రోజా రాజీ – కథ అయిపోలేదు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో రోజా రీ ఎంట్రీ ఇవ్వడానికి మార్గం సుగమం అయినట్లుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రోజా దురుసు ప్రవర్తన కారణంగా ఆమెను ఏడాదిపాటు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేశారు. కొన్నాళ్ళు బెట్టు చేసినా, తిరిగి అసెంబ్లీలోకి వెళ్ళేందుకు రోజా క్షమాపణ చెప్పక తప్పలేదు. క్షమాపణను రాత పూర్వకంగా ఆమె తెలియజేసినప్పటికీ, అసెంబ్లీకి ఆమెతో ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పించాలని అధికార పార్టీ అనుకుంటోందట. ముఖ్యమంత్రి చంద్రబాబు మీదా, టిడిపి మహిళా ఎమ్మెల్యే అనితపైనా […]

రెడ్డిగారు జోకేస్తే నవ్వరెందుకు!

తెలంగాణ టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి జోకేశారు. నవ్వొస్తే నవ్వండి. కానీ నవ్వడానికి అందులో అసలు మేటరుంటే కదా! తెలుగుదేశం పార్టీ తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని, టిడిపిని వీడి టిఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు కొందరు అభినందిస్తున్నారని రేవంత్‌రెడ్డి జోకేశారు మరి. 15 మంది ఎమ్మెల్యేలు 2014 ఎన్నికల్లో తెలంగాణ నుంచి టిడిపి తరఫున గెలిస్తే అందులోంచి 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేశారు. ఒకాయన టిడిపిలో ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు. ఇద్దరంటే […]

చంద్రబాబు దెబ్బకి జగన్‌ షాక్‌!

శాసనసభ సమావేశాలకు ముందు వైసిపి ఊహించని షాక్‌ ఇది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ముఖ్య నేత కూడా అయిన భూమన కరుణాకర్‌రెడ్డిని తుని విధ్వంసం కేసులో ఆంధ్రప్రదేశ్‌ సిఐడి విచారిస్తుండడంతో పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తొలి రోజు విచారణ ముగియగా, రెండో రోజు కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా సిఐడి అధికారులు భూమనను ఆదేశించారు. అయితే తనకేమీ భయం లేదని, విచారణకు హాజరవుతానని భూమన చెప్పారు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ. అయినప్పటికీ […]

నాలుక చీరేస్తారట, ఎందీ నిజమేనా?

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఇప్పుడంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారుగానీ, ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడే. ఆయన ఎమ్మెల్యేగా ఇప్పుడు పదవిలో ఉన్నదే తెలుగుదేశం పార్టీ కారణంగా. అది ఆయన మర్చిపోతే ఎలా? రాజకీయాల్లో పార్టీ మారడం ఫ్యాషన్‌ అయిపోయింది. పార్టీ మారాక, కెసియార్‌ – తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కి ‘దేవుడైపోయారు’. అంతకు ముందైతే, కెసియార్‌ని పట్టుకుని నానా విమర్శలు చేసేసిన ఘనుడే ఈ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌గారు కూడా. తప్పదండీ, గారు అని సంబోధించకపోతే ఈయనగారికి ఒళ్ళు […]

సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ అట

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనబోతున్నాడట..అవును మీరు నమ్మినా నమ్మక పోయినా..ఇది నిజం.ట్విట్టర్ లో స్పందించడం..6 నెలలకో ప్రెస్ మీట్ పెట్టి కామెడీ చేయడం అలవాటుగా చేసుకున్న పవర్ స్టార్ రూట్ మార్చబోతున్నారట..నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో తనదయిన ముద్ర వేసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టేస్తారేమో చూడాల్సిందే. మొన్న తిరుపతి సభ చూసారు కదా.పవన్ మాటల ధాటి..ఎవరి పైన అని మాత్రం అడక్కండి..అది ఆయనకే క్లారిటీ లేదు..ఎప్పటిలాగే చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ ని ఆ […]

మళ్ళీ ముంచేసిన జానారెడ్డి.

మాజీ మంత్రి జానారెడ్డి కాంగ్రెస్‌ పార్టీని మళ్ళీ మళ్ళీ ముంచేస్తూనే ఉన్నారు. ఏ వేదిక అయినాసరే ఆయనలోని టిఆర్‌ఎస్‌ అనుకూల భావాలు చాలా తేలిగ్గానే బయటకు వచ్చేస్తున్నాయి. అసెంబ్లీలో అయినా, పార్టీ వేదికలపైనా జానారెడ్డిది ఇదే తీరు. ప్రజలు, ఇంకా కెసియార్‌పై నమ్మకంతోనే ఉన్నారని, అందుకే కెసియార్‌ నిర్ణయాల్ని వ్యతిరేకించడంలేదని జానారెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ నేతలు ఇంకోసారి షాక్‌కి గురయ్యారు. తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్ని కాంగ్రెసు నాయకులంతా విమర్శిస్తోంటే, […]

కెసిఆర్ కి సవాల్ విసిరిన డీకే అరుణ

తెలంగాణ లో తెరాస గవర్నమెంట్ జిల్లాల విభజన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందని పేర్కొంటూ శనివారం ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులు నిరాహార దీక్షను పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ చేపట్టారు. ఈ ధీక్షలో కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరారు. తాను రేపు సాయంత్రం వరకు దీక్షలోనే ఉంటానని, జిల్లాల విభజనపై బహిరంగ చర్చకు రావాలని సవాల్లో డిమాండ్ చేశారు. ఈ […]

ప్రత్యేక హోదా పై వ్యూహాత్మక చర్యల్లో బీజేపీ

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దృష్టిసారిస్తోంది. హోదా కంటే మెరుగైన ప్రయోజనం కల్పించేలా ప్యాకేజీ రూపొందించే ప్రయత్నాలు సాగుతున్నాయని మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా అంశంలో పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీలు సహజంగానే  క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకో వడం సహజం. ఈ పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వని పక్షంలో బిజెపి ఇబ్బందులు పడాల్సివస్తుంది, కేంద్ర సర్కార్‌లో భాగస్వామ్యమైన ఏపీలోని టిడిపి సర్కార్‌పై ప్రజాగ్రహం పెరుగుతుంది. కానీ ఏపీలో బలపడాలని వ్యూహాలను […]

యాక్షన్‌లోకి దిగుతున్న ఉండవల్లి

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ లీగల్‌ విషయాల్లోకి దిగితే ప్రత్యర్థి ఎలాంటివారైనా సరే చిక్కుల్లో పడాల్సిందే. మీడియా మొఘల్‌ రామోజీరావుకే చెమటలు పట్టించారాయన. ఈసారి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఓటుకు నోటు కేసులో ఇంప్లీడ్‌ అవబోతున్నారు. స్వతహాగా ఉండవల్లి న్యాయవాది. మంచి మాటకారి కూడా. ఆయన లాజిక్‌ లేకపోయినా, లాజిక్‌ ఉన్నట్లు మాట్లాడగలరు. ఓటుకు నోటు కేసు చాలా తీవ్రమైంది. రాజకీయ ఉద్దేశ్యాలతోనే ఓటుకు నోటు అంశం తెరపైకి వచ్చినప్పటికీ, అందులో తెలుగుదేశం పార్టీ ఇరుక్కుపోయింది. కేంద్రాన్ని […]