డ్రగ్ ఇష్యూ లో కొత్త మలుపు.. భయపడుతున్నఛార్మి

July 25, 2017 at 10:03 am
add_text000

టాలీవుడ్‌లో ఒక్క‌సారిగా ప్ర‌కంప‌న‌లు రేపిన డ్రగ్స్ ఇష్యూ కేసును హీరోయిన్ చార్మీ కొత్త మ‌లుపు తిప్పింది. సిట్ విచార‌ణ జ‌రుగుతోన్న తీరు త‌న‌కు న‌చ్చ‌డం లేద‌ని, చ‌ట్టానికి విరుద్ధంగా బ్ల‌డ్ టెస్టులు చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిష‌న్ వేసింది. ఈ కేసు ఈ రోజు విచార‌ణ‌కు రానుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) కింద విచారణ పేరుతో పరీక్షల కోసం బలవంతంగా రక్తం, వెంట్రుకలు, గోళ్లు వంటివి తీసుకోవడం చట్టవిరుద్ధమని ఛార్మి తన పిటిషన్‌లో పేర్కొంది. 

ఇక త‌న‌ను కేవ‌లం మ‌హిళా అధికారులే విచారించాల‌ని, విచారణ సమయంలో తన లాయర్ కూడా పక్కనే ఉండాలని, తన రక్త నమూనాను సేకరించకూడదని ఆమె కోర్టును ఆశ్రయించింది. ఇక ఈ విచార‌ణ‌లో డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, శ్యాం కె.నాయుడు, తరుణ్, సుబ్బరాజు లాంటి వాళ్లు ఎవ్వ‌రూ ర‌క్త సేక‌ర‌ణ‌కు నో చెప్ప‌లేదు. ఇప్పుడ చార్మీ ర‌క్త సేక‌ర‌ణ‌కు నో చెపుతూ ఏకంగా హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో ఆమె పేరు డ్ర‌గ్స్ లిస్టులో ప్ర‌ధానంగా ఉండ‌డం వ‌ల్లే ఆమె ఇలా చేస్తోంద‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

డ్రగ్ ఇష్యూ లో కొత్త మలుపు.. భయపడుతున్నఛార్మి
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts