ఎడ్యుకేట్‌ చేస్తున్న వెంకయ్య.

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని ఎడ్యుకేట్‌ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఎగ్గొట్టిందీ తెలియజేస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్‌ అంతటా పర్యటిస్తారట. ముందుగా విజయవాడలో పర్యటించి, ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన వైనంపై వివరణ ఇచ్చుకున్నారు. కానీ అది ప్రజలకు రుచించలేదు. కొంతమంది బిజెపి నాయకులు, వారితోపాటు కొంతమంది టిడిపి నాయకులు మాత్రమే వెంకయ్యగారి మాటలను విశ్వసిస్తున్నారు. అది వారికి తప్పదు. కానీ రాష్ట్ర ప్రజలు అలా కాదు కదా, తమ సమయం వచ్చేవరకు వేచి […]

మంత్రి వర్గ విస్తరణ – చినబాబు ఒక్కడేనా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గాన్ని విస్తరించే ఆలోచనల్లో ఉన్నారని కొన్ని నెలలుగా ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం అంటే తేనెతుట్టెను కదిలించినట్లే అవుతుందని చంద్రబాబుకి బాగా తెలుసు. అందుకనే విస్తరణ కాకుండా ఒక్కర్ని ప్రస్తుతానికి కొత్తగా మంత్రివర్గంలో తీసుకుని, విస్తరణను వాయిదా వేయాలని చూస్తున్నారట. ఆ ఒక్కరూ ఎవరో కాదట, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ అట. చినబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందిగా డిమాండ్లు వినవస్తున్న వేళ, తన కుమారుడ్ని […]

పవన్‌కి వెన్నుదన్నుగా నాగబాబు.

జనసేన పార్టీకి ప్రధాన బలం అభిమానులే. పవన్‌కళ్యాణ్‌కి మొదట్లో మెగా అభిమానుల మద్దతు మెండుగా ఉండేది. అందులోంచి కొత్తగా ‘పవనిజం’ పుట్టింది. తద్వారా పవన్‌కళ్యాణ్‌కి మెగా అభిమానులతోపాటు ప్రత్యేకంగా ఇంకో అభిమానగణం తయారైందని చెప్పడం నిస్సందేహం. అయితే మెగా అభిమానుల్నీ, పవన్‌ అభిమానుల్నీ ఒక్కచోట చేర్చే బాధ్యతను ఇటీవల మెగాబ్రదర్‌ నాగబాబు తీసుకున్నారని సమాచారమ్‌. మెగా, పవన్‌ అభిమానుల మధ్య విభేదాలున్నాయని కాదుగానీ, కొన్ని అంశాల్లో ఈ పవన్‌ అభిమానులు, మెగా అభిమానులతో విభేదిస్తుంటారు. అవి కూడా […]

హోదా – తల్లిపాలు, ప్యాకేజీ – డబ్బా పాలు.

డబ్బా పాలు చంటి పిల్ల ఆరోగ్యానికి క్షేమం కాదు. కానీ విధిలేని పరిస్థితుల్లో వైద్యులు డబ్బా పాలను పసి పిల్లలకు ఆహారంగా సూచిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌ అనే పసిపాపకి ఇప్పుడు డబ్బా పాల అవసరం వచ్చింది. ఎందుకంటే ప్రత్యేక హోదా అనే తల్లిని కేంద్రమే దూరం చేసింది. దారుణం కదా ఇది. ఈ పోలిక తెచ్చింది బిజెపి మిత్రపక్షం అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ శివప్రసాద్‌. చిత్తూరు జిల్లాకు చెందిన శివప్రసాద్‌, రాజకీయ నిరసనల కోసం సరికొత్త […]

ఇచ్చారు, థ్యాంక్స్‌ చెప్పాను – తప్పేంటి!

