అఖిల్ – శ్రియా భూపాల్ పెళ్లి ర‌ద్దు వెన‌క ఏం జ‌రిగింది..!

February 22, 2017 at 5:54 am
Akhil

సినీతారల ప్రేమవ్యవహారాలు ఊహకందకుండా ఉంటాయి. వారు ఎప్పుడు ఎవ‌రితో ఉంటారో ? ఎప్పుడు విడిపోతారో ? కూడా ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. కొంద‌రైతే పెళ్లి చేసుకుని సంవ‌త్స‌రాల పాటు సంసారం చేసి కూడా విడిపోతుంటారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహం క్యాన్సిల్ అయ్యింద‌నే వార్త టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.

ఇటీవలే అఖిల్, శ్రేయ భూపాల్ నిశ్చితార్ధం చాలా గ్రాండ్‌గా జ‌రిగింది. వీరి పెళ్లి డేట్ కూడా త్వ‌ర‌లోనే ఫిక్స్ అవుతుంద‌ని అంద‌రూ అనుకుంటున్న టైంలో ఈ షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. వాస్త‌వానికి అఖిల్ కంటే శ్రియా భూపాల్ వ‌య‌స్సులో పెద్ద‌ది. అయితే వీరిద్ద‌రు ప్రేమించుకోవ‌డంతో పాటు నాగ్‌-జివికె కుటుంబాల మ‌ధ్య సాన్నిహిత్యం దృష్ట్యా వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్ద‌లు ఒప్పుకున్నారు.

అఖిల్ – శ్రియాకు మ‌నస్ప‌ర్థ‌లు రావ‌డంతో వీరి వివాహం క్యాన్సిల్ అయిన‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పెళ్లి త‌ర్వాత విబేధాలతో ఇబ్బంది ప‌డేక‌న్నా ముందుగానే వివాహం క్యాన్సిల్ చేసుకుంటేనే మంచిద‌ని నాగ్‌, జివికె.రెడ్డి కుటుంబాలు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఏదేమైనా అఖిల్ సినిమాతో పెద్ద డిజాస్ట‌ర్ ఎదుర్కొన్న అఖిల్ కేరీర్ గాడిలో ప‌డ‌కముందే ఇలా జ‌ర‌గ‌డం అక్కినేని అభిమానుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. ఇక వీరి వివాహాన్ని రోమ్‌లో చాలా గ్రాండ్‌గా జ‌ర‌పాల‌ని కూడా నిర్ణ‌యం తీసుకున్నారు. ఇరు కుటుంబాల బంధువులు త్వ‌ర‌లోనే ఇట‌లీ వెళ్లేందుకు డిసైడ్ అవుతున్న టైంలో వారి ప్ర‌యాణాల‌ను క్యాన్సిల్ చేసుకోవాల‌ని ఆదేశాలు వెళ్లాయ‌ట‌.

 

అఖిల్ – శ్రియా భూపాల్ పెళ్లి ర‌ద్దు వెన‌క ఏం జ‌రిగింది..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share