ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమాకు ఇంగ్లీష్ టైటిల్‌

వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం జై ల‌వ‌కుశ సినిమా స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై ఇండ‌స్ట్రీలో అప్పుడే చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. ఎన్టీఆర్ స్వ‌యంగా త‌న నెక్ట్స్ క‌మిట్‌మెంట్ త్రివిక్ర‌మ్‌తో ఉంద‌ని చెప్పేశాడు. దీంతో అంద‌రూ ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్‌మీద‌కు వెళుతుందా ? అని ఆస‌క్తితో ఉన్నారు.

ఇదిలా ఉండ‌గానే ప్ర‌స్తుతం ప‌వ‌న్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న త్రివిక్ర‌మ్ మ‌రో ఆరేడు నెల‌ల వ‌ర‌కు ఫ్రీ అయ్యే ప‌రిస్థితులు లేవు. దీంతో ఈ గ్యాప్‌లోనే ఎన్టీఆర్ మ‌రో సినిమా చేసే ఆలోచ‌న‌లో కూడా ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే త్రివిక్ర‌మ్‌తో ఎన్టీఆర్ చేసే సినిమా స్టోరీ లైన్‌తో పాటు టైటిల్ గురించి కూడా అప్పుడే ఇండ‌స్ట్రీలో లీకులు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ యంగ్ సైనికాధికారిగా క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఎన్టీఆర్ సైనికాధికారి అయినా త్రివిక్ర‌మ్ మార్క్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నుంద‌ట‌. ఇక ఈ సినిమా టైటిల్ గురించి కూడా ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ సినిమాకు సోల్జ‌ర్ అనే ఇంగ్లీష్ టైటిల్ పెట్టాల‌నుకుంటున్నార‌ట‌. త్రివిక్ర‌మ్ సినిమాలు అచ్చ తెలుగుద‌నంతో ఉంటాయి. మ‌రి ఈ సినిమాకు సోల్జ‌ర్ అని ఇంగ్లీష్‌లో ప‌క్కా మాస్ టైటిల్ ఫిక్స్ చేయ‌డంతో సినిమా మాస్ టైటిల్ ? ఏంట‌న్న డౌట్లు కొంద‌రికి రైజ్ అవుతున్నాయి.

సోల్జ‌ర్ అన్న టైటిల్ పెట్టినా సినిమా మాత్రం త్రివిక్ర‌మ్ మార్క్‌లో క్లాస్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో ఉంటుంద‌ని తెలుస్తోంది. మ‌రి ప‌వ‌ర్ ఫుట్ టైటిల్‌తో ఇప్పుడే ఫ్యాన్స్ ఫీజులు ఎగిరిపోయేలా చేస్తోన్న త్రివిక్ర‌మ్ – రేపు సినిమాతో ఇంకెన్ని షాకులు ఇస్తారో ? చూడాలి.