గౌత‌మ్‌నంద TJ రివ్యూ

టైటిల్‌: గౌత‌మ్‌నంద‌

జాన‌ర్‌: యాక్ష‌న్ మూవీ

న‌టీన‌టులు: గోపీచంద్‌, హ‌న్సిక‌, కేథ‌రిన్ థెస్రా, సచిన్ కేడ్క‌ర్‌, ముఖేష్ రుషీ

మ్యూజిక్‌: థ‌మ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ: సుంద‌ర్ రాజ‌న్‌

నిర్మాత‌లు: జె. భగవాన్, జె. పుల్లారావు

ద‌ర్శ‌క‌త్వం: స‌ంప‌త్‌నంది

రిలీజ్ డేట్‌: 28 జూలై, 2017

మాస్ హీరో గోపీచంద్ కొద్ది రోజులుగా స‌రైన హిట్ లేక కెరీర్‌లో వెన‌క‌ప‌డిపోయాడు. త‌న‌తోటి యంగ్ హీరోలు వ‌రుస హిట్ల‌తో దూసుకెళుతుంటే గోపీ మాత్రం ఒక్క హిట్ కోసం అర్రులు చాస్తున్నాడు. సౌఖ్యం లాంటి డిజాస్ట‌ర్ సినిమా త‌ర్వాత యేడాదిన్న‌ర గ్యాప్ తీసుకుని గోపీ, బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత దాదాపు అంతే గ్యాప్ తీసుకున్న ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది క‌లిసి చేసిన సినిమా గౌతమ్‌నంద‌. రిలీజ్‌కు ముందే టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో మంచి హైప్ తెచ్చుకుని గోపీ కెరీర్‌లోనే ఈ సినిమా హ‌య్య‌స్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ రోజు భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన గౌత‌మ్‌నంద అంచ‌నాలు అందుకుందో లేదో…ఈ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:

ఫోర్బ్స్ లిస్టులో స్థానం సాధించిన ప్ర‌ఖ్యాత తెలుగు బిలియ‌నీర్ ఘ‌ట్ట‌మ‌నేని విష్ణు ప్ర‌సాద్ (స‌చిన్ కేడ్క‌ర్‌) త‌న‌యుడు ఘట్టమనేని గౌతమ్ (గోపిచంద్). కోటీశ్వ‌రుడి బిడ్డ కావ‌డంతో లైఫ్‌ను పిచ్చ పిచ్చ‌గా ఎంజాయ్ చేసే గౌత‌మ్‌కు త‌న తండ్రి పేరు లేకుండా వ్య‌క్తిగ‌తంగా తాను ఏంటి ? అన్న ప్ర‌శ్న ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఈ క్ర‌మంలోనే గౌత‌మ్‌కు అచ్చం త‌న‌లాగే ఉన్న మ‌రో వ్య‌క్తి నంద కిశోర్ ఎదురుపడతాడు.

డ‌బ్బు త‌ప్ప మ‌రో బాధ తెలియ‌ని గౌత‌మ్‌, డ‌బ్బుతో ఏదైనా చాలు అనుకునే మ‌న‌స్త‌త్వం ఉన్న నంద త‌మ ప్లేస్‌లు మార్చుకుని ఒక‌రి ఇంటికి మ‌రొక‌రు వెళ‌తారు. నందు ఇంట్లోకి ఎంట‌ర్ అయిన గౌత‌మ్ వారి ప్రేమ‌తో జీవితం అంటే అర్థం ఏంటో తెలుసుకుంటాడు. ఆ కుటుంబ క‌ష్టాలు తీర్చేందుకు ఓ చిన్న ఉద్యోగంలో చేర‌తాడు.

ఇలా ప్లేస్‌లు మార్చుకున్న ఈ ఇద్ద‌రి జీవితాల్లో జ‌రిగిన సంఘ‌ట‌నలు ఏంటి ? ఈ సంఘ‌ట‌న‌లకు విష్ణు ప్రసాద్ స్నేహితుడు ముద్ర (ముఖేష్ రుషి)కి సంబంధం ఏంటి ? ఈ క‌థ‌లో మైండ్ బ్లాక్ అయ్యే నిజం ఏంటి ? చివరకు నందు, గౌతమ్ ఎవరి స్థానాల్లోకి వారు వచ్చారా..? అన్నదే మిగతా కథ.

