ఆ జ‌బ‌ర్ద‌స్త్ కమెడియన్ పెద్ద స్మ‌గ్ల‌ర్‌

July 12, 2018 at 11:49 am
Jabardasth, comedian, smuggler, viral, police

బుల్లితెర పాపుల‌ర్ షో జ‌బ‌ర్ద‌స్త్‌లో న‌వ్వులు పూయించే ఓ ఆర్టిస్ట్ తెర‌వెన‌క పెద్ద స్మ‌గ్ల‌ర్ అని తేలింది. జ‌బ‌ర్ద‌స్త్ షోలో చిన్నా చిత‌కా పాత్ర‌లు వేసుకునే స‌ద‌రు ఆర్టిస్ట్ ఇప్పుడు ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ ద్వారా కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్త‌డంతో పాటు సినిమాల‌కు ఫైనాన్స్ చేసేవ‌ర‌కు వెళ్లిపోయాడు. అస‌లు విష‌యంలోకి వెళితే తిరుప‌తికి చెందిన ఓ సాధార‌ణ వ్య‌క్తి టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించాడు. జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మంలో కూడా చిన్నా చిత‌కా పాత్ర‌లు వేసేవాడు.

ఈ సంపాద‌న అత‌డి జ‌ల్సాల‌కు స‌రిపోలేదు. దీంతో అత‌డు వ‌క్ర‌మార్గంలోకి ఎంట‌ర్ అయ్యాడు. ఆర్టిస్ట్‌గా వ‌చ్చిన పేరు వాడుకుంటూ ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌లోకి ఎంట‌ర్ అయ్యాడు. అక్క‌డ భారీ లాభాలు క‌ళ్ల‌చూశాడు. త‌న‌కు ప‌రిచ‌యం అయిన ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల‌తో శేషాచ‌లం అడ‌వుల్లో ఉన్న ఎర్ర‌చంద‌నం చెట్లు న‌రికి ఇత‌ర రాష్ట్రాల‌కు అక్ర‌మ ర‌వాణా చేసి భారీగా అక్ర‌మార్జ‌న‌కు తెర‌లేపాడు.

ఇత‌డి గురించి తిరుపతి టాస్క్ ఫోర్సు సిబ్బందికి సమాచారం అందింది. పోలీసుల విచార‌ణ‌లో దిమ్మ‌తిరిగే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. త‌న తోటి జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిస్ట్ న‌టించిన సినిమా ఇటీవ‌ల రిలీజ్ అయ్యింది. దీనికి కూడా అత‌డు ఫైనాన్స్ చేసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం అత‌డిపై 20 కేసులు న‌మోద‌య్యాయి. షాక్ ఏంటంటే ఇత‌గాడి దందాలో ఇంజ‌నీర్లు, డాక్ట‌ర్లు, ప్రైవేటు ఉద్యోగులు సైతం భాగ‌స్వాములుగా ఉన్నార‌ట‌. ఇత‌డు పోలీసుల‌కు దొరికితే చాలా విష‌యాలు వెలుగులోకి రానున్నాయి.

ఆ జ‌బ‌ర్ద‌స్త్ కమెడియన్ పెద్ద స్మ‌గ్ల‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share