‘ గ‌బ్బ‌ర్‌సింగ్ -3 ‘ స్టోరీ & డైరెక్ట‌ర్ డీటైల్స్‌..!

ప‌వర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హిట్ మూవీకి మూడో సీక్వెల్ రెడీ అవుతోందన్న స‌మాచారం ఇప్పుడు టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో లీక్ అయ్యింది. ప‌వ‌ర్ వ‌రుస ప్లాపుల్లో ఉన్న‌ప్పుడు 2012లో వ‌చ్చిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. హిందీలో స‌ల్మాన్ న‌టించిన ద‌బంగ్ సినిమాను ఇక్క‌డ హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఈ సినిమా హిట్‌తో ప‌వ‌న్ కెరీర్ ఒక్క‌సారిగా స్కై రేంజ్‌లోకి దూసుకెళ్లింది.

గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాతో ప‌దేళ్ల‌పాటు హిట్ కోసం వెయిట్ చేసిన అభిమానుల‌కు ప‌వ‌న్ ఫుల్ మీల్స్ ఇచ్చేశాడు. ఈ క్యారెక్ట‌ర్‌పై బాగా ఇష్టం పెంచుకున్న ప‌వ‌న్ గ‌బ్బ‌ర్‌సింగ్‌కు సీక్వెల్‌గా గ‌తేడాది బాబి డైరెక్ష‌న్‌లో స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా చేశాడు. ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆడ‌లేదు. అయితే ‘ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ ‘ ఎండ్‌లో గ‌బ్బ‌ర్‌సింగ్ సీరిస్‌లో మూడో పార్ట్‌గా ‘ రాజా స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ ‘ సినిమా ఉంటుంద‌ని చిన్న హింట్ ఇచ్చాడు.

ఇక ఇప్పుడు లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ప‌వ‌న్‌తో ‘ గ‌బ్బ‌ర్‌సింగ్ -3 ‘ సినిమా తెర‌కెక్కించేందుకు గ‌బ్బ‌ర్‌సింగ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ రెడీగా ఉన్నాడ‌ట‌. ప‌వ‌న్‌కు సరిప‌డే రేంజ్‌లో అదిరిపోయే స్క్రిఫ్ట్ రెడీ చేసుకున్న హ‌రీష్ శంక‌ర్ ప‌వ‌న్‌ను క‌లిసి క‌థ వినిపించే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమా చేస్తోన్న ప‌వ‌న్ ఆ వెంట‌నే 2019 ఎన్నిక‌ల కోసం రెడీ అవునున్నాడు. మ‌రి ఈ టైంలో గ‌బ్బ‌ర్‌సింగ్ – 3 ఇప్ప‌ట్లో ప‌ట్టాలెక్కుతుందా ? అన్న డౌట్లు కూడా ఉన్నాయి.