అఖిల్ విష‌యంలో శ్రియా భూపాల్ అందుకే ఫీలైందా..!

February 24, 2017 at 6:32 am
Akhil

టాలీవుడ్‌లోను, ఏపీ, తెలంగాణ జ‌నాల్లోను గ‌త రెండు రోజులుగా ఓ వార్త బాగా న‌లుగుతోంది. అక్కినేని న‌వ‌మ‌న్మ‌థుడు అఖిల్ – ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త జీవీకే.రెడ్డి మ‌నుమ‌రాలు శ్రియా భూపాల్ పెళ్లి బ్రేక‌ప్ అయ్యింద‌న్న వార్త ఎక్క‌డ చూసినా జోరుగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. కొద్ది రోజుల క్రిత‌మే వీరి ఎంగేజ్‌మెంట్ అతిర‌ధ‌మ‌హార‌థుల స‌మ‌క్షంలో అత్యంత వైభ‌వంగా జ‌రిగింది.

త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లిపీట‌లు ఎక్క‌డం ఖాయ‌మ‌నుకుంటున్న టైంలో పిడుగులాంటి వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అఖిల్‌-శ్రియ మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో పూడ్చ‌లేని అగాధం ఏర్ప‌డింద‌ని…వీరి పెళ్లి క్యాన్సిల్ అయ్యింద‌న్న మ్యాట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. రోమ్‌లో జ‌రిగే వీరి పెళ్లికి టిక్కెట్లు బుక్ చేసుకున్న‌వారికి…వాటిని క్యాన్సిల్ చేసుకోవాల‌న్న వర్త‌మానం అంద‌డంతో ఈ మ్యాట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

సుబ్బ‌రామిరెడ్డి మ‌న‌మ‌డు పెళ్లిలో వీరి మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నా…అంత‌కు ముందు నుంచే వీరి మ‌ధ్య గ్యాప్ స్టార్ట్ అయిన‌ట్టు తెలుస్తోంది. రోమ్‌లో పెళ్లి ప‌నులు ప‌ర్య‌వేక్షించేందుకు వెళుతున్న టైంలో అఖిల్‌–శ్రియ ఎయిర్‌పోర్టులో గొడవపడ్డారని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అయితే శ్రియా వెర్ష‌న్ మ‌రోలా ఉంద‌ట‌. గ‌త మూడేళ్లుగా ఎంతో ఇష్టంగా తాను అఖిల్‌ను ప్రేమిస్తున్నా…త‌న‌తో మాత్రం స‌రిగ్గా స్పెండ్ చేయ‌డం లేద‌ని పెద్ద‌ల‌తో చెప్పింద‌ట‌. ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత కూడా త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆమె ఫీల్ అయిన‌ట్టు స‌మాచారం. ఇక ఈ గ్యాప్ పెద్ద‌దిగా మారి చివ‌ర‌కు ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరూ మాటా మాటా అనుకున్నారని.. ఇటలీకి పెళ్లికి వెళ్లాల్సిన అఖిల్‌ గోవాకీ, శ్రియ అమెరికాకీ చెక్కేశారనీ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

 

అఖిల్ విష‌యంలో శ్రియా భూపాల్ అందుకే ఫీలైందా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share