మెగాస్టార్ చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాను స్టార్ట్ చేసినప్పుడు అన్నీ సెట్ అయినా హీరోయిన్ మాత్రం సెట్ కాలేదు. చివరకు ఎంతోమంది పేర్లు పరిశీలించి చివరకు కాజల్‌ను సెట్ చేశారు. చిరు 151వ సినిమా విషయంలో కూడా ఇదే ఇబ్బంది ఎదురవుతోందట.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆథారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ముందుగా మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్‌ను హీరోయిన్గా అనుకున్నారు. ఆమె పేరు అలా ఉండగానే హాట్ హీరోయిన్ విద్యాబాలన్ పేరు తెరపైకి వచ్చింది. ఐష్, విద్యాబాలన్ పేర్లు తెరమీద ఉండగానే ఇప్పుడు మరో దీపికా పడుకొనే పేరు సైతం చర్చల్లో నలుగుతోంది.
ఈ సినిమాకు నేషనల్ క్రేజ్ తీసుకువచ్చేందుకు ఈ సినిమాలో ఎలాగైనా బాలీవుడ్ హీరోయిన్ను నటింపజేయాలని దర్శకుడు సురేందర్‌రెడ్డి భావిస్తున్నాడట. అందుకే వరుసగా బాలీవుడ్ హీరోయిన్లతోనే దర్శకుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
ఫైనల్‌గా చిరు 151వ సినిమా హీరోయిన్ సెర్చ్ ఆపరేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుందో.. సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో. మళ్లీ చిరు అభిమానులకు ఈ విషయంలో నిరీక్షణ తప్పేలా లేదు.