త‌న భార్య సీక్రెట్లు చెప్పిన ప్ర‌భాస్‌..!

December 5, 2016 at 7:17 am
Prabas

బాహుబ‌లి సినిమాతో దేశ‌వ్యాప్తంగా ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిపోయాడు యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. టాలీవుడ్‌లో దాదాపు నాలుగు ప‌దుల వ‌య‌స్సుకు చేరువలో ఉన్న ప్ర‌భాస్ మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్నాడు. ప్ర‌భాస్ పెళ్లి గురించి ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు మీడియా కూడా ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తోంది.

ప్ర‌స్తుతం బాహుబ‌లి 2లో న‌టిస్తోన్న ప్ర‌భాస్ ఆ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే పెళ్లి చేసుకుంటాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే బాహుబ‌లి 2 త‌ర్వాత ప్ర‌భాస్ పెళ్లి ఉంటుంద‌న్న వార్త‌ల‌తో ప్ర‌భాస్ పెళ్లి వార్త‌లు మ‌ళ్లీ మీడియాలో జోరుగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే త‌న మిత్రుల‌కు రీసెంట్‌గా ప్ర‌భాస్ ఇచ్చిన పార్టీలో త‌నకు కాబోయే భార్య గురించి ప్ర‌భాస్ కొన్ని సీక్రెట్లు చెప్పిన‌ట్టు స‌మాచారం. ప్ర‌భాస్‌క కాబోయే భార్య వైజాగ్‌లో స్థిర‌ప‌డ్డ ఉన్న‌త కుటుంబానికి చెందిన అమ్మాయి అట‌. ఆమె ఉన్న‌త విద్యావంతురాల‌ని…త‌న మ‌న‌స్త‌త్వానికి క‌రెక్టుగా సూట్ అవుతుంద‌నే ఆమెను త‌న భార్య‌గా చేసుకుంటున్న‌ట్టు ప్ర‌భాస్ త‌న సన్నిహితుల‌తో చెప్పాడ‌ట‌.

ఇప్పుడు ఇదే న్యూస్ ఫిల్మ్‌న‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. తనకోసం గత మూడు సంవత్సరాలుగా ఆ అమ్మాయి వెయిట్ చేస్తోందని చెపుతూ నిశ్చితార్థం అయిన తర్వాతే ఆమె గురించి పూర్తి వివరాలు చెబుతానని ప్రభాస్ త‌న స‌న్నిహితుల‌కు చెప్పాడ‌ట‌. త‌న‌కు కాబోయే భార్య ఫొటో, పేరు బ‌య‌ట‌పెడితే అది మీడియాలో మ‌ళ్లీ పెద్ద సంచ‌ల‌నం అవుతుంద‌ని, బాహుబ‌లి 2 ప్ర‌మోష‌న్స్‌లో మీడియా నుంచి ప‌దే ప‌దే ఈ ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతాయ‌నే ప్ర‌భాస్ ఈ విష‌యాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నాడ‌ని తెలుస్తోంది.

 

త‌న భార్య సీక్రెట్లు చెప్పిన ప్ర‌భాస్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share