జూనియ‌ర్‌ని చంద్ర‌బాబు మ‌ళ్లీ చేర‌దీస్తున్నారా?

ఏపీ సీఎం, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకి, జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌కి మధ్య సంబంధం కేవ‌లం ఫ్యామిలీ ప‌రంగానే ప‌రిమితం కాలేదు. పొలిటిక‌ల్‌గా కూడా ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఎంతో అనుబంధం ఉంది. నంద‌మూరి వంశంలో చంద్ర‌బాబుకు అండ‌గా నిల‌బ‌డిన వారిలో, చంద్ర‌బాబు చేర‌దీసిన వారిలో హ‌రికృష్ణ‌, బాల‌కృష్ణల త‌రం త‌ర్వాత ఒక్క జూనియ‌ర్ మాత్ర‌మే క‌నిపిస్తాడు. అదేవిధంగా జూనియ‌ర్‌కు ఓ మంచి సంబంధం చూసి, ద‌గ్గ‌రుండి వివాహం చేయించిన ఘ‌న‌త అక్ష‌రాలా చంద్ర‌బాబుకే ద‌క్కుతుంది. నార్నేవారి ఇంటి అమ్మాయిని […]

ఆవిడ‌.. అమ్మ లోటు తీరుస్తోందా?

అమ్మ లేని లోటు ఎవ‌రూ తీర్చ‌లేర‌ని అంటారు! ఇది క‌న్న‌త‌ల్లి విష‌యంలో! కానీ, త‌మిళ‌నాడులో మాత్రం అక్క‌డి జ‌నాల‌కి క‌న్న‌త‌ల్లి క‌న్నా పాలిస్తున్న త‌ల్లి, పురుచ్చిత‌లైవి అయిన జ‌య ల‌లిత అంటే పంచ ప్రాణాలు. అమ్మ క‌నుస‌గైలే ఆదేశాలు, అమ్మ పలుకులే ఆణిముత్యాలు! అమ్మ కోసం ఏమైనా చేస్తాం అనేవారు స్టేట్‌లో స‌గానికిపైగా ఉన్నారంటే ఆశ్చ‌ర్యం అనిపించ‌క‌మాన‌దు. అమ్మ కోసం గుడులు, అమ్మ‌కోసం పూజ‌లు, అంతెందుకు అమ్మ‌కే పూజ‌లు! త‌మిళ‌నాట అమ్మంటే జ‌యే!! అందుకే స్టేట్ పొలిటిక‌ల్ […]

కేసీఆర్ మీద సొంత పార్టీ ఎమ్మెల్యే తిరుగుబాటు

కొత్త జిల్లాల ఏర్పాటు అంశం.. మొత్తం మీద తెలంగాణ సీఎం కేసీఆర్ కు శిరోభారంగా మారిన‌ట్టే క‌నిపిస్తోంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌కు మైలేజీ రాకుండా చేయాల‌న్న ఉద్దేశంతో.. వారి డిమాండ్ల‌నూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని కొత్త జిల్లాల సంఖ్య‌ను టీఆర్ ఎస్ అధినేత తాజాగా ఏకంగా 21కి చేర్చారు. అయినా ఈ అంశం రోజుకో వివాదాన్ని రాజేస్తూనే ఉంది. కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర‌  మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను ప్ర‌త్యేక‌ జిల్లాగా చేయాలనే డిమాండ్‌తో  మొదలైన ఈ […]

కేసీఆర్‌కు కొత్త త‌ల‌నొప్పి…. 33 జిల్లాలు కావాలి

తెలంగాణ ను బంగారు తెలంగాణ చేయాల‌న్న టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ వ్యూహం కాస్తా.. తెలంగాణ‌ను జిల్లాల తెలంగాణ‌గా మారుస్తోందా ? అనిపిస్తోంది! వాస్త‌వానికి పాల‌న సౌల‌భ్యం కోసం, ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ కావ‌డం కోసం, కొత్త నాయ‌కులు, నేత‌లు వ‌స్తార‌ని భావించిన కేసీఆర్ ప్ర‌స్తుత‌మున్న ప‌ది జిల్లాల రాష్ట్రాన్ని 25 జిల్లాలు చేయాల‌ని నిర్ణ‌యించారు. వీటిలో ముఖ్యంగా పెద్ద పెద్ద జిల్లాలుగా ఉన్న‌వాటిపై ఆయ‌న తొలుత దృష్టి పెట్టారు. ఇక‌, ఆ త‌ర్వాత దీనికి […]

ఇంటిలిజెన్స్ స‌ర్వేతో హ‌డ‌లెత్తుతున్న టీడీపీ!

