ఫర్ ఎ ఛేంజ్:రికార్డ్స్ ని భయపెడుతున్న NTR

నందమూరి తారక రామారావు పేరే ఒక సంచలనం ఆయన అంశము పుణికి పుచ్చుకుని మే 20 1983 పుట్టిన నందమూరి తారక రామరారావు(jr NTR ), రూపంలోనూ ,వాక్చాతుర్యం లోను ,నటనలోనూ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు .ఆయన ప్రస్థానం బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో ప్రారంభం అయి, స్టూడెంట్ నెం -1 తో తనలోని నటుడిని బయటపెట్టి ఆది సినిమాతో ఇండస్ట్రీ కి సరికొత్త సంచలాన్ని చూపిస్తూ సింహాద్రితో సరికొత్త రికార్డ్స్ సృష్టించి అలా మొదలైనా ఆయన ప్రస్థానం ఎన్నో అవార్డులు మరెన్నో ప్రశంసలు అందుకొని తెలుగునాట సంచలనం సృష్టించాడు.జయాపజయాలను తట్టుకొని తన నటనలో ఎప్పటికప్పుడు సరికొత్త టెంపర్ చూపిస్తూ నాన్నకు ప్రేమతో అంటూ తన జయాత్రయాత్ర దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు.

తాజాగా NTR నటిస్తున్న జనతా గ్యారేజ్ పై అంచనాలు తెలుగు సినీ ఇండస్ట్రీ కి సరికొత్త రికార్డ్స్ ని పరిచయం చేయబోతున్నాయా అన్నంత రేంజ్ లో వున్నాయంటే అతిశయోక్తి కాదు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో ,నవీన్ యెర్నేని చిత్రాన్ని నిర్మించగా కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజీ టీజర్ రంజాన్ సందర్భంగా మన ముందుకు వస్తున్నాడు.

Click Here For Teaser

NTR సరసన సమంత ,నిత్యా మీనన్,అలాగే మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారు .చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలో ఆగస్టు 12 ప్రేక్షకులు ముందుకు తీసుకురావటానికి చిత్ర యూనిట్ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నారు .