విశ్లేష‌ణ‌:

యాక్ష‌న్ హీరోగా ఇప్ప‌టికే తానేంటో ఫ్రూవ్ చేసుకున్న గోపీచంద్ ఈ సినిమాలో త‌న‌దైన స్టైల్‌తో పాటు బాడీ లాంగ్వేజ్‌తో అల‌రించాడు. గౌత‌మ్‌, నంద రెండు క్యారెక్ట‌ర్ల‌లోను మంచి వేరియేష‌న్ చూపించాడు. హీరోయిన్ల‌లో కేథ‌రిన్ న‌ట‌న‌కు స్కోప్ లేక‌పోవ‌డంతో గ్లామ‌ర్ షోతో ఆక‌ట్టుకుంది. ఇక హన్సిక త‌క్కువ సేపే స్క్రీన్ మీద ఉన్నా, ఉన్నంత సేపు ప‌ర్వాలేద‌నిపించింది. విలన్లుగా ముఖేష్ రుషి, నికితిన్ ధీర్ ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో సచిన్ కేడ్కర్, చంద్రమోహన్, సీత తమ పరిధి మేరకు పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికంగా చూస్తే సినిమాకు సుంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ ప్ల‌స్ పాయింట్‌. దుబాయ్ అందాలు, నిర్మాత‌లు పెట్టిన ప్ర‌తి రూపాయి తెర‌మీద చ‌క్క‌గా ప్ర‌జెంట్ చేయ‌డంలో సినిమాటోగ్ర‌ఫీకి మంచి మార్కులు ప‌డ‌తాయి. థ‌మ‌న్ పాట‌ల్లో పాట‌లు పెద్ద‌గా ప్ర‌భావం చూప‌క‌పోయినా ఆర్ ఆర్ మాత్రం అదిరిపోయింది. ఎడిటింగ్ ఓకే. నిర్మాత‌లు సినిమాకు ఎక్క‌డా రాజీప‌డ‌కుండా బాగా ఖర్చు పెట్టారు.

సంప‌త్ నంది ఎలా తీశాడు….

ప‌ర‌మ రొటీన్ క‌థ‌ల‌తో క‌మ‌ర్ష‌యల్‌గా మంచి హిట్ సినిమాలు తీస్తోన్న సంప‌త్‌నంది ఈ సినిమాకు కూడా అదే పంథాలో వెళ్లాడు. రొటీన్ క‌థే తీసుకున్నా గోపీచంద్ క్యారెక్ట‌ర్ల‌లో తీసుకున్న కేర్‌తో పాటు సినిమాను స్టైలీష్‌గా ప్ర‌జెంట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. రెండు పాత్ర‌ల్లో రెగ్యుల‌ర్‌గా చాలా సినిమాల్లో మ‌నం చూసిన క‌థనే కొత్తగా, స్టైలీష్‌గా ప్ర‌జెంట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు.

ఫ‌స్టాఫ్‌లో క్లాస్ ట‌చ్‌, సెకండాఫ్‌లో యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో సినిమా న‌డిచింది. ఎమోష‌న‌ల్ సీన్ల‌తో పాటు యాక్ష‌న్ ఎలిమెంట్స్ బాగా డీల్ చేసి హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేయ‌డంలో బాగా స‌క్సెస్ అయ్యాడు. కామెడీ పేల‌క‌పోయినా ఫంక్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా సినిమాను తీసి ప‌డేశాడు.

ప్ల‌స్ పాయింట్స్ (+) :

– గోపీచంద్ నెగిటివ్ రోల్‌

– యాక్ష‌న్ ఎపిసోడ్స్‌

– మాస్ ఎలిమెంట్స్‌

– పేలిన డైలాగ్స్

– సంప‌త్‌నంది ట్రీట్‌మెంట్ గుడ్‌

మైన‌స్ పాయింట్స్ (-):

– రొటీన్ స్టోరీ

– స్లో నెరేష‌న్‌

– సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు

– పేల‌ని కామెడీ

ఫైన‌ల్ పంచ్‌:

పాత క‌థ‌కే కొత్త ట్రీట్‌మెంట్ ‘ గౌత‌మ్‌నంద‌ ‘

‘ గౌత‌మ్‌నంద ‘ TJ రేటింగ్‌: 2.75 / 5