దిల్ రాజు పంట పండించిన ‘ ఫిదా ‘ ….సూప‌ర్ కలెక్ష‌న్స్‌

మ‌న తెలుగు సినీ జ‌నాల‌కు సినిమాలు న‌చ్చాలే కాని ఎంత‌గా నెత్తిన పెట్టుకుంటారో అందుకు ఫిదా సినిమాయే నిద‌ర్శ‌నం. పెద్ద సినిమాలే కాదు చిన్న హీరోల సినిమాల్లో సైతం బ‌ల‌మైన కంటెంట్ ఉంటే ప్రేక్ష‌కులు ఫిదా అయిపోతార‌ని ఫిదా సినిమాయే నిరూపించింది. వ‌రుణ్ ఇంత‌కు ముందు నాలుగు సినిమాలు చేశాడు..ఒక్క సినిమాకు హిట్ టాక్ రాలేదు.

ముకుంద బిలో యావ‌రేజ్‌, కంచె అవార్డుల సినిమాగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు పొందింది. లోఫ‌ర్ డిజాస్ట‌ర్‌. మిస్ట‌ర్ మ‌రీ వ‌రెస్ట్ డిజాస్ట‌ర్‌. కానీ ఫిదా ప్రేక్ష‌కుల‌కు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చ‌డంతో ప‌దే ప‌దే చూస్తున్నారు. ఫిదా తొలి రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా దాదాపు పదికోట్ల షేర్ లాగేసింది. మూడోరోజు సండే గురించి ఫిగర్లు బయటకు రావాల్సి ఉంది. ట్రేడ్ వ‌ర్గాల ప్రాథ‌మిక అంచ‌నా ప్ర‌కారం కేవ‌లం ఫ‌స్ట్ వీకెండ్‌లోనే ఫిదా రూ. 13 కోట్ల వ‌ర‌కు కొల్ల‌గొట్టేయ‌వ‌చ్చ‌ని లెక్క‌లు వేస్తున్నారు.

ఈ సినిమాకు అంతా క‌లిపి ఖ‌ర్చు రూ. 10 కోట్లు కూడా కాలేద‌ని తెలుస్తోంది. శాటిలైట్ రూ 3.5 కోట్ల‌కు సేల్ అయ్యింది. ఇక ఫ‌స్ట్ వీకెండ్‌కే రూ. 13 కోట్లు అంటే…టోట‌ల్‌గా ఫిదాకు యే రేంజ్‌లో లాభాలు వ‌స్తాయో అర్థ‌మ‌వుతోంది. నైజాం, వైజాగ్ ఏరియాలో దిల్ రాజు సొంతంగా రిలీజ్ చేసుకున్నార‌ట‌. ఇక ఫిదా క‌లెక్ష‌న్ల‌తో దిల్ రాజు ఫిదా అవుతుంటే, అటు హీరో వ‌రుణ్ కంటే సాయి ప‌ల్ల‌వి పంట బాగా పండిన‌ట్టే అంటున్నారు.