నియోజకవర్గంలో తిరుగులేని లీడర్ కానీ ప్రజల మాట మరోలా..!

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గానికి ధూళిపాళ్ల ఫ్యామిలీకి బ‌ల‌మైన అనుబంధం ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా ఐదుసార్లు టీడీపీ త‌ర‌పున సిట్టింగ్ ఎమ్మెల్యే న‌రేంద్ర గెలుస్తున్నారు. గ‌తంలో ఆయ‌న తండ్రి వీర‌య్య చౌద‌రి కూడా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప‌నిచేశారు. 1994 నుంచి అక్క‌డ తిరుగులేని విజ‌యాలు సాధిస్తోన్న న‌రేంద్ర పొన్నూరును త‌న అడ్డాగా చేసుకున్నారు. 2004లో వైఎస్ గాలిలో జిల్లాలో 18 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయినా న‌రేంద్ర గెలిచాడంటే న‌రేంద్ర స్టామినా అర్థ‌మ‌వుతోంది.

ఐదుసార్లు గెలిచిన న‌రేంద్రను ఇప్పుడిప్పుడే క‌ష్టాలు వెంటాడుతున్నాయి. సంగం డెయిరీకి జీవిత కాల చైర్మ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన న‌రేంద్ర ఆ విష‌యంలో చంద్ర‌బాబు మాట‌ను పెడ‌చెవిన పెట్టారు. ఇక ఇటీవ‌ల బాబు వ‌ద్ద ప్ర‌యారిటీ కూడా త‌గ్గింది. మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో లోలోన తీవ్ర‌స్థాయిలో ర‌గిలిపోతున్నారు. త‌న‌కు ఎన్న‌ట‌కీ మంత్రి ప‌ద‌వి రాకుండా ఎవ్వ‌రూ అడ్డుకోలేర‌ని కాస్త ధిక్కార స్వ‌రం పెంచారు.

ఇక వ‌రుస‌గా ఐదుసార్లు గెల‌వ‌డంతో న‌రేంద్ర‌పై వ్య‌తిరేక‌త పెరుగుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ్ముడు సురేంద్ర పెత్త‌నం, మితిమీరిన జోక్యం ఎక్కువ‌వ్వ‌డంతో న‌రేంద్ర‌పై నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో వ్య‌తిరేక‌త ఎక్కువ‌వుతోంది. ఐదుసార్లు గెలిచిన న‌రేంద్ర ఆ స్థాయిలో పొన్నూరును డ‌వ‌ల‌ప్ చేయ‌లేద‌నేది వాస్త‌వం.

ఇక మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డం, బాబు వ‌ద్ద ప్ర‌యారిటీ లేక‌పోవ‌డంతో జిల్లాలో కీల‌క‌మైన సీఆర్‌డీఏ వ్య‌వ‌హారాల్లో సైతం ఆయ‌న ఇన్వాల్ కాలేదు. దీంతో చంద్ర‌బాబు కూడా ఆయ‌న్ను రోజు రోజుకు ప‌క్క‌న పెడుతున్నారు. మంత్రి ప‌ద‌వి రాలేద‌ని న‌రేంద్ర అసంతృప్తితో చేసిన వ్యాఖ్య‌లు, ఆయ‌న అనుచ‌రుల హంగామా కూడా ఆయ‌న‌కు ఇబ్బందిగా మారింది. న‌రేంద్ర‌లో ఇటీవ‌ల నైరాశ్యం ఎక్కువ‌వ్వ‌డంతో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు కూడా పెద్ద‌గా అందుబాటులో ఉండ‌డం లేద‌న్న గుస‌గుస‌లు ఎక్కువుగా వినిపిస్తున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ (+):

– తండ్రి వీర‌య్య చౌద‌రి వేసిన బ‌ల‌మైన రాజ‌కీయ వార‌స‌త్వం

– నియోజ‌క‌వ‌ర్గంలో రెండు ద‌శాబ్దాలుగా కూడా స‌రైన ప్ర‌త్య‌ర్థి లేక‌పోవ‌డం

– పొన్నూరు సెగ్మెంట్‌లో సంస్థాగ‌తంగా బ‌లంగా ఉన్న టీడీపీ

– ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజ‌కీయ అనుభ‌వం

మైన‌స్ పాయింట్స్ (-):

– ఐదుసార్లు గెలిచినా మంత్రి ప‌ద‌వి రాలేద‌న్న తీవ్ర నైరాశ్యం

– చంద్ర‌బాబు వ‌ద్ద ఇటీవ‌ల త‌గ్గిన ప్ర‌యారిటీ

– సంగం డెయిరీకి జీవిత కాల చైర్మ‌న్‌గా మార‌డం

– త‌మ్ముడు సురేంద్ర పెత్త‌నం….. అవినీతి, ఆరోప‌ణ‌లు

– పెద‌కాకాని ఎమ్మార్వో బ‌దిలీ ఇష్యూలో సొంత పార్టీలోనే తీవ్ర వ్య‌తిరేక‌త‌

– ఒక‌ప్పుడు జిల్లాను శాసించిన న‌రేంద్ర ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమిమ‌వ్వ‌డం

– ఇటీవ‌ల కార్య‌క‌ర్త‌ల‌కు సైతం దూరంగా, నిష్క్రియాత్మ‌కంగా ఉండ‌డం

తుది తీర్పు:

పొన్నూరు నుంచి వ‌రుస‌గా ఐదుసార్లు గెలిచిన న‌రేంద్ర‌పై నియోజ‌క‌వ‌ర్గంలో ఎంతో కొంత వ్య‌తిరేక‌త ఉన్న మాట‌వాస్త‌వం. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే ఆయ‌న ప్ర‌స్తుతం ప్ర‌త్తిపాడులో ఉన్న కాకుమాను మండ‌లం పొన్నూరులో కలిపేలా ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌వేళ పొన్నూరు ఎస్సీ అయితే పక్క‌నే ఉన్న ప్ర‌త్తిపాడుకు మార‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే ఆయ‌న ప్ర‌త్తిపాడుపై కూడా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నారు.

న‌రేంద్ర‌కు ఆరోసారి టిక్కెట్టు రావ‌డంలో సందేహం లేదు. ఆయ‌న ప్ర‌త్య‌ర్థి ఎంత గ‌ట్టిగా ఉన్నా న‌రేంద్ర చివ‌రి క్ష‌ణంలో అయినా ఎంత త‌క్కువ మెజార్టీతో అయినా బ‌య‌ట‌ప‌డ‌డంలో సందేహం లేదు. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న‌లో ఉన్న నిర్వేదం మాత్రం త్వ‌ర‌గా వ‌ద‌లాల్సిన అవ‌స‌రం ఉంది.