బెజవాడలో దారుణం 14 ఏళ్ల బాలుడిపై మహిళ ఆ పని

June 9, 2018 at 12:34 pm
Vijayawada, 14 years, boy, women, harassment
ఏపీ కేపిట‌ల్ సెంట‌ర్ విజ‌య‌వాడ నగరంలో ఘోరం జరిగింది. మ‌నం స‌హజంగా అమ్మాయిలు, మైన‌ర్ బాలిక‌ల‌పై అత్యాచారాలు, లైంగీక దాడులు సంఘ‌ట‌న‌లు చూస్తూ ఉన్నాం. అయితే ఇందుకు రివ‌ర్స్‌లో విజ‌య‌వాడ‌లో ఓ సంఘ‌ట‌న జ‌రిగింది.  విజయవాడలోని నున్న ప్రాంతంలో 14 ఏళ్ల బాలుడిపై ఓ మహిళ అత్యాచారయత్నానికి ఒడిగట్టింది. ఆమె త‌న కోరిక తీర్చుకునేందుకు ఈ మైన‌ర్ బాలుడిని వాడుకునేందుకు ప్ర‌య‌త్నించింది.
 
మహిళ లైంగిక దుశ్చర్య నుంచి తప్పించుకున్న బాలుడు తల్లికి జరిగిన దుర్మార్గం గురించి చెప్పాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆమెపై దాడి చేశారు. వెంట‌నే ఆమెపై నున్న పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. నిందితురాలిపై ఫోక్సో (లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించే చట్టం) కింద కేసు నమోదుచేసిన పోలీసులు.. ఆమెను అరెస్టు చేశారు. 
 
బాధిత బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స‌మాజం తీరు రోజు రోజుకు మారిపోతోంది అనేందుకు ఈ సంఘ‌ట‌నే పెద్ద నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది
బెజవాడలో దారుణం 14 ఏళ్ల బాలుడిపై మహిళ ఆ పని
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share