8 సంవత్సరాలుగా ప్రేమించి…ప్రియుడు చేసిన ఘనకార్యం ఇది

June 18, 2018 at 11:05 am
Lovers, complaint, forcing money, demanding

స‌మాజంలో కొంద‌రి బ‌ల‌హీన‌త‌ల‌ను మ‌రికొంద‌రు బ‌లంగా మార్చుకుంటున్నారు. దీనికి తోడు సోష‌ల్ మీడియా తోడ‌వ్వ‌డంతో మ‌నం ఏం చేసినా బ‌య‌ట వాళ్ల‌కు మ‌న‌కు తెలియ‌కుండానే టార్గెట్ అవుతున్నాం. తాజాగా ఓ యువ‌కుడు ప్రియురాలితో ప్రేమ‌నాట‌కం ఆడి ఆమెతో స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు తీసి త‌న‌కు రూ.5 ల‌క్ష‌లు ఇవ్వ‌క‌పోతే వాటిని సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తాన‌ని బెదిరించాడు. బెంగ‌ళూరు న‌గ‌రంలో జ‌రిగిన ఈ బ్లాక్‌మెయిల్ ఉదంతం వివ‌రాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరు నగరానికి చెందిన మురుగేష్ కేఎం అనే యువకుడు 24 ఏళ్ల సాప్ట్ వేర్ ఇంజినీరు అయిన యువతిని ప్రేమించాడు. 8 సంవ‌త్స‌రాలుగా వీరిద్ద‌రు ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవ‌ల ప్రియుడి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రావ‌డంతో ఆ యువ‌తి మురుగేష్‌ను దూరం పెట్టింది. అయితే అప్ప‌టికే ఆమెతో స‌న్నిహితంగా ఉన్న వీడియోలు తీసిన మురుగేష్ వాటిని ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాన‌ని… అలా చేయకుండా ఉండాలంటే తనకు రూ.5లక్షలు ఇవ్వాలని మురుగేష్ తన మాజీ ప్రియురాలిని కోరాడు.

దీంతో ఆమె ఇప్ప‌టికే అత‌డి ఖాతాకు రూ.50 వేలు బ‌దిలీ చేసింది. మిగిలిన అమౌంట్ త‌ర్వాత ఇస్తాన‌ని చెప్పింది. అయితే మురుగేష్ మాత్రం ఈ నెల 17వ తేదీలోగా మిగిలిన అమౌంట్ త‌న అక్కౌంట్‌కు వేయ‌క‌పోతే అశ్లీల ఫోటోలు, వీడియోలు బహిర్గతం చేస్తాననడంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగి ఐటీ యాక్టు 2000, 76 ఎ సెక్షన్ల కింద మురుగేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.

8 సంవత్సరాలుగా ప్రేమించి…ప్రియుడు చేసిన ఘనకార్యం ఇది
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share