టాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాకు కేరాఫ్ అడ్ర‌స్ అట‌!

July 14, 2017 at 1:39 pm
add_text22

తాజా టాలీవుడ్ డ్ర‌గ్ ఉదంతంలో యంగ్ హీరో న‌వ‌దీప్ పేరు కూడా ప్ర‌ముఖంగా ప్ర‌స్తావ‌న‌కు తెచ్చిన సంగ‌తి తెలిసిందే. న‌వ‌దీప్‌ను ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు ఏకంగా టాలీవుడ్‌కు చెందిన ఐదుగురు అగ్ర‌హీరోలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే న‌వ‌దీప్‌ను పూర్తిస్థాయిలో విచారిస్తే త‌మ పేర్లు ఎక్క‌డ బ‌య‌ట‌కు వ‌స్తాయోన‌ని భ‌య‌ప‌డుతోన్న ఆ అగ్ర‌హీరోలు న‌వ‌దీప్‌ను ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

వాస్త‌వానికి న‌వ‌దీప్ పేరు డ్ర‌గ్స్ ఇష్యూలో బ‌య‌ట‌కు రావ‌డం ఇదే మొద‌టిసారి కాదు. గ‌తంలో టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ క‌ల‌కలం రేగిన ప్ర‌తిసారి న‌వ‌దీప్ పేరు బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉంది. తాజాగా ఎక్సైజ్ శాఖ టాలీవుడ్ లింకులపై దర్యాప్తు ప్రారంభించిన వెంటనే నవదీప్ అప్రమత్తమయ్యాడని సమాచారం. 

ఈ క్ర‌మంలోనే త‌న పేరు బ‌య‌ట‌కు రాకుండా ఉండేందుకు తనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఐదుగురు అగ్రహీరోలను రంగంలోకి దించాడని తెలుస్తోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే న‌వ‌దీప్‌కు గ‌చ్చిబౌలి ఏరియాలో ఓ ప‌బ్ ఉంది. అ ప‌బ్ డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాకు కేరాఫ్ అడ్ర‌స్ అట‌. అక్క‌డ నుంచే టాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా అయ్యేద‌ట‌.

ఇక నవదీప్ ఆ ఐదుగురు అగ్రహీరోలకు ఎప్పటికప్పుడు కాస్ట్ లీ పార్టీలు అరేంజ్ చేసేవాడని సమాచారం. దీంతో నవదీప్ పై వారికి అంతులేని ఆపేక్ష అని, దీంతోనే వారు నవదీప్‌ను రక్షించేందుకు రంగంలోకి దిగారని తెలుస్తోంది. 

టాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాకు కేరాఫ్ అడ్ర‌స్ అట‌!
0 votes, 0.00 avg. rating (0% score)

comments