హరీష్‌, కేటీఆర్‌లలో ఎవరికి దక్కేనో!

మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌ల మధ్య విపరీతమైన పోటీ ఉంది. వీరిలో హరీష్‌రావు స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌కి మేనల్లుడు. కేటీఆర్‌ అయితే కెసియార్‌ తనయుడే. ఇద్దరూ మంత్రులే. తెలంగాణ రాష్ర సమితి పార్టీకి వీరిద్దరూ ముఖ్యమైన వ్యక్తులు, మూలస్తంభాల్లాంటివారు. ఇద్దరిలో కెటియార్‌ ఒకింత ఎక్కువ. ముఖ్యమైన శాఖలన్నీ కెటియార్‌ వద్దనే ఉన్నాయి. కానీ కెటియార్‌కి ఇంకో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించాలని చూడటం ద్వారా హరీష్‌రావుని ఇంకా తక్కువ చెయ్యాలనుకుంటున్నారట ముఖ్యమంత్రి కెసియూర్‌. అదెలాగంటే బాధ్యతలు పెరిగే కొద్దీ […]

మోడీ చుట్టూ అంతమంది కోటీశ్వరులా!

తాజా మంత్రివర్గ విస్తరణతో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కోటీశ్వరుల సంఖ్య 72కు చేరుకుందని, అలాగే క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించిన మంత్రుల సంఖ్య 24కు పెరిగిందని ఢిల్లీకి చెందిన ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో పేర్కొంది. లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎన్నికల కమిషన్‌కు అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్‌లలో పేర్కొన్న వివరాల ఆధారంగా ఆ సంస్థ ఈ అధ్యయనం జరిపింది. కొత్తగా మంత్రివర్గంలో చేర్చుకున్న మంత్రుల […]

బాబు సంపాదన ఎంతో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వార్షికాదాయం రూ. 36 లక్షలు. సిఎంతో సహా ఆయన ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్, ఓటర్ ఐడీ అన్నీ హైదరాబాద్‌లో ఉండగా స్థిర, చరాస్తులు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. తొలిరోజు స్మార్ట్ పల్స్ సర్వేను ముఖ్యమంత్రి ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రారంభించారు. తొలుత ఎన్యుమరేటర్లు ముఖ్యమంత్రికి సంబంధించిన వివరాలు సేకరించారు. సిఎంగా తనకు వచ్చే ఆదాయం అన్నింటితో కలుపుకుని రూ. 36 లక్షలని చంద్రబాబు ఎన్యుమరేటర్లకు వివరించారు. తన స్వగ్రామం చిత్తూరుజిల్లా […]

టీడీపీ వాళ్ళనూ వదలొద్దు:బీజేపీ

ఏపిలో పార్టీని శరవేగంగా విస్తరించేందుకు బిజెపి తన రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసింది.ఆరుగంటల పాటు ఢిల్లీలోని ఏపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నివాసంలో జరిగిన కోర్ కమిటీ భేటీలో, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేశారు. ”రాష్ట్రంలో ఏ పార్టీ నాయకులు వస్తామన్న వద్దనకండి. చేర్చుకోండి. చివరికి టిడిపి వాళ్లనైనా వదలవద్దు. పార్టీ తలుపులు బార్లా తెరవండి. బిజెపిని బలోపేతం చేయ్యండి” అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రాష్ట్ర నేతలకు సూచించారు. శుక్రవారం నాడిక్కడి […]

కాంగ్రెసోళ్ళకి వైఎస్సార్‌ గుర్తుకొచ్చిండు 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని నేడు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు చాలా గట్టిగా స్మరించుకున్నారు. దివంగత నేత, సమైక్య తెలుగు రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. పరిపాలనలో వివాదాలు ఎలా ఉన్నా అనేక పథకాలతో ప్రజల నాడిని పట్టుకున్నారు రాజశేఖర్‌రెడ్డి. స్వతహాగా డాక్టర్‌ కావడంతో పేదవారు ఆరోగ్యం కోసం పడ్తున్న పాట్లు చూసి చలించిపోయారు. 108 అంబులెన్స్‌ సర్వీసులు, ఆరోగ్యశ్రీ వంటి పథకాల్ని వైఎస్సార్‌ […]

మోడీ మేనియా:పెళ్లి ఆగిపోయింది!

