సొంత సభలంటే చంద్రబాబుకు భయం!

September 11, 2018 at 10:42 am

తెలంగాణ ముందస్తు ఎన్నికల మీద తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంత ఫోకస్ పెడుతున్నారు? ఆయన ఫోకస్ మొత్తం శనివారం నాడు హరికృష్ణ దశదిన కర్మ సందర్భంగా హైదరాబాదుకు వచ్చినప్పుడు.. పనిలో పనిగా పార్టీ తెలంగాణ నాయకులతో కాసేపు సమావేశం కావడంతో సరిపోయిందని పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. ఆ సమావేశంలో కాంగ్రెస్ పొత్తులకు దిశానిర్దేశం చేసి, ఆ పిమ్మట ఆ నిర్ణయంతో తనకు సంబంధం లేదని లోకల్ లీడర్ల నిర్ణయమేనని సెలవిచ్చి అక్కడితో అమరావతికి చేరుకున్నారు.CwL2uUEVIAEzAHr

ఇక ఎన్నికల ప్రచార వ్యూహాల సంగతేమిటి.. ప్రచార సభల మాటేమిటి అనే విషయంలో పార్టీ నాయకులు చాలా నిరాశగా కనిపిస్తున్నారు. తెదేపా తరఫున సొంతంగా ప్రచార సభలు నిర్వహించడం గురించి.. చంద్రబాబు పెద్ద సీరియస్ గా లేరనే మాట వినిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రిగా తాను ఖాళీ లేనంత బిజీ పనుల్లో ఉన్నానని, పార్టీ తరఫున విడిగా ప్రచారసభలు ముమ్మరంగా నిర్వహించడం వాటికి తాను ప్రతిసారీ హాజరుకావడం సాద్యం కాకపోవచ్చునని చంద్రబాబు నాయకులతో చెప్పినట్లుగా సమాచారం.Naidu speech

అయితే విశ్లేషకులు భావిస్తున్న ప్రకారం.. పార్టీ తరఫున సొంతంగా సభలు నిర్వహించాలంటే చంద్రబాబు భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. పార్టీ సొంతంగా అన్ని స్థానాలకు పోటీచేయకపోవడం ఆ కారణాల చేతనే అని అనుకుంటున్నారు. చంద్రబాబు ఒక్కడే పాల్గొంటూ ప్రచార సభలు నిర్వహిస్తే గనుక.. జన సమీకరణ అనేది పెద్ద సమస్య అవుతుంది. అసలే తెలుగుదేశానికి కేడర్ పూర్తిగా దెబ్బతిని ఉంది. ఇంతా చేసి.. సభలు నిర్వహించినప్పటికీ.. అతని సభల ప్రభావం చేత ఆయా చోట్ల అభ్యర్థులు గెలవలేకపోతే గనుక… చంద్రబాబు నాయకత్వ పటిమ మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది.

తెలంగాణలో చంద్రబాబు ఎంత కష్టపడి ప్రచారం నిర్వహించినా పార్టీ తగినన్ని విజయాలు నమోదు చేయలేదనే ప్రచారం జరిగితే.. చంద్రబాబు ఇమేజి మంటగలిసిపోయిందనే అర్థం వస్తుంది. అలాంటి ప్రచారం.. ఏపీలో మళ్లీ అధికారం కోరుకుంటున్న చంద్రబాబుకు చాలా ప్రమాదకరం. ఇలాంటి సమీకరణాల దృష్ట్యా చంద్రబాబు అసలు తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వీలైనంత తక్కువగానే రావాలని అనుకుంటున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు.

సొంత సభలంటే చంద్రబాబుకు భయం!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share