ఆ యంగ్ హీరోతో హ‌న్సిక ప్రేమాయ‌ణం

December 10, 2017 at 4:17 pm
Hansika, heroine, tollywood, love, affair

హ‌న్సిక తెలుగులో వ‌చ్చిన పూరీ జ‌గ‌న్నాథ్ – అల్లు అర్జున్ దేశ‌ముదురు సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి కోలీవుడ్‌లో స్థిర‌ప‌డిన ముంబై అమ్మాయి. ముంబైకి చెందిన హ‌న్సిక ముందుగా బాలీవుడ్‌లో హిందీ సినిమాల్లో బాల‌న‌టిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత దేశ‌ముదురు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చాక వెన‌క్కు తిరిగి చూసుకోలేదు. త‌మిళ‌నాడులో ఆమె త‌న బొద్దు బాడీతో అక్క‌డ ఖుష్బూ త‌ర్వాత ఆ రేంజ్‌లో క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్‌గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

అక్క‌డ హ‌న్సిక‌ను అంద‌రూ ముద్దుగా మినీ ఖుష్బూ అని కూడా పిలుచుకున్నారు. అయితే ఎంత త్వ‌ర‌గా పాపులారిటీ తెచ్చుకుందో హ‌న్సిక ఖుష్బూ లాగానే ఆమె కెరీర్‌లో ఎన్నో గాసిప్‌లు కూడా ఎక్కువుగా వ‌చ్చాయి. కెరీర్ స్టార్టింగ్‌లోనే శింబు – హ‌న్సిక ప్రేయామ‌ణంపై కోలీవుడ్‌లో పెద్ద చ‌ర్చే న‌డిచింది. వారిద్ద‌రు పెళ్లి పీట‌లు ఎక్కేందుకు రెడీ అవుతోన్న టైంలో బ్రేక‌ప్ అయ్యింది.

పెళ్లి త‌ర్వాత సినిమాలు మానేయాల‌ని శింబు అండ్ ఫ్యామిలీ కండీష‌న్ పెట్ట‌డం వ‌ల్లే వీరు విడిపోయార‌న్నది తెలిసిందే. ఈ విష‌యాన్ని శింబు తండ్రి రాజేంద‌ర్ కూడా చెప్పాడు. శింబుతో ఎఫైర్ త‌ర్వాత హ‌న్సిక పేరు జ‌యం ర‌వితో క‌లిసి వినిపించింది. వారిద్ద‌రి ప్రేమ వ్య‌వ‌హారం జ‌యం ర‌వి కుటుంబ స‌భ్యుల‌కు ఇష్టం లేద‌ని, దీనిపై వాళ్లింట్లో గొడ‌వ‌లు కూడా జ‌రిగిన‌ట్టు టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌ర్వాత ఈ పుకార్ల‌కు తెర‌ప‌డ‌డంతో హ‌న్సిక మ‌ళ్లీ సినిమాల్లో బిజీ అయ్యింది.

ఇప్పుడు మ‌రో యంగ్ హీరోపై హ‌న్సిక‌కు ప్రేమ చిగురించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. యంగ్ హీరో అధ‌ర్వ‌తో హ‌న్సిక ప్రేమ‌లో పడినట్టు తెలుస్తోంది. అయితే వారిద్ద‌రూ ఇంత‌వ‌రకు ఒక్క సినిమాలో కూడా క‌లిసి న‌టించ‌లేదు. మ‌రి వారికి ప‌రిచ‌యం ఎక్క‌డ క‌లిగింది… అది ప్రేమ‌కు ఎలా దారితీసిందో ఎవ‌రికీ తెలియ‌డం లేదు కానీ ప్ర‌స్తుతం కోలీవుడ్ మీడియా దృష్టంతా ఈ కొత్త ప్రేమ‌జంట పైనే ఉంది.

 

ఆ యంగ్ హీరోతో హ‌న్సిక ప్రేమాయ‌ణం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share