బ్ర‌హ్మానందం ఆస్తుల లెక్క‌పై సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌

గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో టాలీవుడ్ టాప్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానంద‌కు సంబంధించిన ఓ న్యూస్ జోరుగా ట్రెండింగ్ అవుతోంది. బ్ర‌హ్మానందం ఆస్తుల విలువ ప్ర‌స్తుత మార్కెట్ లెక్క‌ల ప్ర‌కారం ఎన్ని కోట్లు ఉంటుంద‌నేదానిపై అటు జాతీయ మీడియాలోను, ఇటు తెలుగు మీడియాలోను వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. మూడున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగా తెలుగు వెండితెర‌మీద తిరుగులేని క‌మెడియ‌న్‌గా స్థానం సంపాదించుకున్న బ్ర‌హ్మానందం ఇటీవ‌ల స‌రైన ఫామ్‌లో లేరు.

ఆయ‌న న‌టించిన సినిమాల్లో ఆయ‌న ట్రాక్‌కు స‌రైన పేరు రావ‌డం లేదు స‌రిక‌దా… యంగ్ క‌మెడియ‌న్ల ధాటికి ఆయ‌న కాస్త రేసులో వెన‌క‌ప‌డ్డారు. బ్రహ్మానందం వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. ఒకానొక సమయంలో స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో బ్రహ్మానందం తప్పకుండా ఉండాలన్న కండిషన్ పెట్టే రేంజ్ బ్ర‌హ్మీది. ఇటీవ‌ల చిరు న‌టించిన 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150లో చిరునే ప‌ట్టుబ‌ట్టి మ‌రీ బ్ర‌హ్మీని త‌న సినిమాలో పెట్టించుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇక బ్ర‌హ్మీ రెమ్యునరేష‌న్ రోజుకు కాకుండా ప్ర‌స్తుతం గంట‌ల లెక్క‌నే ఉంటోంది. హీరో రేంజ్‌, సినిమా స్థాయిని బ‌ట్టి బ్ర‌హ్మీ త‌న రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్నాడు. ఇక బ్రహ్మీ ఆస్తులు 320 కోట్ల వరకు ఉంటాయన్న ప్రచారం జరుగుతుంది. అత్యంత ఖ‌రీదైన కార్లు, జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన బంగ్లా, కోట్లు విలువ చేసి వ్యవసాయ భూమి బ్రహ్మానందం ఆస్తుల్లో ఉన్నాయట.