున్నారనే గుస‌గుస‌లు […]

జగన్ చెంతకు మాజీ మంత్రి!

2019 ఎన్నిక‌ల‌కు వైసీపీ ఇప్ప‌టినుంచే యాక్ష‌న్ ప్లాన్ రెడీ చేస్తోంది. టీడీపీ ప్రారంభించిన `ఆప‌రేష‌న్ ఆకర్ష్‌`తో సైకిలెక్కిన ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏర్ప‌డిన గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందుకోసం ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని కీల‌క నేత‌ల కోసం వెతుకులాట ప్రారంభించింది. కొన్ని చోట్ల వైసీపీ చేస్తున్నప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాలోని కందుకూరులో ఆ పార్టీలో చేరేందుకు మాజీమంత్రి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా రానున్న ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులు ఆర్ధికంగా సామాజికంగా బలోపేతం అయి ఉంటే జిల్లాలోని […]

నంద్యాల‌లో జ‌గ‌న్ గ‌ట్టి దెబ్బ త‌గ‌ల‌నుందా..!

తాము గెల‌వ‌లేమ‌ని తెలిసినా.. పోటీ ప్ర‌ధానంగా టీడీపీ,వైసీపీ మ‌ధ్య అని రాజ‌కీయ వ‌ర్గాల‌న్నీ కోడై కూస్తున్నా ఇవేమీ ప‌ట్టించుకోకుండా నంద్యాల ఉప ఎన్నిక బ‌రిలో కాంగ్రెస్ త‌మ అభ్య‌ర్థిని నిలబెట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అంతే గాక మైనారిటీ వ‌ర్గానికి చెందిన అబ్దుల్ ఖాదిర్‌ను త‌మ‌ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. ఏ న‌మ్మ‌కం మీద ఉప ఎన్నిక‌ బ‌రిలోకి దిగింది? మైనారిటీ అభ్య‌ర్థినే బ‌రిలోకి దించ‌డం వెనుక రాజ‌కీయంగా ఎవరికి లాభం? ఎవ‌రికి న‌ష్టం? అనే చ‌ర్చ ఇప్పుడు మొద‌లైంది. […]

ప‌శ్చిమ టీడీపీలో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం త‌న్నులాట..!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంగా గ‌ట్టిగా మ‌రో 18 నెల‌ల టైం మాత్ర‌మే ఉంది. మ‌రోసారి ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు త‌మ ఏర్పాట్లు తాము చేసుకుంటుండ‌గా, కొత్త‌గా ఎన్నిక‌ల్లో పోటీ చేసే వాళ్లు కూడా ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం త‌మ‌కు అనువైన స్థానాలను చూసుకునే ప‌నిలో ఉన్నారు. ఎమ్మెల్యే అవ్వాల‌న్న కోరిక ఎవ్వ‌రికి మాత్రం ఉండ‌దు. ఎమ్మెల్యే అవ్వాల‌నుకున్న వాళ్ల‌కు అంద‌రికి టిక్కెట్లు వ‌చ్చేయ‌డానికి అవి మామూలు సీట్లు కాదు క‌దా..! ఇదిలా ఉంటే వ‌చ్చే […]

నంద్యాల ప్రచారానికి బ్రాహ్మ‌ణి…తెర వెన‌క క‌థేంది

నంద్యాల ఎన్నిక‌ల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు ర‌చిస్తోంది. ఏకంగా 25 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్.. ఇలా మొత్తం యంత్రాంగ‌మంతా నంద్యాల‌లోనే మ‌కాం వేశారు. ఈ ఎన్నిక‌ను భూమా నాగిరెడ్డి కూతురు, మంత్రి అఖిల‌ప్రియ చాలెంజింగ్‌గా తీసుకున్నారు. త‌న అన్న గెల‌వ‌క‌పోతే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని కూడా ప్ర‌క‌టించేశారు. అయితే ఇప్పుడు మ‌హిళా ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు స‌రికొత్త ప్ర‌తిపాద న‌ను సీఎం చంద్ర‌బాబు ముందుంచార‌ట‌. అదేంటంటే.. సీఎం కోడ‌లు, […]

