కొత్త నోట్ల కట్టలు దొరికిపోతున్నది అందుకే

December 13, 2016 at 11:43 am
2000-rupees

పాత వెయ్యి ఐదువందల రూపాయల నోట్లు రద్దయిన తరువాత నుంచి రాబోయే వస్తున్నా కొత్త రెండువేలు ఐదువందల రూపాయల నోట్ల గురించి రకరకాల వార్తలు వచ్చాయి. కొత్తనోట్లలో నానో చిప్పులు పెట్టారని, వాటిద్వారా డబ్బులు ఒకేచోట ఎక్కువగా దాచివుంటే దొరికిపోతాయని రకరకాల వార్తలు వచ్చాయి.

అయితే అలాంటిదేమి లేదని ఇంతకు ముందు వచ్చిన నోట్ల లాగానే ఇవి కూడా తయారయ్యాయని తేలిపోయింది. ఇప్పుడు మాత్రం తాజాగా ఇంకో కొత్త విషయం వెలుగులోకొచ్చింది. అదేంటంటే కొత్త రెండువేల రూపాయల నోట్లలో పి32 అనే రేడియో ధార్మిక ఫాస్పరస్ ఐసోటోప్ ఉందన్న వార్త బయటకొచ్చింది.

రెండు వేల రూపాయల నోట్లు ముద్రించేందుకు ఈ రేడియో ధార్మిక పదార్థాన్నే వినియోగించారనీ అందువలనే కోట్లరూపాయలు ఒకే చోట దాచి ఉంచితే దొరికి పోతున్నాయని ఈ కోవలోనే మొన్న బెంగళూరు,ఢిల్లీ, చెన్నై, వెల్లూర్, వడోదర, పుణే ఇంకా చాలాచోట్ల ఆదాయపు పన్ను శాఖ కొత్త నోట్లకట్టలు ఎక్కువగా ఉన్నచోటే రైడ్ చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నారని చెపుతున్నారు. అయితే ఆర్బిఐ మాత్రం ఇలాంటిదేది ఉపయోగించినట్టు అధికారికం గా వెల్లడించలేదు.

కొత్త నోట్ల కట్టలు దొరికిపోతున్నది అందుకే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share