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన ప్యాకేజీ బాగుందని, ఇచ్చిన విషయాల పట్ల సంతృప్తితో కేంద్రానికి థ్యాంక్స్‌ చెబితే తప్పేంటని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, ఏది ఇచ్చినట్టో, ఏది ప్రకటించి ఊరుకున్నట్లో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎలా అనుకోగలం. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్యాకేజీ లాంటి సహాయం ప్రకటించడం కేవలం ఎన్నికల్లో ఇచ్చిన ప్రచారం తరహాలో మాత్రమే ఉంది. ఆ హామీలకు చట్ట […]

మార్పుకోసం జనసేన యుద్ధం.

రాజకీయాల్లో మార్పు కోసమంటూ సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారుగానీ, ప్రస్తుత రాజకీయాల్లో ఓ రాజకీయ పార్టీని నడపడమెంత కష్టమో ఒక్క దఫా ఎన్నికలతోనే అర్థం చేసుకున్న ఆయన విధిలేని పరిస్థితుల్లో తన పార్టీని కాంగ్రెసు పార్టీలో కలిపేశారు. కాంగ్రెసు పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికై, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారాయన. ఇప్పుడాయన సోదరుడు పవన్‌కళ్యాణ్‌ సొంతంగా పార్టీ పెట్టారు, జనసేన పార్టీకి అధినేతగా ఉన్నారు. ఈయన కూడా మార్పు నినాదంతోనే ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారట. […]

కావేరి మంటల్లో చలి కాచుకుంటున్న మోడీ

దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడులు భగ్గుమంటున్నాయి..కేవెరి జల వివాదం తో రెండు రాష్ట్రాలు రావణ కాష్టం లా తగలబడి పోతున్నాయి..సుప్రీం కోర్ట్ తీర్పు నేపథ్యం లో మొదట కన్నడ నాట అల్లర్లు చెలరేగగా మెల్లిగా అవే అల్లర్లు తమిళనాట కూడా ప్రారంభమయిపోయాయి..రెండు రాష్ట్రాలు శత్రు దేశాల మాదిరి రాకపోకలు నిలిపివేసే పరిస్థి వచ్చిందంటే కావేరి తీవ్రత ఏ రేంజ్ లో ఉందొ ఊహించుకోవచ్చు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిపోతున్నాయి.అసలు ఈ విషయం తో ఏ సంబంధం లేని […]

పవన్ కళ్యాణ్ సంపాదన వారికే సరిపోతుందట

పవన్ కళ్యాణ్ ఈ పేరు అటు టాలీవుడ్ లోను ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ బాగా పాపులర్ పేరు. అయితే ఇప్పటిదాకా పూర్తిస్థాయి రాజకీయాలలోకి రాని పవన్ కళ్యాణ్ మొన్న తిరుపతి సభ, నిన్నటి కాకినాడ సభలతో ఇక ప్రత్యక్ష రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తానని చాటాడు. ఈ సభలలో తనదగ్గర డబ్బులేదని హిరంగంగానే చెప్పాడు పవన్ కళ్యాణ్. విమర్శకులు మాత్రం ప్రతి సినిమాకి 20 కోట్లు పారితోషకం తీసుకునే ఈ హీరో దగ్గర డబ్బు లేకపోవటం ఏంటని విమర్శించారు. […]

పవన్ కెసిఆర్ కలవబోతున్నారోచ్

అవును జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యణ్, తెరాస అధ్యక్షుడు,తెలంగాణ ముఖ్యమంత్రి కలవబోతున్నారు.. అయితే రాజకీయంగా మాత్రం కాదు.. ఇద్దరి రాజకీయ దారులు వేరు..ఒకరేమో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యం గా పార్టీ ని స్థాపించి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రయితే..ఇంకొకరేమో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హక్కులకోసం పోరాడుతామంటున్న నాయకుడు. ఈ ఇద్దరి రాజకీయ లక్షాలు వేరైనా..ఇద్దరి కలయిక మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది.కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కొడుకు నిఖిల్ కుమార్ హీరోగా నటించిన […]