తడిచి మోపెడు అవుతున్న ఉద్యోగుల తరలింపుఖర్చు

ఉద్యోగుల తరలింపుఖర్చు ప్రభుత్వానికి తడిసి మోపెడు కానుంది. సచివాలయంలో మంత్రులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శుల కార్యాలయాలకు మాత్రమే సదుపాయాలు కల్పిస్తున్నారు. అదీ ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు సాధ్యపడేలాలేదు. కాగా హెచ్‌ఓడిలకు సంబంధించి మీ కార్యాలయాలను మీరే వెతుక్కోండని ప్రభుత్వం తెగేసి చెప్పడంతో రెట్టింపు అద్దెలతో లీజుల పందేరానికి తెరలేచినట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు దళారులు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలియవచ్చింది. తరలింపు ప్రక్రియ ప్రారంభం కాకమునుపే పరిస్థితి ఇలా ఉంటే మూడేళ్లపాటు ప్రైవేటు భవనాలకు లీజులు […]

మెరుపుతీగ బొద్దుగుమ్మలా మారుతోంది

నాజూకైన అందం ముద్దుగుమ్మ శ్రియది. వయసు పెరిగినా కానీ తన దేహాకృతిలో ఏ మాత్రం మార్పు రాకుండా మెయింటైన్‌ చేస్తోంది శ్రియ. అటువంటి మెరుపుతీగ శ్రియ ఇప్పుడు బొద్దుగుమ్మలా మారబోతోంది. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలో బాలయ్య పక్కన జోడీ కోసమట. బొద్దుగా అంటే మరీ ఎక్కువగా కాకుండా, జీరోసైజ్‌ నుంచి కాస్త కండ పట్టేలా శ్రియ తన శరీరాన్ని మార్చుకోనుంది దర్శకుడి సూచన మేరకు శ్రియ ఈ ప్రయత్నం చేస్తోందట. ఈ మధ్య మరీ సన్నగా […]

మెగాస్టార్‌ చిరంజీవి సర్వసన్నద్ధం

చిరంజీవి సినిమా కోసం పూర్తిగా సన్నద్ధమైపోయారు. పూర్తి హ్యాండ్‌సమ్‌ లుక్స్‌లోకి వచ్చేశారు. రాజకీయాల్లో ఉంటూ, సినిమాల్లో నటించడం ఒకింత కష్టమైన ప్రక్రియే అయినప్పటికీ మెగాస్టార్‌ తన అభిమానుల కోరకను తీర్చడం కోసం కొంచెం ఎక్కువగానే కష్టపడాల్సి వచ్చింది. తమిళ్‌ సినిమా ‘కత్తి’కి రీమేక్‌గా రానున్న ఈ సినిమాకి ‘కత్తిలాంటోడు’ అనే పేరు పరిశీలనలో ఉంది. వినాయక్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా అతి త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనుంది. హీరోయిన్‌ ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. […]

టార్గెట్‌ కేసీఆర్‌: కోదండరామ్‌ వదల్లేదు

కేసీఆర్‌ని టార్గెట్‌ చేయడం ఇప్పట్లో మానేలా లేరు తెలంగాణ జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌. విదేశాలకు వెళ్ళి వచ్చిన కోదండరామ్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సందర్భాన్ని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌పై విమర్శలకే వాడుకోవడం ద్వారా ‘టార్గెట్‌ కేసీఆర్‌’ మిషన్‌ని యాక్టివ్‌గానే ఉన్నట్లు సంకేతాలు పంపారాయన. తెలంగాణ ఉద్యమంలో కెసియార్‌తో కలిసి పనిచేసిన కోదండరామ్‌, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కెసియార్‌ ఆగ్రహానికి గురయ్యారు. ఉద్యమం జరుగుతున్న సమయంలోనే తనను దాటేసి వెళ్ళిపోతున్నారని […]

కొరటాల హీరోలకు అందడేమో!

ఇద్దరు పెద్ద హీరోలు, రెండు పెద్ద సినిమాలు, భారీ విజయాలు. అంతే ఆ డైరెక్టర్‌ దశ తిరిగిపోయింది. అంతవరకూ స్టోరీ రైటర్‌గా ఉన్న ఆయన ఇంకెవరో కాదు కొరటాల శివ. ప్రభాస్‌తో ఆయన చేసిన ‘మిర్చి’ ఘాటైన విజయం తెచ్చి పెట్టింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌తో చేసిన ‘శ్రీమంతుడు’ సూపర్బ్‌ విజయాన్ని అందించింది. దాంతో కొరటాల రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు ఆయన కోసం స్టార్‌ హీరోలు క్యూ కట్టేస్తున్నారు. సాదా సీదా హీరోలకెవ్వరికీ ఈ స్టార్‌ […]

ఈ వ్యభిచారమేటి రెడ్డిగారూ?

పార్టీ ఫిరాయింపుని రాజకీయ వ్యభిచారం అని సంబోదిస్తున్నారు రాజకీయ నాయకులు. అయితే అదిప్పుడు రాజకీయాల్లో సాధారణ విషయంగానే పరిగణించాల్సి ఉంటుంది. పార్టీ ఫిరాయింపుల చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పరిపాలన పక్కన పెట్టి మరీ పాలకులు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. గతంలో జరిగినప్పటికీ రాజకీయ చరిత్రలో ఇప్పుడు జరుగుతున్నంత జుగుప్సాకరంగా ఇంతకు ముందెన్నడూ పార్టీ ఫిరాయింపులు జరగలేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంగా అభివర్ణించినవారిలో గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒకరు. ఆయన కూడా […]

మహేష్ రెమ్యునరేషన్ చూస్తే షాకే!!

జులైలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ఎ.ఆర్.మురుగడాస్‌ల చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఠాగూర్‌మధు-ఎన్వీప్ర సాద్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈచిత్రానికి మహేష్ తీసుకుంటున్న పారితోషికం అక్షరాలా 23కోట్లు అని సమాచారం. ఇక తమిళ, తెలుగులోనే కాదు.. తన సైటల్ ఆఫ్ టేకింగ్‌తో ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న మురుగదాస్ ఈ చిత్రానికి 20కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ […]

రెమ్యూనరేషన్‌లో వెనకబడిపోయిన రజనీ

‘రోబో’ తర్వాత రజనీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతూ మరో సంచలనానికి తెరతీస్తోన్న చిత్రం ‘రోబో2.0’. సాధారణంగా రజనీకాంత్ సినిమా అంటే కేవలం ఆయనకున్న ఇమేజ్, క్రేజ్‌తోనే ఆ చిత్రాల బిజినెస్, కలెక్షన్లు వస్తుంటాయి. అందుకే ఆ సినిమాలకు పనిచేసిన అందరి కంటే రజనీకే ఎక్కువ పారితోషికం ముడుతూ ఉంటుంది. ఇది ఏ స్టార్‌హీరో చిత్రానికైనా సహజం. కానీ ‘రోబో2.0’ చిత్రం విషయంలో రజనీ పరిస్థితి అలా లేదని సమాచారం. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ […]

హైకోర్టులో గెలిచిన కెసిఆర్

ఎన్నికల నియమావళి ఉల్లంఘన వ్యవహారంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. 2008 ఉప ఎన్నికల సందర్భంగా ఆయనపై వివిధ పోలీస్‌స్టేషన్‌లలో నమోదైన కేసులన్నింటినీ హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 2008 ఉప ఎన్నికల్లో కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్ల సమావేశాల సందర్భంగా చంద్రశేఖరరావు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుల ఆధారంగా పలు పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదు […]