వైసీపీలో వెన్నుపోటు రాజ‌కీయం

November 19, 2017 at 8:54 am
YSRCP, Chinthalapudi constituency, Ganta murali, sreedhar

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం వైసీపీ అధినేత నానా పాట్లు ప‌డుతుంటే ఆ పార్టీ నాయ‌కులు మాత్రం వెన్నుపోటు రాజ‌కీయాల‌తో వాళ్ల పార్టీని వాళ్లే నాశ‌నం చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో వైసీపీలో ఉండేందుకు ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఈ టైంలో ఉన్న నాయ‌కులు కూడా వెన్నుపోటు రాజ‌కీయాలు చేయ‌డంతో పార్టీ మ‌రింత ప‌త‌నం దిశ‌గా వెళుతోంది. ప‌శ్చిమగోదావ‌రి జిల్లా టీడీపీకి కంచుకోట‌. ఈ జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ విజ‌యం సాధించేందుకు జ‌గ‌న్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాడు. గ‌త ఎన్నిక‌ల్లో ఏలూరు ఎంపీగా పోటీచేసిన‌ తోట చంద్ర‌శేఖ‌ర్ ఎన్నిక‌ల త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోవ‌డంతో జ‌గ‌న్ ఈ సీటు బాధ్య‌త‌ల‌ను మాజీ మంత్రి కోట‌గిరి విద్యాధ‌రరావు త‌న‌యుడు కోట‌గిరి శ్రీథ‌ర్‌కు అప్ప‌గించారు.

ఎంపీగా పోటీకి రెడీ అవుతోన్న శ్రీథ‌ర్‌కు రాజ‌కీయ అనుభం లేదు. అంద‌రిని స‌మ‌న్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన టైంలో సీనియ‌ర్లుగా ఉన్న వాళ్ల‌ను ప‌క్క‌న పెట్టి, ప్ర‌జాక్షేత్రంలో ఏ మాత్రం బ‌లం లేని లీడ‌ర్ల డైరెక్ష‌న్‌లో ముందుకు వెళుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఏలూరు ఎంపీ సెగ్మెంట్ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లోను, కృష్ణా జిల్లాలోని కైక‌లూరు, నూజివీడు సెగ్మెంట్ల‌లోను విస్త‌రించి ఉంది. దెందులూరు, కైక‌లూరు సెగ్మెంట్లు మాగంటికి కంచుకోట‌లు. ఇక్క‌డ ఇప్ప‌ట‌కీ అయితే శ్రీథ‌ర్ త‌న‌కు మెజార్టీ వ‌స్తుంద‌ని ఆశ‌లు పెట్టుకోవ‌డం అత్యాశే. ఎంపీగా గెల‌వాలంటే క‌నీసం మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో అయినా అంద‌రిని క‌లుపుకుని వెళ్లాలి. శ్రీథ‌ర్ మాత్రం పార్టీలో ప‌ట్టు ఉండి, రాజ‌కీయ అనుభ‌వం ఉన్న సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్ట‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌జాక్షేత్రంలో బ‌లం లేని కేవీపీ బంధువు గైడెన్సా…

క‌మ్మ సామాజిక‌వ‌ర్గం అంటే టీడీపీకి ఎంత వెన్నుద‌న్నుగా నిలుస్తారో చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ వీరిని పూర్తిగా ప‌క్క‌న పెట్టారు. క‌మ్మ క్యాస్ట్‌కు ప్ర‌యారిటీ ఇవ్వాల్సిన కృష్ణా, గోదావ‌రి జిల్లాల్లో వాళ్ల‌ను ప‌ట్టించుకోలేదు. కృష్ణా జిల్లాలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి మాత్ర‌మే జ‌గ‌న్ టిక్కెట్టు ఇస్తే, ప‌శ్చిమగోదావ‌రి జిల్లాలో ఒక్క నిడ‌ద‌వోలు సీటు మాత్ర‌మే ఇచ్చాడు. ఈ త‌ప్పును స‌రిచేసుకునేందుకు జ‌గ‌న్ ఈ సారి క‌మ్మ వ‌ర్గం లీడ‌ర్ల‌కు ఈ జిల్లాల్లో సీట్లు పెంచుతున్నారు. దెందులూరు సీటును ఈ సారి ఇదే వ‌ర్గానికి ఇవ్వ‌డం దాదాపు ఖ‌రారైంది. ఏలూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సామాజిక‌వ‌ర్గం వ్య‌క్తులే గ‌త నాలుగైదు ద‌శాబ్దాలుగా ఎంపీలుగా గెలుస్తున్నారు. వీరిని క‌లుపుకుని వెళ్లాల్సిన శ్రీథ‌ర్ ప‌క్క‌న‌పెడుతూ వ‌స్తున్నారు.

శ్రీథ‌ర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం చింత‌ల‌పూడిలోనే పార్టీని ఏక‌తాటిమీద‌కు తేవ‌డంలో అట్ట‌ర్ ప్లాప్ అయ్యాడు. అస‌లు ఓ ఎంపీ క్యాండెట్‌గా ఆ స్టామినా ఉన్న వ్య‌క్తేనా అన్న సందేహాలు వ‌స్తున్నాయి. క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఏపీఐడీసీ చైర్మ‌న్ గంటా ముర‌ళీకి చింత‌ల‌పూడి, పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో అనుచ‌ర‌గ‌ణం ఉంది. రాజ‌కీయంగా అనుభ‌వం లేని శ్రీథ‌ర్ చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఓ నాయ‌కుడి చేతిలో కీలుబొమ్మ‌గా మారార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాజ్య‌స‌భ స‌భ్యుడు కెవిపి.రామ‌చంద్ర‌రావు స‌మీప బంధువు అయిన స‌ద‌రు వ్య‌క్తి ఘంటా ముర‌ళీతో గ‌తంలో ఉన్న రాజ‌కీయ వైరం నేప‌థ్యంలో ఘంటా ముర‌ళీకి వెన్నుపోటు పోడిచే క్ర‌మంలో అంతిమంగా శ్రీథ‌ర్ వీపుకే ఆ బాణం త‌గులుతోంది. రాజ‌కీయంగా ఇంకా ఓన‌మాలు నేర్చుకునే దశ‌లోనే ఉన్న శ్రీథ‌ర్ ఈ విష‌యాన్ని గుర్తించ‌డం లేదు.

ముర‌ళీని కొట్టేందుకు టీడీపీ వాళ్ల‌తో మిలాఖ‌త్ :

విచిత్రం ఏంటంటే ఘంటా ముర‌ళీని రాజ‌కీయంగా పూర్తిగా అణ‌గ‌దొక్కే క్ర‌మంలో ఎంపీ శ్రీథ‌ర్‌, కేవీపీ బంధువు చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గాల్లో కొంద‌రు టీడీపీ వాళ్ల‌ను బాగా ఎంక‌రేజ్ చేస్తున్నారు. రేపు సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీ వాళ్లు ఎంపీ మాగంటికి ఓట్లు వేసుకుంటారు…. వీళ్ల రాజ‌కీయంతో విసిగిపోతోన్న కొంద‌రు వైసీపీ వాళ్లు సైతం టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ లాజిక్ శ్రీథ‌ర్ ఎలా మిస్స‌య్యాడో ? అర్థం కావ‌ట్లేదు. అంతిమంగా శ్రీథ‌ర్ రాంగ్ గైడెన్స్‌తో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును చేజేతులా నాశ‌నం చేసుకుంటున్నాడు. మాజీ మంత్రి కోట‌గిరికి చింత‌ల‌పూడి, పోల‌వ‌రం, ఏలూరు, ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో మంచి అనుచ‌ర‌గ‌ణం ఉండేది. శ్రీథ‌ర్ త‌న తండ్రి మిత్రుల‌ను, అనుచ‌రుల‌తో పాటు పార్టీలో ఉన్న సీనియ‌ర్ల‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రిని క‌లుపుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఓ వైపు ఎంపీ సెగ్మెంట్‌లో సిట్టింగ్ ఎంపీ మాగంటి బ‌లంగా ఉన్నాడు. ఈ టైంలో అస‌లే క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న వైసీపీని గ్రూపుల‌కు అతీతంగా బ‌లోపేతం చేస్తేనే శ్రీథ‌ర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాగంటిని బ‌లంగా ఢీకొట్టే ఛాన్సులు ఉన్నాయి

 

వైసీపీలో వెన్నుపోటు రాజ‌కీయం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share