చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా ఫోన్ కాల్స్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు మంచి అడ్మినిస్ట్రేట‌ర్‌గా పేరుంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో బాబు ఆలోచ‌న‌లు కాస్త కొత్త‌గానే ఉంటాయి. వాటిల్లో ఎన్ని స‌క్సెస్ అయినా, ఎన్ని ఫెయిల్ అయినా బాబు ఆలోచ‌న‌లు మాత్రం కొత్త‌గానే ఉంటాయి. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కొద్ది రోజుల క్రితం 1100 కాల్ సెంట‌ర్ ప్ర‌వేశ‌పెట్టింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక…… అవినీతి అంతానికి 1100 కాల్ సెంట‌ర్ అంటూ ఎంతో ఆర్భాటంగా ప్ర‌చారం చేశారు.

ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా, ఎక్క‌డ అవినీతి జ‌రిగినా తాట తీసేందుకు ఈ 1100 కాల్ సెంట‌ర్ ఉప‌యోగంగా ఉంటుంద‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఈ సెంట‌ర్ నిర్వ‌హ‌ణ కోసం విజ‌య‌వాడ‌లో ఏకంగా 700 మంది ఉద్యోగుల‌తో క్వారీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఆఫీస్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ కాల్ సెంట‌ర్‌కు వ‌స్తోన్న ఫోన్ కాల్స్ చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి పెద్ద స‌మ‌స్య‌గా మారాయి.

1100 నెంబ‌ర్‌కు స్టేట్ నలుమూలల నుంచి దీనికి కాల్స్‌ వెల్లువెత్తుతున్నాయి. మే చివరి వారంలో దాదాపు 23,827 కాల్స్‌ 1100 వచ్చాయంటే దీనికి స్పందన ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చంద్ర‌బాబుకు మ‌రో షాక్ ఏంటంటే ఈ కాల్ సెంట‌ర్‌కు టీడీపీ నేత‌ల నుంచే ఎక్కువ ఫిర్యాదులు వ‌స్తున్నాయి.

గ‌ల్లీ స్థాయి నుంచి నియోజ‌క‌వర్గ‌, జిల్లా స్థాయి వ‌ర‌కు టీడీపీ నేత‌ల అవినీతి గురించే వేలాది ఫిర్యాదులు వ‌స్తున్నాయి. ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎంత వ‌ర‌కు వ‌చ్చిందో కూడా తెలుసుకునే ఛాన్స్ కూడా ఉంది. దీంతో ఇక్క‌డ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కూడా పెద్ద ప్ర‌హ‌స‌నంలా మారింది. ఏదేమైనా చంద్ర‌బాబు ప్ర‌వేశ‌పెట్టిన ఈ 1100 నెంబ‌ర్‌కు టీడీపీ నేత‌ల‌పై ఫిర్యాదులే ఎక్కువ ఉండ‌డంతో ఆయ‌న‌కు, ఆయ‌న ప్ర‌భుత్వానికి పెద్ద చిక్కు తెచ్చిపెట్టేలా ఉంది.