ప్రత్యేక హోదా ఆక్ పాక్ కరేపాక్:సుజనా

మనిషి ఆశాజీవి అని ఏ పెద్దమనిషి అన్నాడో కానీ..మనుషుల్లో తెలుగు మనుషులంతా ఆశాజీవులు వేరెవరూ ఉండరేమో అనిపిస్తుంది.ప్రత్యేక హోదా మెం ఇవ్వము అని కేంద్రం మొహం మీద మొత్తి మరీ చెప్తున్నా మనలో ఆశ చావడం లేదు.ఎప్పుడు ఏ తలమాసిన ప్రతినిధి ప్రత్యేక హోదా అంటూ మీడియా ముందుకొచ్చినా అందరం ఇదేదో ప్రకటన వచ్చేస్తుందని వెర్రి వెంగళప్పల్లా ఎదురుచూడడం వాళ్లేమో మనకు అర్థం కానీ..అర్థం చేసుకోలేని..మాటల్తో నిస్సిగ్గుగా మనల్ని వంచిస్తునే వున్నారు. తాజాగా కేంద్ర మంత్రివర్యలు టీడీపీ […]

హోదా కాదు, హోదా లాంటిది మాత్రమే.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా సాధ్యం కాదనీ, రాజ్యాంగ పరమైన ఇబ్బందులు ఉన్నాయని బిజెపి సీనియర్‌ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌ సిద్దార్ధ నాథ్‌ సింగ్‌ తెలిపారు. ప్యాకేజీలో ఉన్న అంశాల్ని వేరే రూపంలో ఆంధ్రప్రదేశ్‌కి అమలు చేయడానికి తగిన కసరత్తు జరుగుతోందనీ, త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని ఆయన తెలిపారు. అయితే హోదాకు మించి ఇస్తామని ప్రభుత్వాలు, పార్టీలు చెప్పే మాటలు విశ్వసించడానికి వీలుండదు. ఐదేళ్ళో, పదేళ్ళో ప్రత్యేక […]

భూమా బ్యాండ్ బజాయించాడు

నంద్యాల ఎంపీ భూమా నాగిరెడ్డి కోపం తో ఊగిపోయాడు.ఇదేదో ఫ్యాక్షన్ గొడవ కాదు.నంద్యాల చుట్టుపక్కల గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నంద్యాల టౌన్ లో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది.రోడ్లన్నీ జలమయం అయ్యాయి.మునిసిపల్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు తప్ప సహాయక చర్యలు కానీ మరమ్మత్తులు కానీ చేపట్టిన పాపాన పోలేదు. విషయం తెలుసుకున్న భూమా మునిసిపల్ అధికారుల్ని కొట్టినంత పని చేశారు.ఆగ్రహం తో ఊగిపోయారు.ఎం చేస్తున్నారు మీరు?ఫండ్స్ అన్ని ఎం చేస్తన్నారు..నంద్యాలను నాశనం చేస్తున్నారు మీరంతా […]

ఒలింపిక్స్‌లో అది కూడా ఉండాలట

కాంస్య పతకంతో ఒలింపిక్స్‌లో పరిపెట్టుకున్న యోగేశ్వర్‌దత్‌, ఆ పతకాన్ని అప్‌గ్రేడ్‌ చేసుకోవడం క్రీడా లోకాన్ని నివ్వెరపరిచింది. రియో ఒలింపిక్స్‌లో యోగేశ్వర్‌ దత్‌ నిరాశపరిచాడు. అయితే అంతకు ముందు ఒలింపిక్స్‌లో అతనే హీరో. స్వర్ణం, రజతం కాకపోయినా కాంస్య పతకం సాధించి దేశం దృష్టిని ఆకర్షించాడు. ఆ సమయంలో ఓ వివాదం తెరపైకి వచ్చింది రజత పతకం సాధించిన విజేత, డోప్‌ పరీక్షల్లో విఫలమయ్యాడు. తద్వారా ఆ ఆటను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి రజత పతక […]

రాజకీయాల్లో సొంతిల్లు, అద్దె ఇల్లు

రాజకీయాలు భలే కామెడీగా ఉంటాయ్‌. రాజకీయ నాయకులు పార్టీలు మారేటప్పుడు చేసే వ్యాఖ్యలు ఇంకా చిత్రంగా ఉంటాయి. చచ్చేదాకా ఫలానా పార్టీలోనే ఉంటానని చెప్పే నాయకులు కూడా మాట తప్పేస్తారు. పైకి మాత్రం మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదంటారు. నేను చనిపోయాక నా పార్తీవ శరీరమ్మీద టీడీపీ జెండానే కప్పబడుతుందని చెప్పిన తమ్మినేని సీతారాం ఎన్నో పార్టీలు మారారు. రాజకీయ నాయకుల నిబద్ధతకి ఇది నిదర్శనం. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఒకప్పుడు తెలుగుదేశం […]

నెహ్రూ దేనికీ పాకులాట?

తెలుగు ప్రజలంతా గర్వించదగ్గ నటుడు,నాయకుడు అయిన ఎన్టీఆర్ కి సన్నిహితుడుగా ముద్రపడ్డ దేవినేని రాజశేఖర్( నెహ్రు )టీడీపీ తీర్థం పుచ్చుకొవడం దాదాపుగా ఖరారైంది.ఈ మేరకు ఆయన కుమారుడు దేవినేని అవినాష్ తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలుసుకున్నారు. సెప్టెంబర్ 9 వ తేదీన అధికారికంగా సైకిల్ ఎక్కాయనున్నారు తండ్రి కొడుకులు. రాజకీయాల్లో బద్ద శత్రువులుండరు అనడానికి నిదర్శనం దేవినేని..ఎవరెన్ని పార్టీలు మారినా దేవినేని మాత్రం టీడీపీ వైపు తొంగి కూడా చూడడు అనుకునేవారు అందరూ.దేవినేని […]

బోండా బాబూ ఏమిటీ డ్రామాలు

రాజకీయాల్లో ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో అని తెలుగు ప్రజలకి అనుమానం ఉన్నమాట వాస్తవం..గతం లో ఎన్నడూ చూడనన్ని ఘోరమైన రాజకీయాలకు మనమే సాక్ష్యంగా నిలిచాము.పొద్దున్నే టీడీపీ ఎంపీ టీజీ గారు ప్రెస్ మీట్ పెట్టి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై దుమ్మెత్తి పోసాడు.తమిళనాడు లో అయితే జయలలిత కాళ్ళు చేతులు విరగ్గొట్టేది అని,రాజకేయాలంటే గడ్డం గీసుకోవడం కాదు లాంటి పరుషమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు. ఆ వెర్షన్ అయింది..ఏమనుకున్నారో ఏమో టీడీపీ అధినాయకత్వం..అరరె ఇది ఎటెల్లి […]

చంద్రబాబుకి ముద్రగడ బంపర్‌ ఆఫర్‌.

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేయాలని అభిప్రాయపడ్డారాయన. చంద్రబాబు నిరహార దీక్ష చేస్తే ప్రత్యేక హోదా వస్తుందని ముద్రగడ చెప్పారు. తనకూ అవకాశం కల్పిస్తే చంద్రబాబుతో కలిసి దీక్షలో పాల్గొంటాననీ, ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసమేనని ముద్రగడ వివరించారు. కాపు ఉద్యమం మలిదశను ప్రారంభించేందుకోసం కాపు ప్రముఖులతో ముద్రగడ సమావేశమవుతున్నారు. దాసరి నారాయణరావుతో సమావేశమైన ముద్రగడ, […]

జనసేనకి ఇంకో దిక్కేది?

రాజకీయ పార్టీ పెట్టేశాం, వీలున్నప్పుడు గట్టిగట్టిగా మాట్లాడేశాం అంటే సరిపోదు. అభిమానులే కార్యకర్తలని సరిపెట్టుకోడానికీ వీల్లేదు. అవేవీ ఓ సెలబ్రిటీని నాయకుడ్ని చెయ్యలేవు. రాజకీయాల్లో రాణించాలంటే ప్రజల మన్ననలు పొందాలి. కానీ పవన్‌కళ్యాణ్‌ ఇంకా రాజకీయాల్లో చిన్నపిల్లాడిలానే వ్యవహరిస్తున్నట్టున్నాడు. ప్రత్యేక హోదాపై మాట్లాడిన పవన్‌కళ్యాణ్‌కి మద్దతు లభిస్తున్నా, ఆయనపై వ్యతిరేకత కూడా అలాగే వినిపిస్తోంది. చిన్నపిల్లాడిలా పవన్‌ మాట్లాడేసి, మారాం చేస్తే కుదరదని కొందరు రాజకీయ నాయకులు సున్నితంగా విమర్శిస్తే, పవన్‌కళ్యాణ్‌ పిచ్చోడని ఇంకొందరు విమర్శిస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌ […]