కాజల్ కూడా భయపెడుతుందట

July 13, 2016 at 1:43 pm
kajal_agarwal

కమర్షియల్‌ సినిమాల్లో హీరోయిన్‌గా సక్సెస్‌ల మీద సక్సెస్‌ అందుకున్న భామ కాజల్‌ అగర్వాల్‌. అయితే ఇంతవరకూ ఎప్పుడూ ప్రయోగాల జోలికి వెళ్ళలేదు ఈ మద్దుగుమ్మ. కానీ తన తోటి హీరోయిన్స్‌ అంతా ప్రయోగాలపై ఎక్కువ ఆశక్తి చూపిస్తున్నారు. అంతేకాదు అందులో సక్సెస్‌ని కూడా చూస్తున్నారు.

అందుకే కాజల్‌ తన ఆలోచనను మార్చుకుంది. తాను కూడా ఇప్పుడు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తానంటోంది. కారణం ఏమిటో తెలియదుగానీ ఓ చిన్న సినిమాకి కాజల్‌ ఓకే చేసిందని గుసగుసలు వినవస్తున్నాయి. అయితే సినిమా చిన్నదే అయినా, కానీ కంటెంట్‌ మాత్రం అదుర్స్‌ అనేలా ఉంటుందట. ఇదో థ్రిల్లర్‌ మూవీ అని సమాచారమ్‌. తెలుగుతోపాటు, తమిళంలోనూ విడుదల చేసేలా ఈ సినిమాని తెరకెక్కించనున్నారని అంటున్నారు. ‘బ్రహ్మూెత్సవం’ దెబ్బకి కాజల్‌ బాగా డీలాపడిపోయింది. అదొక్కటే కాదు, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ కూడా కాజల్‌ కెరీర్‌ని బాగానే దెబ్బకొట్టేసింది. దాంతో కాజల్‌ మెట్టు దిగిందనీ, బెట్టు చేయకుండా అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటోందనీ తెలియవస్తోంది.

ఈ ఏడాది చేసిన రెండు భారీ సినిమాలు ఆమెను భారీగా నిరాశపరిచాయి. దాంతో కాజల్‌ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆమె చాలా సార్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ప్రయోగాల జోలికి పోనని చెప్పింది. కానీ పరిస్థితలు ఎలాంటి వారినైనా మార్చేస్తాయి అనడంలో కాజల్‌ బెస్ట్‌ ఎగ్జామ్‌పుల్‌గా మారింది. అందుకే హారర్‌ సినిమాకి ఓకే చేసేసిందట. అంటే త్రిష, నయన్‌, హన్సికల మాదిరి కాజల్‌ కూడా భయపెట్టడానికి రెఢీ అయిపోయిందన్న మాట.

కాజల్ కూడా భయపెడుతుందట
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share