ఏ విష‌యంపైనైనా వ్య‌క్త‌ల‌పైనైనా స‌ర్వే చేయించే సీఎం చంద్ర‌బాబు ఆయా స‌ర్వేల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్ ఆధారంగా కార్య‌చ‌ర‌ణ రూపొందించుకుంటుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరు స‌హా సీఎంగా ఆయ‌న ప‌నితీరుపైనా స‌ర్వే చేయించుకున్నారు. ఆయా రిజ‌ల్ట్స్‌ని బ‌ట్టి ప‌నితీరును మెరుగు ప‌రుచుకుని ప్ర‌జ‌ల్లో ఇమేజ్ సంపాదించాల‌ని బాబు ప్లాన్‌. అదే విధంగా త్వ‌ర‌లో రాష్ట్రంలో జ‌ర‌గ‌నున్న మునిసిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉంది?  విజ‌యం సాధిస్తామా లేదా? అనే కోణంలో […]

షాక్‌: పాలిటిక్స్‌లోకి న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌

నిజ‌మే! ఘ‌ట‌మ‌నేని వారి ఇంటి చిన్న‌కోడ‌లు మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారట‌! సామాజిక సేవ‌లో బిజీగా ఉన్న న‌మ్ర‌తా త్వ‌ర‌లోనే పాలిటిక్స్‌లోకి వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి ఘ‌ట్ట‌మ‌నేని వంశానికి పాలిటిక్స్ కొత్త‌కావు. సూప‌ర్‌స్టార్ కృష్ణ గ‌తంలో కాంగ్రెస్‌కి మ‌ద్ద‌తిచ్చారు. వైఎస్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడారు కూడా. అదేవిధంగా ఆయ‌న సోద‌రుడు, ప్ర‌ముఖ నిర్మాత ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు కూడా కాంగ్రెస్‌లో ఉండేవారు. ఆ త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ […]

బాబు కాపు వ్యూహంపై తెలుగు త‌మ్ముళ్ల‌లో అసంతృప్తి

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తానంటూ 2014 ఎన్నిక‌లకు ముందు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇచ్చిన హామీ నేప‌థ్యంలో రాష్ట్రంలో ర‌గిలిన ఉద్య‌మాన్ని చ‌ల్లార్చడంలో బాబూ వ్యూహం బెడిసికొడుతోందా? అధినేత వ్యూహంపైనా, ప్ర‌త్యేకంగా కాపుల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండ‌డంపైనా టీడీపీ త‌మ్ముళ్లు ఫీలైపోతున్నారా?  పోనీ ఇంత చేసినా.. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో కాపులు టీడీపీ ప‌క్షాన ఉంటార‌ని గ్యారెంటీ ఏంట‌ని త‌మ‌లో తాము చ‌ర్చించుకుంటున్నారా?  బాబు వైఖ‌రిపై కొంద‌రు తెర‌వెనుక విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారా? అంటే ప్ర‌స్తుతం ఔన‌నే తెలుస్తోంది. 2014 […]

కేసీఆర్ ముందా వాళ్ల కుప్పిగంతులు

వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ ఎస్ అధినేత కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుది విభిన్న‌శైలి. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను.. ఎవ‌రూ ఊహించ‌లేని ఎత్తుల‌తో చిత్తు చేయ‌డ‌మే కాదు. ప‌రిపాల‌న‌లోనూ ఆయ‌న త‌న‌దైన మార్కును చూపేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. అది ఏ అంశ‌మైనా స‌రే… సాధ్యాసాధ్యాలకు ఆయ‌న నిఘంటువులో అర్థాలు వేరుగా ఉంటాయి.  ఆయ‌న పాల‌నా ప‌రంగా ఏ నిర్ణ‌యం తీసుకున్నా అందులో పార్టీకి భ‌విష్య‌త్తులో అనుకూలించే వ్యూహాలు అంత‌ర్లీనంగా దాగి ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రిగా పీఠాన్ని అధిష్టించిన త‌రువాత […]

2019లో వైకాపా పొత్తుల లెక్క‌లివే

కొంత‌కాలం కింద‌టిదాకా  దేశ‌వ్యాప్తంగా వామ‌ప‌క్షాలు అనేక రాష్ట్రాల్లో ఏదో ఒక స్థాయిలో త‌మ ప్ర‌భావం చూపుతూ వ‌చ్చాయ‌న్న‌ది ఎవ‌రూ కాద‌న‌లేని వాస్త‌వం. ఇప్పుడంటే త‌మ ప్ర‌భ‌ను కోల్పోయాయి కాని అధికారంలో ఉన్న‌పార్టీల‌పై క‌మ్యూనిస్టులు చేసే పోరాటాల‌ ప్ర‌భావం ప్ర‌జ‌ల‌పై తీవ్రంగా ఉండేది. చాలా స‌మ‌యాల్లో అధికార ప‌క్షాల‌పై ప్ర‌జావ్య‌తిరేక‌త పెంచి… ఆ త‌రువాత ఎన్నిక‌ల్లో వారిని అధికార  పీఠానికి దూరం చేయ‌డంలోనూ వామ‌ప‌క్షాలు ప్ర‌ధాన పాత్ర‌నే పోషించాయి. అయితే ప‌శ్చిమ బెంగాల్‌, కేర‌ళ వంటి ఒక‌టి రెండు […]