నంద్యాలే కాదు… అక్కడ ఎన్నిక కూడా హోరా హోరీనే

ఏపీలో ఇప్పుడు జనం దృష్టి అంతా కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికపైనే ఉంది. ఈ ఉప ఎన్నిక ఈ నెల 23న జ‌రుగుతుండ‌గా, కౌంటింగ్ 28న జ‌రుగుతోంది. ఆ మ‌రుస‌టి రోజే కాకినాడ కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. సెప్టెంబ‌ర్ 1న కౌంటింగ్ జ‌రుగుతోంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయ‌డంతో ఇప్పుడు కాకినాడ‌లో ఎన్నికల హీట్ బాగా పెరిగిపోయింది. కాకినాడ […]

టీడీపీ ఎమ్మెల్యే పుత్రికార‌త్నం చేసిన ప‌ని చూస్తే దిమ్మ తిరగాల్సిందే

ఇప్పుడు గుంటూరు జిల్లా అంతా ఇదే పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఆయ‌న టీడీపీలో ఓ సీనియ‌ర్ లీడ‌ర్‌. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వ‌ర‌కు జిల్లాలో చ‌క్రం తిప్పుతూనే ఉన్నారు. స‌ద‌రు సీనియ‌ర్ లీడ‌ర్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. అయితే ఆయ‌న ఏక‌పోక‌డ‌ల‌తో విసిగిపోయిన జిల్లా టీడీపీ వాళ్లంతా ఆయ‌న్ను ఓ పెద్ద అన‌కొండ‌గా విమ‌ర్శిస్తుంటారు. ఆయ‌న ఎన్నో కీల‌క ప‌ద‌వుల్లో కొన‌సాగారు. అలాంటి వ్య‌క్తి ఇప్పుడు జిల్లాలో త‌న కుటుంబ స‌భ్యుల […]

జీఎస్టీ దెబ్బ‌కు తెలంగాణ విల‌విల‌

జీఎస్టీ దెబ్బకు సామాన్యుడే కాదు.. సర్కారు కూడా హడలిపోతోంది. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ కారణంగా రాష్ట్ర బడ్జెట్ ఫిగర్స్ కూడా మారిపోతున్నాయన్న ఆందోళనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్ర‌శంసించారు. ఇప్పుడు లోక్‌స‌భ‌లో ఆ పార్టీ ఎంపీ, టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత జితేందర్ రెడ్డి… రాష్ట్రంపై జీఎస్టీ ఎఫెక్ట్‌ను వివ‌రించారు. దీనివ‌ల్ల తెలంగాణ న‌ష్ట‌పోతోంద‌ని వాపోయారు. ప్రభుత్వ పథకాలను జీఎస్టీ నుంచి మినహాయింపులు ఇవ్వాలన్నారు. జీఎస్టీ మీద ఇచ్చిన […]

ఉలిక్కిపడ్డ పార్టీ … టెన్షన్ లో నాయకులు

రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీలో పాతాళానికి ప‌డిపోయిన కాంగ్రెస్‌.. ఉనికి కోసం తీవ్రంగా పోరాడుతోంది. పార్టీకి వీర విధేయులైన నాయ‌కులు.. అంతోఇంతో క్యాడ‌ర్ త‌ప్ప ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఉన్న వారితోనే నెట్టుకొస్తున్న కాంగ్రెస్‌.. నంద్యాల ఉప ఎన్నిక‌ల బ‌రిలో దిగుతామ‌ని ప్ర‌కటించినా అంత‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ప్ర‌క‌ట‌న అయితే చేసేసింది కానీ ఇప్పుడు అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. ఎంతో క‌ష్ట‌ప‌డి.. భూత‌ద్ధంలో వెతికి.. నేను పోటీచేయ‌ను అన్నా బుజ్జ‌గించి మరీ ఒక అభ్య‌ర్థిని బ‌రిలో నిల‌బెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ […]