సునీల్ సినిమా బిజినెస్ చూస్తే జాలేస్తోందిగా…

టాలీవుడ్‌లో టాప్ క‌మెడియ‌న్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సునీల్‌. కెరీర్ స్టార్టింగ్‌లో సునీల్‌కు వ‌రుస హిట్లు వ‌చ్చాయి. వ‌రుస‌ హిట్లు కూడా సునీల్ సొంతం చేసుకున్నాడు. అందాల రాముడు – మ‌ర్యాద రామ‌న్న – పూల‌రంగ‌డు సినిమాల‌తో సునీల్ స్టార్ హీరోలు అసూయ చెందే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అక్క‌డి నుంచి సునీల్ కెరీర్ రివ‌ర్స్ గేర్‌లో వెన‌క్కు త‌న్నుకొచ్చింది.

ప్ర‌స్తుతం సునీల్ ఒకే ఒక్క హిట్ కోసం తహతహలాడుతున్నాడు. చివ‌ర‌కు సునీల్ సినిమాకు బిజినెస్ సంగ‌తి అలా ఉంచితే శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడు కాని దుస్థితి ఏర్ప‌డింది. సునీల్ చివ‌రి రెండు సినిమాలు జ‌క్క‌న్న‌, వీడు గోల్డ్ ఎహే సినిమాల శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడు కాలేదు. జ‌క్క‌న్న కంటే వీడు గోల్డ్ ఎహే సినిమాలో కాస్త కంటెంట్ ఉన్నా సునీల్ సినిమాల ప‌ట్ల జ‌నాల్లో క్రేజ్ లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కులు ఈ సినిమా వైపే క‌న్నెత్తి చూడ‌లేదు. దీంతో ఈ సినిమా సైతం డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

ప్రస్తుతం సునీల్ హీరోగా నటించిన ” ఉంగరాల రాంబాబు ” సినిమా రిలీజ్ కి సిద్ధమైంది . పరుచూరి శివరామ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి క్లీన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకుంది.

సునీల్‌కు ఇటీవ‌ల అస్స‌లు హిట్ లేక‌పోవడంతో ఈ సినిమాను కొనేందుకు ఒక్క బయ్యర్ కూడా సినిమాని కొనడానికి ముందుకు రావడం లేదు . దాంతో బయ్యర్స్ వస్తేనే సినిమా రిలీజ్ చేయగలనని లేదంటే నష్టపోవడం ఖాయమని , అంతటి రిస్క్ తీసుకోలేనని బయ్యర్ల కోసమే ఎదురు చూస్తున్నాడు నిర్మాత. సునీల్‌కు ఇలాంటి పొజిష‌న్ రావ‌డం చూస్తుంటే నిజంగా జాలేస్తుందిగా…!