షాకింగ్: నాని కాపురంలో శ్రీ రెడ్డి చిచ్చు

June 8, 2018 at 11:30 am
Nani, Sr Reddy

న‌టి శ్రీరెడ్డి రెండు నెల‌ల క్రితం టాలీవుడ్‌లో క్రియేట్ చేసిన సంచ‌ల‌నాలు అన్ని ఇన్నీ కావు. ఫిల్మ్ ఛాంబ‌ర్ ముందు అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు ప్ర‌తి రోజూ మీడియా ముందుకు వ‌చ్చి, ఎల‌క్రానిక్ ఛానెల్స్‌లో కూర్చొని నానా ర‌చ్చ ర‌చ్చ చేసింది. చివ‌ర‌కు ఎలాగోలా శ్రీరెడ్డి కాస్త సైలెంట్ అయ్యింద‌ని అనుకుంటూ ఆమె అప్పుడ‌ప్పుడూ మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూనే వ‌స్తోంది.

తాజాగా శ్రీరెడ్డి మ‌రోసారి నానిని టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. నానిని ఇప్ప‌టికే రెండు మూడు సార్లు టార్గెట్ చేసిన శ్రీరెడ్డి తాజాగా బిగ్‌బాస్‌-2 హోస్ట్‌ నానిని ఉద్దేశించి తీవ్రవ్యాఖ్యలు చేశారు. సదరు రియాలిటీ షోలో తన ఎంట్రీపై స్పష్టత ఇవ్వకుండా ఈ రకమైన కామెంట్లు చేయడం పబ్లిసిటీలో భాగమా ? అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

నానిని ఉద్దేశించి శ్రీరెడ్డి త‌న సోష‌ల్ మీడియాలో మేమిద్దరం కలిస్తే డర్టీ పిక్చరే: ‘‘నానితో నేను కలిస్తే ఇక డర్టీ పిక్చరే! కానీ ఎప్పుడు? అతిత్వరలోనే.. మీ ముందుకు రాబోతున్నది. నాని రాసలీలలు అన్నీ బయటపెడతా. నాని కాపురంలో ఇక నిప్పులే..’’ అని పేర్కొంది. శ్రీరెడ్డి కామెండ్లు నిజంగానే చేసిందా ? లేదా మరో రెండు రోజుల్లో బిగ్‌బాస్‌ సీజన్‌ 2 షో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప‌బ్లిసిటీ కోసం ఈ వ్యాఖ్య‌లు చేసిందా ? అన్న‌ది అర్థం కావ‌డం లేదు.

బిగ్‌ బాస్‌ 2లో శ్రీ రెడ్డి పాల్గొంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వార్తలను బిగ్ బాస్‌ నిర్వాహకులు గానీ శ్రీరెడ్డి గానీ ధృవీకరించలేదు. ఏదేమైనా బిగ్ బాస్ ప్రారంభ‌మైన వెంట‌నే నాని విష‌యంలో శ్రీరెడ్డి పెద్ద బాంబ్ పేల్చే ఛాన్స్ ఉంది…అది నానిమీద నెగిటివ్‌గానా ? లేదా ? బిగ్ బాస్ ప‌బ్లిసిటీ స్టంట్లో భాగ‌మా ? అన్న‌ది చూడాలి.

sr-reddy-nani

షాకింగ్: నాని కాపురంలో శ్రీ రెడ్డి చిచ్చు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share