సెక్స్ రాకెట్‌లో ఆ హీరోయిన్‌కు ఊహించ‌ని షాక్‌

June 18, 2018 at 9:08 am
Mehreen Pirzada, questioned about us rocket, tollywood heroine

యూఎస్ సెంట‌ర్‌గా బ‌య‌ట‌కు వ‌చ్చిన టాలీవుడ్ వ్య‌భిచార దందాలో చాలా మంది హీరోయిన్ల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అయితే ఈ సెక్స్ రాకెట్‌లో త‌మ‌కు ఏ మాత్రం సంబంధం లేని హీరోయిన్లు కూడా ప‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. అధికారికంగా ఎవ‌రి పేర్లు బ‌య‌ట‌కు రాక‌పోయినా ఇప్పుడిప్పుడే ఇండ‌స్ట్రీలో రాణిస్తోన్న యంగ్ హీరోయిన్ల‌కు ఈ మేట‌ర్ చాలా ఇబ్బందిగా మారింది.

గోపీచంద్ తాజా సినిమా పంతంలో న‌టిస్తోన్న మెహ్రీన్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని వెకేష‌న్ కోసం యూఎస్ వెళ్లింది. అక్క‌డ ఆమెను ఇమ్రిగేష‌న్ అధికారులు వేసిన ప్ర‌శ్న‌ల‌తో ఆమె షాక్ అయ్యింద‌ట‌. యూఎస్‌లో ఆమె త‌న స్నేహితుల‌ను క‌లుసుకుని అక్క‌డ నుంచి కెన‌డా వెళుతుండ‌గా ఎయిర్‌పోర్టులో ఆమె టాలీవుడ్ హీరోయిన్ అని గుర్తించిన పోలీసులు ఆమెపై సుమారు 30 నిమిషాల పాటు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన‌ట్టు తెలుస్తోంది.

అమెరికాలో భారీ సెక్స్‌ రాకెట్‌ నడిపించిన కిషన్‌ మోదుగుమూడి దంపతులను ఇటీవల అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇదే విష‌యాన్ని పోలీసులు మెహ్రీన్‌ను అడిగార‌ట‌. ఈ విష‌యం వాళ్లు చెప్పే వ‌ర‌కు త‌న‌కు తెలియ‌ద‌ని ఆమె చెప్పింద‌ట‌. ఇంత‌కు ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా షేర్ చేసుకునే వ‌ర‌కు ఎవ్వ‌రికి తెలియ‌దు. త‌న కుటుంబ స‌భ్యులు అక్క‌డ ఉండ‌డం వ‌ల్ల తాను త‌ర‌చూ అక్క‌డ‌కు వెళుతుంటాన‌ని చెప్ప‌డంతో పోలీసులు అసౌక‌ర్యానికి క్ష‌మించ‌మ‌ని చెప్పిన‌ట్టు ఆమె తెలిపింది.

ఇక హీరోయిన్ల మీద వారికి ఉన్న అభిప్రాయంతో తాను ఎంతో ఆవేద‌న‌కు గురైన‌ట్టు ఆమె చెప్పింది. ఇక ఈ కేసు అస‌లు విష‌యానికి వ‌స్తే ఇప్పటికే అక్కడ ఈవెంట్స్ కోసం ఉన్న ముగ్గురు హీరోయిన్లను ఆరు గంటల పాటు విచారించారని వచ్చిన వార్తలు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో మెహ్రీన్ చెప్పినదాన్ని బట్టి చూస్తే ప్రమేయం లేకున్నా సరే తెలుగు సినిమా హీరోయిన్ అనే ట్యాగ్ ఉంటే చాలు విచారణ ఎదుర్కోవాల్సిన ఉంటుంది.

Mehreen Pirzada

సెక్స్ రాకెట్‌లో ఆ హీరోయిన్‌కు ఊహించ‌ని షాక్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share