సోమిరెడ్డి ప్ర‌క‌ట‌న ఎంత ప‌నిచేసింది!

పార్టీకి చెందిన ఏ ముఖ్య‌ ప్ర‌క‌ట‌న అయినా.. అందులోనూ అటు పార్టీకి, ఇటు రైతుల‌కు సంబంధించి కీల‌క అంశాల‌కు చెందిన ముఖ్య విష‌యాల‌ను సీఎం చేస్తేనే ఇంపాక్ట్ ఉంటుంది. ఆ శాఖ నిర్వ‌హిస్తున్న మంత్రులు చేసినా రాని మైలే జ్‌.. సీఎం చేస్తే వ‌స్తుంద‌నడంలో సందేహంలేదు. సీఎం ఎంత చ‌నువిచ్చినా.. అంద‌రి క‌న్నా ఎక్కువ‌గా ప్రాధాన్య మిస్తున్నా.. దానిని దుర్వినియోగం చేసుకోకూడ‌దు. ఒక‌వేళ చేస్తే.. ఎలా ఉంటుందో మంత్రి సోమిరెడ్డికి ఇప్పుడి ప్పుడే తెలుస్తోంది. ఎందుకంటే టీడీపీ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రైతురుణ‌మాఫీని ప్ర‌క‌టించింది. ఇందుకు సం బంధించి ఆశాఖ‌మంత్రి సోమిరెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న సీఎంకు ఆగ్ర‌హం తెప్పించింది. దీంతో ఆయ‌న్ను మంద‌లించార‌ట‌.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు కేబినెట్లో అత్యంత దూకుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మంత్రుల్లో వ్య‌వ‌సాయ శాఖ‌మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న‌రెడ్డి పేరు ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఈ దూకుడి వ‌ల్ల సీఎం చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పులు త‌ప్ప‌డం లేదు. అన్ని సంద‌ర్భాల్లోనూ ఇంత దుందుడుకుగా వ్య‌వ‌హ‌రించ‌డం మంచిది కాక‌పోయినా.. త‌న పంథా మాత్రం మార్చు కోవ‌డం లేదు సోమిరెడ్డి. ఈ దూకుడు న‌చ్చిన చంద్ర‌బాబుకు ఆయ‌న‌కు కీల‌క‌మైన వ్య‌వ‌సాయ శాఖ‌ను అప్ప‌జెప్పా రు. సోమిరెడ్డి కూడా అందుకు త‌గిన‌ట్టే ప‌నిచేస్తున్నారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో రైతు రుణ‌మాఫీ అంశం టీడీపీకి కీల‌కంగా మారింది. సీఎం దగ్గ‌రుండి మ‌రీ ఇందుకోసం నిధులు విడుద‌ల‌చేస్తున్నారు.

రైతుల రుణమాఫీకి సంబంధించి నిధులను త్వరలో విడుదల చేస్తామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రకటించడంపై చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యార‌ట‌. ప్రభుత్వపరమైన ముఖ్యమైన పాలసీ అయిన రుణమాఫీకి సంబంధించిన ప్రకటన ముఖ్యమంత్రి హోదాలో తాను ప్రకటిస్తానని, అంతే కానీ మంత్రి హోదాలో ఎలా ప్రకటిస్తా రని, ఎవరు ఇచ్చిన సమాచారంతో ఇటువంటి ప్రకటన చేశారని మంత్రి సోమిరెడ్డిని చంద్రబాబు నిలదీశార‌ట‌. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న‌త‌రుణంలో మూడు వేల కోట్లు ఏ విధంగా తెస్తామ‌ని, రైతుల ఖాతాలో ఎలా జ‌మ చేస్తామ‌ని జమ చేస్తామని ప్రశ్నించారట.

చనువు ఇస్తున్నానని, ఎవరికి వారు విధానమైన ప్రకటనలు చేసి ప్రభుత్వ ప్రతిష్టను మంటగలపడం సరికాదని చంద్ర‌బాబు గ‌ట్టిగానే చెప్పార‌ట‌. రైతులకు రుణమాఫీకి సంబంధించిన నిధులు ఏయే పద్దుల నుంచి విడుదల చేయాలో ఆర్థికశాఖ అధికారులకు అర్థం కావడం లేదు. దీనిపై ఆశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, సీఎం చంద్రబాబు కలసి ఎలా ముందుకెళ్లాల్లో చర్చిస్తున్నారు. మంత్రి సోమిరెడ్డి ప్రభుత్వ ముఖ్య విధానాన్ని మంత్రి హోదాలో ప్రకటించడం తప్పని ఆర్థికశాఖ మంత్రి కూడా వ్యాఖ్యానించినట్లు స‌మాచారం! ఇప్ప‌టికే త‌న ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌భుత్వాన్ని చిక్కుల్లో పెడుతున్న సోమిరెడ్డి.. మ‌రోసారి త‌న వ్యాఖ్య‌ల‌తో బాబును ఇబ్బందుల్లో ప‌డేశారు!!