శ్రీరెడ్డి నాని నోటీసు వెనుక….ఆ లేడీ

June 12, 2018 at 5:51 pm
Nani, Sr Reddy, tollywood, court notices

ఆ యంగ్ హీరో నాని ఇండ‌స్ట్రీలో మంచి ఫామ్‌లో ఉన్నాడు. గ‌త మూడేళ్లుగా అస‌లు ప్లాపే లేదు. అయితే నాని చివ‌రి సినిమా మాత్రం రెండు నెల‌ల క్రితం రిలీజ్ అయ్యి డిజాస్ట‌ర్ అయ్యింది. ఇండ‌స్ట్రీలో ఎవ‌రి వెన్నుద‌న్ను లేకుండా క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చిన నాని ఎలాంటి వివాదాలు లేకుండా త‌న జాగ్ర‌త్త‌లో తాను ఉంటాడు. నానిపై ఇటీవ‌ల శ్రీరెడ్డి చాలా కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు చేసింది.

ఇవి బాగా శృతి మించి నానిపై అంద‌రికి అనుమానాలు వ‌చ్చే వ‌ర‌కు వెళ్లాయి. వీటిని ప‌ట్టించుకునే ఉద్దేశం నానికు లేక‌పోయినా ఆయ‌న భార్య చాలా కోపంగా ఉంద‌ట‌. వీటిపై రియాక్ట్ అవ్వ‌క‌పోతే అవే పుకార్లు అంద‌రూ న‌మ్ముతార‌ని భావించిన ఆమె ఒత్తిడి ద్వారా చివ‌ర‌కు నాని త‌న‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన శ్రీ రెడ్డిపై నోటీసులు పంపే వ‌ర‌కు వ్య‌వ‌హారం వెళ్ళింది.

నాని శ్రీ రెడ్డి మాట‌లు లైట్ తీస్కొన్నా భార్య మాత్రం ఈ మాట‌ల వ‌ల్ల తన ఫ్రెండ్స్ సర్కిల్ లో పరువు పోతోందని.. తల ఎత్తుకోలేకపోతున్నానని.. ఏదో ఒకటి చేయమని.. దాదాపుగా ఏడ్చేసిందట నాని భార్య. మరి తన అర్ధాంగిని ఓ విషయం అంతగా బాధ పెడుతుంటే నాని ఎలా సైలెంటుగా ఉంటాడు చెప్పండి.. అందుకే నోటీసులు పంపే వరకూ వ్యవహారం వచ్చిందని టాక్ వినిపిస్తోంది.

శ్రీరెడ్డి నాని నోటీసు వెనుక….ఆ లేడీ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share