చిరు సినిమాలో ప్రియాంక:చక్రం తిప్పిన చెర్రీ

July 12, 2016 at 1:14 pm
image

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌ ఎవరన్నదానిపై స్పష్టత రావడంలేదు. చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ చిత్ర యూనిట్‌ నుంచి హీరోయిన్‌పై ఎలాంటి సమాచారమూ అందకపోవడం ఆశ్చర్యం కలిగించకమానదు. సినిమా షూటింగ్‌ ప్రారంభమైనా హీరోయిన్‌ ఎవరో తెలియకపోవడమేంటో? అనుకుంటున్నారంతా.

ఇంకో వైపున ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా నటించనుందని కొత్త గాసిప్‌ వినవస్తోంది. అయితే హీరోయిన్‌గా కాదట, సినిమాలో అతిథి పాత్రలో ప్రియాంకా చోప్రా కనిపించే అవకాశముందంటున్నారు. ప్రియాంక గతంలో రామ్‌చరణ్‌తో ‘జంజీర్‌’ సినిమాలో నటించింది. బహుశా, ప్రియాంకని రామ్‌చరణ్‌ ఒప్పించి ఉండాలి. నర్గీస్‌ ఫక్రి, ఐశ్వర్యారాయ్‌, అనుష్క, నయనతార ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎందుకో చిత్ర యూనిట్‌ హీరోయిన్‌ పేరుని ఖరారు చేయడంలేదు. హీరోయిన్‌గా ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ వాళ్లందరికీ గెస్ట్‌ రోల్స్‌ కట్టబెడుతున్నారు తప్ప పూర్తి హీరోయిన్‌గా ఒప్పుకోవడం లేదు.

ఎందుకో మరి. మెగాస్టార్‌ పక్కన హీరోయిన్‌గా నటించే అద్భుతమైన ఛాన్స్‌ ఎవరికి వస్తుందో ఎంతకీ తెలియరావడం లేదు. సినిమా సెట్స్‌మీదికెళ్లడం, కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిపోతోంది. కానీ మన మెగా మేస్త్రీతో జోడీ కట్టే ముద్దుగుమ్మ ఎవరో ఎక్కడ ఉందో మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. మెగాస్టార్‌తో రొమాన్స్‌ చేయడానికి వచ్చే ముద్దుగుమ్మ బాలీవుడ్‌ నుండి వస్తుందో, టాలీవుడ్‌లోనే దొరుకుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. హీరోయిన్‌ విషయంలో ఎందుకట ఈ మెగా సస్పెన్స్‌?

చిరు సినిమాలో ప్రియాంక:చక్రం తిప్పిన చెర్రీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share