ముంబై ఎయిర్‌పోర్టులో కొత్త ల‌వ‌ర్‌తో అడ్డంగా బుక్ అయిన శృతి

February 17, 2017 at 6:03 am
Shruthi Haasan

విశ్వ‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ గారాల ప‌ట్టి శృతిహాస‌న్ సినిమాల కంటే వ్య‌క్తిగ‌త అంశాల్లోనే ఎక్కువుగా వార్త‌ల్లో నిలుస్తోంది. హిందీ-తెలుగు-త‌మిళ్ ఇలా ఈ మూడు భాష‌ల్లోను రూ.100 కోట్ల సినిమాలున్న ఏకైక హీరోయిన్‌గా రికార్డుల‌కెక్కిన శృతి తాజాజా ఓ కొత్త ప్రియుడితో ఎఫైర్ కంటిన్యూ చేస్తోంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.

శృతి కొత్త ప్రియుడిని ప‌ట్టేసింద‌న్న వార్త‌లు గ‌త మూడు నాలుగు నెల‌లుగా వినిపిస్తున్నా వీటికి ఆధారాలు లేవు. తాజాగా ఆమె ఓ వ్య‌క్తితో క‌లిసి ముంబై ఎయిర్‌పోర్టులో కెమేరాల‌కు అడ్డంగా దొరికేసింది. ఇటాలియ‌న్ కుర్రాడు, లండ‌న్ బేస్‌డ్ యాంక‌ర్ అయిన మైకేల్ కోర్స‌ల్‌తో ఆమె గ‌త నాలుగైదు నెల‌లుగా ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తోంద‌ట‌. ఈ మ్యాట‌ర్ ఇన్ని రోజులు సీక్రెట్‌గా మెయింటైన్ చేసినా ఇప్పుడు ముంబై ఎయిర్‌పోర్టులో హాఫ్ బ్లాక్ డ్రెస్‌తో స్పెట్స్ పెట్టుకుని అత‌డి ప‌క్క‌న న‌డిచొస్తున్న శృతిని చూసి అంద‌రూ షాక్ అయిపోయారు.

ఇక గ‌తంలో కూడా శృతి ప‌లువురు హీరోల‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. త‌ర్వాత అవ‌న్నీ బ్రేక‌ప్ అవ్వ‌డ‌మో లేదా కంచికి చేర‌డ‌మో జ‌రిగిపోయాయి. మ‌రి ఈ కొత్త ల‌వ్ స్టోరీ & రూమ‌ర్లు ఎక్క‌డి వ‌ర‌కు వెళ‌తాయో చూడాలి. ఇక తెలుగులో ప్ర‌స్తుతం ప‌వ‌న్ స‌ర‌స‌న శృతి న‌టిస్తోన్న కాట‌మ‌రాయుడు సినిమా ఉగాది కానుక‌గా మార్చి చివ‌రి వారంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 

ముంబై ఎయిర్‌పోర్టులో కొత్త ల‌వ‌ర్‌తో అడ్డంగా బుక్ అయిన శృతి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share