వరకట్నం వల్ల పెళ్లి ఆగిపోవడం చూశాం. లవ్ ఎపైర్ల వల్ల ఆగిపోవడం విన్నాం. చిన్న చిన్న కారణాలతో పెళ్లిళ్లు నిలిచిపోవడం మనకు తెలుసు. కానీ ప్రధాని మోడీ వల్ల పెళ్లి ఆగిపోయిందంటే నమ్ముతారా. కానీ ఆ పెళ్లితో మోడీకి ఎలాంటి సంబంధం లేదు. కానీ పెళ్లి మాత్రం ఆయన కారణంగానే ఆగిపోయింది. ఏంటి నమ్మబుద్ధి కావడం లేదా.. ఐతే ఈ స్టోరీ చదవండి. ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన ఓ వ్యాపారవేత్తకు.. ప్రభుత్వ ఉద్యోంగం […]

కేశినేనికి కర్ణుడి శాపాలు

నవ్యాంధ్ర రాజధానిలో దేవాలయాలు కూల్చివేతల ఘటన అనేకరకాలుగా మలుపులు తిరుగుతుంది.దాదాపు 45 హిందు దేవాలయాలను కూల్చివేతపై హిందు మతసంస్దలు ఒక్కసారిగా భగ్గు మన్నాయి.అయితే ప్రభుత్వంకంటే కేశినేని, బుద్దా వెంకన్నలు చంద్రబాబు దృష్టి వీరిపై మరల్చుకోవటానికి అతి చేస్తున్నారని, హిందు సాంప్రదాయాలను గౌరవిం చకపోతే రానున్నకాలంలో కేశినేని నానికి టిక్కెట్ కూడా రాదని, ఒకవేళ వచ్చినా వచ్చే ఎన్నికల్లో అతను తప్పక ఓటమి చెందుతాడని నిండు సభసాక్షిగా శివ స్వామి శాపనార్ధాలు పెట్టారు. వాస్తవంగా భారతదేశ సాంప్రదాయంలో ప్రతి […]

ఎన్టీఆర్‌ ఇళ్లకు ‘చంద్ర’ గ్రహణం

మీకు బైక్‌ ఉందా? ల్యాండ్‌ ఫోన్‌.. ఫ్రిజ్‌ ఉన్నాయా? ఇంట్లో ఎవరైనా నెలకు రూ.10 వేలు వచ్చే ఉద్యోగమేదైనా చేస్తున్నారా? రెండు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారా? అయితే మీరు ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద సొంత ఇంటిని పొందేందుకు అనర్హులే. వచ్చిన అర్జీలు వడపోసి. అర్హులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం, ఇలా.. 13 షరతులను అమలు చేస్తోంది. ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో ఈ […]

లేచాడు నిద్ర లేచాడు జైపాల్ రెడ్డి

పురాణాల్లో కుంభకర్ణుడిగురించి వినే వుంటారు.ఓ ఆరు నెలలు తిండి తర్వాత 6 నెలలు నిద్ర ఇది ఆయన కార్యాచరణ.సరిగ్గా అలాగే ఉంటుంది తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేతే జైపాల్ రెడ్డి గారి వ్యవహారం కూడా.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు టైంలో కొంచెం హడావిడి చేసిన ఈయన ఆ తరువాత కనపడలేదు.ఇన్నాళ్లకు మళ్ళీ మెలుకున్నట్లు కనిపిస్తోంది. లేవడంతోనే ఏకంగా కేసీర్ పైన తెరాస ప్రభుత్వం పైనా విమర్శల వర్షం కురిపించేసారు.కేసీర్ పచ్చి అవకాశవాది అని ధ్వజమెత్తారు.అంతేనా కాంగ్రెస్ […]