మెగా హీరోలను వెంట తిప్పుతున్న బ్యూటీ!

July 18, 2016 at 7:05 am
Hebba-Patel-Photo-Gallery

హెబ్బా పటేల్..కుమారి 21ఎఫ్‌తో ఒక్కసారిగా యువత హృదయాలను కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ.ఆ సినిమా టైం లో ఎక్కడ చూసినా ఈ కుమారి గురించే టాక్ వినిపించింది.అదే జోష్ లో ఈ అమ్మడు మరిన్ని యూత్ ఫుల్ చిత్రాలలో నటిస్తోంది. అయితే ఈ అమ్మడికి మెగా క్యాంప్ నుండి ఆఫర్ వచ్చింది.ఇంకేం ఎగిరి గంతేసి ఒప్పేసుకుంది.వరుణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకె క్కుతున్న మిస్టర్ సినిమాలో హీరోయిన్ గా బుక్ అయింది ఈ కుమారి.

ఇలా అడుగు పెట్టిందో లేదో మరో మెగా హీరోను తన వెంటపడేలా చేసిందట ఈ ముద్దుగుమ్మ.సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలోనూ హెబ్బా పటేల్ హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం.మెగా కంపౌండ్ లో మొదటిసినిమా సెట్స్ పై ఉండగానే మరో మెగా హీరోతో బుక్ అయిందంటే అమ్మడు బంపర్ ఆఫర్ కొట్టినట్టే.ముందు ముందు ఈ బ్యూటీ మెగా హీరోలందరి సరసన నటించినా ఆశ్చర్యం లేదు.

ఇదీ వరకే రెజీనా,తమన్నాలు కూడా ఇదే విధంగా కేరీర్ స్టార్ట్ చేసి మెగా హీరోలతో కెరీర్ లో దూసుకుపోయారు.ఏమో హెబ్బా కూడా ఈ అనుకోని ఆఫర్స్ తో తెలుగులో టాప్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఖచ్చింతంగా ఉందంటున్నారు సినీ పండితులు.

మెగా హీరోలను వెంట తిప్పుతున్న బ్యూటీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share