టార్గెట్ : ముస్లింలు వైసీపీకి దూరం… అందుకే పొత్తు క‌థ‌నాలు!

ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొనేందుకు విమ‌ర్శ‌లే ఒక్కొక్క‌సారి ప‌నిచేయ‌వు.. వారిని దెబ్బ‌కొట్టేందుకు అనేక మార్గాలుంటాయి. అలాంటి మార్గాల‌ను బాగా ఒంట‌బ‌ట్టించుకున్న ఎల్లో మీడియా..  వాటిని ఆధారంగా చేసుకునే వైసీపీని చావు దెబ్బ‌కొట్టేందుకు ప్ర‌య‌త్నించింది. తాజాగా నంద్యాల పోరు పీక్ స్టేజ్‌కి చేరిపోయిన నేప‌థ్యంలో అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీల మ‌ధ్య గెలుపు ఓట‌ములు కేవలం ముస్లిం మైనార్టీ ఓట్ల మీద‌నే ఆధార‌ప‌డ్డాయి. ఈ వ‌ర్గం వారు ఎటు మొగ్గితే ఆ పార్టీ సునాయాసంగా విజయం సాధించేందుకు అవ‌కాశం ఉంది. 

అయితే, నంద్యాల‌లో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ముస్లిం మైనార్టీల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు అన్ని విధాలా ప్ర‌య‌త్నించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వెళ్లి.. ముస్లిం ఓట‌ర్ల‌ను క‌లిశారు. త‌న తండ్రి హ‌యాంలో వెలుగులోకి తెచ్చిన ముస్లిం రిజ‌ర్వేష‌న్ అంశాన్ని ప్ర‌స్తావించారు. తాను అధికారంలోకి వ‌స్తే.. ముస్లింల‌కు ఏమేం చేస్తానో అది కూడా వివ‌రించాడు. దీంతో ముస్లింల‌లో చాలా మంది వైసీపీ వైపు మొగ్గారు. దీనిని ప‌సిగ‌ట్టిన ఎల్లో మీడియా, ముఖ్యంగా చంద్ర‌బాబుకు మౌత్ పీస్ వంటి ఓ చానెల్ కం ప‌త్రిక‌.. వైసీపీని మ‌త‌త‌త్వ బీజేపీని ముడిపెడుతూ ఓ పాత చింత‌కాయ ప‌చ్చ‌డికి కొత్త‌తాలింపు వేసింది. 

ఫ‌స్ట్‌పేజీలోనే పెద్ద ఎత్తున వార్త ప‌రిచేసింది. బీజేపీ-వైసీపీ భాయి భాయి! శీర్షికన వ‌చ్చిన క‌థ‌నంలో కొత్త విష‌యం ఏద‌న్నా చూద్దామ‌న్నా మ‌చ్చుకు కూడా క‌నిపించ‌లేదు. గ‌తంలో ఓ నెల రోజుల కింద‌ట జ‌రిగిన అంశాల‌ను గుదిగుచ్చి.. అక్ష‌రాల క్ర‌మాన్నిఅతిచ‌క్క‌గా మారుస్తూ… రాత్రికిరాత్రి ఏదో జ‌రిగిపోయింది. వైసీపీ, బీజేపీలు ఒక్క‌టైపోతున్నాయ‌న్న ఆందోళ‌న క‌లిగించేలా ముఖ్యంగా ముస్లిం వ‌ర్గాన్ని బెంబేలెత్తించేలా పెద్ద క‌థ‌నం అచ్చోసింది. ఈ దెబ్బ‌కి మైనార్టీలు వైసీపీకి దూరం అయిపోవాల‌ని ఆ ప‌త్రిక ఎత్తుగ‌డ‌. 

పోనీ ఈ ఓట్లేమ‌న్నా.. టీడీపీకి ప‌డ‌తాయా? అంటే అది క‌ల‌లో మాట‌! అయితే, ఈ ఓట్ల‌న్నీ.. కాంగ్రెస్ అభ్య‌ర్థిగా నిలుచున్న అబ్దుల్ ఖాద‌ర్ కి వెళ్లిపోతే.. వైసీపీకి ఓట్లు త‌గ్గిపోతే.. బాబు గెలిచి పోతాడు! ఇదీ ఆ ప‌త్రిక క‌థ‌నం వెను క ఉన్న కుట్ర‌! సో.. మ‌రి మీడియా పార‌ద‌ర్శ‌కం.. అంటూ పౌరుషాలు చెప్పే ఆ ఛానెల్ ఎండీ.. ఇలాంటి నీచ్ క‌మీన్ రాత‌ల‌కు తెగ‌బ‌డ‌డం.. జ‌నాలు గ‌మ‌నించ‌ర‌ని ఎవ‌రూ అనుకోరు! కాబ‌ట్టి.. వాస్త‌వం ఏంటో బుధ‌వారం ఓట్ల మిష‌న్ల‌లో నిక్షిప్తం కానుంది. అప్ప‌టి వ‌ర‌కు వెయ‌ట్ చేద్దాం.