రానా రిక్వెస్ట్‌కు నో చెప్పిన ఎన్టీఆర్‌

January 30, 2017 at 6:54 am
193

ఏ రంగంలో అయినా సెంటిమెంట్లు అనేవి కామ‌న్‌. ఈ సెంటిమెంట్లు టాలీవుడ్‌లో కూడా కొత్తేం కాదు. ప‌లానా కాంబినేష‌న్ అయితే హిట్ కొడుతుంది… ఆ హీరో-డైరెక్ట‌ర్ కాంబినేష‌న్‌, ఆ హీరో-హీరోయిన్ కాంబినేష‌న్‌, ఆ హీరో-ఆ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాంబినేష‌న్ అయితే హిట్ అవుతుంద‌న్న సెంటిమెంట్లు ఆయా సినిమాల మీద అంచ‌నాలు పెంచేస్తుంటాయి.

ఈ క్ర‌మంలోనే యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కు ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్‌తోనే ద‌గ్గుపాటి హీరో రానాకు మ‌నోడు షాక్ ఇచ్చాడ‌ట‌. బాహుబ‌లిలో భల్లాల‌దేవుడిగా ఇండియ‌న్ వైజ్‌గా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యాడు ద‌గ్గుపాటి రానా. రానా న‌టించిన లేటెస్ట్ చిత్రం ఘాజీ. తెలుగు-త‌మిళ్‌-హిందీ భాష‌ల్లో ఏక‌కాలంగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

ఫిబ్ర‌వ‌రి 17న వ‌స్తోన్న ఘాజీ సినిమా హిందీ వెర్షన్ కు బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ వాయిస్ ఓవర్ చెప్పారు. తెలుగులో ఈ సినిమాకు వాయిస్ ఓవ‌ర్ చెప్పిచేందుకు ముందుగా ఎన్టీఆర్‌ను అనుకున్నారు. ఎన్టీఆర్ బేస్ వాయిస్ ఓవ‌ర్ ఎంత ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇప్పుడు ఘాజీ తెలుగులో చిరంజీవి వాయిస్ ఓవ‌ర్‌తో రిలీజ్ అవుతోంది.

తన వాయిస్ ఓవ‌ర్ విష‌యంలో బ్యాడ్ సెంటిమెంట్ ఉండ‌డంతో ఎన్టీఆర్ ఘాజీకి వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌న‌ని ..ఆ రిక్వెస్టును తిర‌స్క‌రించాడ‌ట‌. తాను వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన సినిమాలు అంత‌గా స‌క్సెస్ కాలేద‌ని… అందువ‌ల్ల ఘాజీకి తాను వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌లేన‌ని చెప్పాడ‌ట‌. అలాంటి సెంటిమెంట్లు పెట్టుకోవ‌ద్ద‌ని రానా చెప్పినా ఎన్టీఆర్ మాత్రం సున్నితంగా తిర‌స్క‌రించాడ‌ట‌.

 

రానా రిక్వెస్ట్‌కు నో చెప్పిన ఎన్టీఆర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share