షాక్..బిగ్ బాస్ నుంచి నాని ఔట్..!

June 19, 2018 at 4:22 pm

తెలుగు బుల్లితెరపై ఎన్టీఆర్ మొదటి సారి వ్యాఖ్యాతగా ‘బిగ్ బాస్’ తో ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 1 డెబ్బై రోజులు కోలాహలంగా సాగింది. ప్రతిరోజూ సభ్యుల మద్య మాట యుద్దాలు..బుజ్జగింపులు..అలకలు ఇలా ఎంట్రటైన్ మెంట్ తో సాగింది. ఇక శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ చేసే సందడి చెప్పనవసరం లేదు. ఒకదశలో బిగ్ బాస్ వచ్చే సమయానికి ఇతర ఛానల్స్ అన్నీ మూగబోయే విధంగా ఉండేది. అసలు బిగ్ బాస్ సీజన్ 1 సక్సెస్ అవ్వడానికి తారక్ కారణం అనడంలో అతిశయోక్తి లేదు.. హోస్ట్ గా తారక్ అంతలా మెప్పించాడు.. దాంతో ప్రేక్షకులు బిగ్ బాస్ -2 ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూసారు.. కానీ ఇంతలో ఓ వార్త బయటికొచ్చింది, సీజన్ 2 కి తారక్ హోస్ట్ గా చేయట్లేదని.. దీంతో ప్రేక్షకులు నిరాశ చెందారు.

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 2 నడుస్తుంది. ఈసారి ఎన్టీఆర్ ప్లేస్ లో నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సీజన్ 2 కి తారక్ హోస్ట్ గా చేయట్లేదని.. దీంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. నాని పక్కింటి కుర్రాడిలా ఉంటాడు కాబట్టి నాని కూడా హోస్ట్ గా మెప్పిస్తాడు అనుకున్నారు.. బిగ్ బాస్ -2 ప్రారంభమైంది.. ఫస్ట్ ఎపిసోడ్ నాని అంతగా ఆకట్టుకోలేదు.. ప్రేక్షకులు ఈ సీజన్ కూడా తారక్ అయితేనే బాగుండేది అనుకోవడం మొదలుపెట్టారు. ఇక ప్రేక్షకుల్లో నాని మీద ఆశ పోయింది, బిగ్ బాస్ మీద అసహనం పెరిగింది.

దీనికి తోడు హౌజ్ లో ఉన్న సభ్యులు కూడా పెద్దగా రాణించలేక పోతున్నారు. పర్సనల్ విషయాల్లో తలదూర్చుకుంటూ..ఒకరి పై ఒకరు చాడీలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక మోడల్ సంజన విషయం మొదటి నుంచి వివాదాస్పదంగా కొనసాగడం..తేజస్విని అయితే ఏకంగా సెలబ్రెటీ అయితే బయట చూపించు అంటే సూటిగా చెప్పడంతో సభ్యుల్లో ఎంతగా వివాదం చెలరేగుతుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు శని, ఆదివారల్లో నాని తన ఎఫెక్ట్ ఏమాత్రం చూపించకుండా అందరు కంటెస్టంట్లతో బుజ్జగించి మాట్లాడటం..ఏమాత్రం గట్స్ చూపించకపోవడం చూస్తుంటే..భవిష్యత్ లో మనోడు ఏలా రాణించగలడు అన్న అనుమానాలు అటు మేనేజ్ మెంట్ కి..ఇటు ప్రేక్షకులకు అనుమానాలు వస్తున్నాయి.

నాని తరువాతి ఎపిసోడ్స్ లో కూడా మెప్పించకపోతే, అవసరమైతే నాని ప్లేస్ లో వేరొకరిని హోస్ట్ గా తీసుకురావాలని చూస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.. దీంతో ప్రేక్షకుల్లో తారక్ వస్తాడా ? లేక వేరే ఎవరైనా వస్తారా? అని ప్రశ్నలు మొదలయ్యాయి.. ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలీదు కానీ అవార్డు ఫంక్షన్స్, ఈవెంట్స్ లో హోస్ట్ గా అదరగొట్టే నాని, ఫాములోకి వచ్చి బిగ్ బాస్ లో కూడా అదరగొట్టాలని ఆశిద్దాం.

షాక్..బిగ్ బాస్ నుంచి నాని ఔట్..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share