తమిళనాట బాల‌య్య ప్ర‌భంజ‌నం

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలంటే కేవ‌లం తెలుగుకే ప‌రిమితం. బాల‌య్య సినిమాలు ఎక్కువుగా తెలుగు నేటివిటికి ప‌రిమిత‌మ‌య్యే ఉంటాయి. అలాంటి బాల‌య్య సినిమాకు కోలీవుడ్‌లో సూప‌ర్ క్రేజ్ వ‌స్తోంది. బాల‌య్య కెరీర్‌లో 100వ సినిమాగా తెర‌కెక్కిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా బాల‌య్య కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించ‌డంతో పాటు ఏకంగ రూ.77 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.

జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ (క్రిష్‌) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న చ‌క్ర‌వ‌ర్తి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాను ఇప్పుడు త‌మిళ్‌లో సైతం రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో తెర‌కెక్కిన బాహుబ‌లి – ది బిగినింగ్‌, బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమాలు త‌మిళ్‌లో అక్క‌డి సినిమాల‌ను మించి ఆడాయి.

ఈ రెండు సినిమాల దెబ్బ‌తో తెలుగు పిరియాడిక‌ల్ సినిమాపై త‌మిళ సినీ జ‌నాల‌కు బాగా మ‌క్కువ పెరిగింది. దీంతో శాత‌క‌ర్ణి సినిమాను సైతం అక్క‌డ రిలీజ్ చేసేందుకు ప‌లువురు నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు పోటీప‌డ్డారు. దీంతో శాత‌క‌ర్ణి త‌మిళ డ‌బ్బింగ్ రైట్స్‌కు ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఈ సినిమాను కొనుగోలు చేసేశారు. శాత‌క‌ర్ణి త‌మిళ వెర్ష‌న్‌ను 200లకు పైగా స్క్రీన్లలో ఈ చిత్రం రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.